AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యాక్టింగ్ నేర్పుతానంటూ లైంగిక వేధింపులు.. ‘సూత్రధారి’ గుట్టు బయటపడింది

నటన నేర్పుతానంటూ చెప్పి యువతులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ కీచకుడు. యువతులను గదిలో బంధించి వారితో అసభ్యంగా ప్రవర్తించాడు. అతడి వేధింపులు తాళలేక ఓ యువతి మీడియాను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం హిమాయత్ నగర్‌కు చెందిన వినయ్ వర్మ ‘సూత్రధార’ అనే వర్క్‌ షాప్‌ను స్థాపించి యాక్టింగ్ పేరిట ప్రకటనలు ఇస్తూ యువతులను ఆకట్టుకున్నాడు. ఇందుకు ఫీజు కూడా చెల్లించాలంటూ నిబంధన ‘విధించాడు’. నటన మీద మోజుతో […]

యాక్టింగ్ నేర్పుతానంటూ లైంగిక వేధింపులు.. ‘సూత్రధారి’ గుట్టు బయటపడింది
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 17, 2019 | 7:15 PM

Share

నటన నేర్పుతానంటూ చెప్పి యువతులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ కీచకుడు. యువతులను గదిలో బంధించి వారితో అసభ్యంగా ప్రవర్తించాడు. అతడి వేధింపులు తాళలేక ఓ యువతి మీడియాను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం హిమాయత్ నగర్‌కు చెందిన వినయ్ వర్మ ‘సూత్రధార’ అనే వర్క్‌ షాప్‌ను స్థాపించి యాక్టింగ్ పేరిట ప్రకటనలు ఇస్తూ యువతులను ఆకట్టుకున్నాడు. ఇందుకు ఫీజు కూడా చెల్లించాలంటూ నిబంధన ‘విధించాడు’. నటన మీద మోజుతో ఈ ప్రకటనలకు ఆకర్షితురాలైన ఓ యువతి ఇటీవల ఆయన కోచింగ్ సెంటర్‌లో చేరింది. తన ఫీజు 25వేలు కూడా చెల్లించిందట. క్లాస్‌లలో భాగంగా ఈ నెల 15న ఎనిమిది మందితో కలిసి ఆ యువతి క్లాస్‌లకు హాజరయ్యింది. కానీ నటన విషయం పక్కనపెట్టి వినయ్.. వారందరినీ ఓ గదిలో బంధించి వేధించాడట. నటన నేర్చుకోవాలంటే తన ముందు బట్టలు విప్పాలంటూ వారిపై ఒత్తిడి తీసుకొచ్చాడట. దీనికి నిరాకరించిన యువతిని క్లాస్ నుంచి బయటకు పంపేశాడట. దీంతో ఆ యువతి షీ టీమ్‌ను ఆశ్రయించినా.. అక్కడ ఆమెకు సరైన స్పందన లేకపోవడంతో ఆమె మీడియాను ఆశ్రయించి అసలు విషయాన్ని బయటపెట్టింది.

అయితే దీనిపై వినయ్ మాట్లాడుతూ.. ‘‘నా ఇనిస్టిట్యూట్‌లో ఎంతోమంది హీరో, హీరోయిన్లు తయారయ్యారు. నేను డ్రెస్ విషయంలో ఎవరినీ ఫోర్స్ చేయలేదు. నా ట్రైనింగ్‌లో కొన్ని మాడ్యూల్స్ ఉన్నాయి. అవి ఇష్టం లేకుంటే వెళ్లిపొమ్మని ఆ అమ్మాయికి చెప్పా. నారాయణ గూడ పోలీసులకు, షీ టీమ్‌కు ఇదే విషయాన్ని చెప్పా. 20ఏళ్లుగా సూత్రధార్ ఇనిస్టిట్యూట్‌ను నడిపిస్తున్నా. నాపై కావాలనే ఆరోపణలు చేస్తున్నారు. ఆ అమ్మాయికి యాక్టింగ్‌పై ఇంట్రస్ట్ లేదు. నేను ఏ తప్పు చేయలేదు’’ అంటూ సమర్థించుకున్నాడు.

Follow Us
ఫ్రిజ్ లేకపోయినా పచ్చిమిర్చి నెలల తరబడి తాజాగా ఉండాలా?
ఫ్రిజ్ లేకపోయినా పచ్చిమిర్చి నెలల తరబడి తాజాగా ఉండాలా?
ఎన్టీఆర్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఈమెనే..
ఎన్టీఆర్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఈమెనే..
ఆర్జీవీ లేకపోతే నేను లేను.. కిచ్చా సుదీప్..
ఆర్జీవీ లేకపోతే నేను లేను.. కిచ్చా సుదీప్..
జస్ట్ 30 రోజుల్లోనే లక్ష సంపాదన.. ఆ జిల్లా రైతులపై కాసులు వర్షం
జస్ట్ 30 రోజుల్లోనే లక్ష సంపాదన.. ఆ జిల్లా రైతులపై కాసులు వర్షం
రాహువుతో జాగ్రత్త.. ఆ రాశుల వారికి ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు..!
రాహువుతో జాగ్రత్త.. ఆ రాశుల వారికి ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు..!
నా లవర్‌తో మాట్లాడిస్తారా ?? లేదా ఇక్కడ నుండి దూకేయమంటారా?
నా లవర్‌తో మాట్లాడిస్తారా ?? లేదా ఇక్కడ నుండి దూకేయమంటారా?
ఇలాంటి వ్యక్తులు మీ జీవితం లో ఉంటే.. త్వరగా ముసలివారు అవుతారు !
ఇలాంటి వ్యక్తులు మీ జీవితం లో ఉంటే.. త్వరగా ముసలివారు అవుతారు !
పెళ్లికి ముందు సూది మందు.. ఒక్కటి పడితే చాలు బరువు తగ్గాల్సిందే
పెళ్లికి ముందు సూది మందు.. ఒక్కటి పడితే చాలు బరువు తగ్గాల్సిందే
ప్రాణం పోసిన స్నేక్‌ క్యాచర్‌కు నాగుపాము కృతజ్ఞత..
ప్రాణం పోసిన స్నేక్‌ క్యాచర్‌కు నాగుపాము కృతజ్ఞత..
టీమిండియా ఛీ కొట్టినా.. బ్యాడ్ లక్కోడి ఆటతీరుకు కోహ్లీ ఫిదా
టీమిండియా ఛీ కొట్టినా.. బ్యాడ్ లక్కోడి ఆటతీరుకు కోహ్లీ ఫిదా