నాగార్జున అగ్రికల్చరల్ వర్సిటీ వీసీ వల్లభనేని అరెస్ట్.. ఎందుకు..?
ఆచార్య నాగార్జున వ్యవసాయ విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ వల్లభనేని దామోదర్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సిబ్బందిని కులం పేరుతో దూషించిన ఘటనలో వీసీ పై కేసు నమోదైంది. సెక్షన్ ఐసీసీ 506 కింద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రాథమిక విచారణ అనంతరం ఆయనను అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా రిమాండ్ విధించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం పురుషోత్తమపట్టణం గ్రామానికి చెందిన ఉయ్యాల మురళీకృష్ణ మూడేళ్ల కిందట […]
ఆచార్య నాగార్జున వ్యవసాయ విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ వల్లభనేని దామోదర్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సిబ్బందిని కులం పేరుతో దూషించిన ఘటనలో వీసీ పై కేసు నమోదైంది. సెక్షన్ ఐసీసీ 506 కింద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రాథమిక విచారణ అనంతరం ఆయనను అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా రిమాండ్ విధించారు.
గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం పురుషోత్తమపట్టణం గ్రామానికి చెందిన ఉయ్యాల మురళీకృష్ణ మూడేళ్ల కిందట అంటే (2016)లో రంగ వర్సిటీ అనే ఎన్జీఓలో అటెండర్‌గా నియమితుడయ్యాడు. ఈ తర్వాత వీసీగా వచ్చిన దామోదర నాయుడు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఏప్రిల్ 12, 2019న మురళీకృష్ణని ఉద్యోగం నుంచి తొలగించారు. కారణం లేకుండా ఉద్యోగం నుంచి తొలగించడం సరికాదని, తనను విధుల్లోకి తీసుకోవాలని గత నెల 23న సచివాలయం వద్దకు వెళ్లి దామోదర్ నాయుడిని కోరారు.
కానీ వీసీ వల్లభనేని దామోదర్.. మురళీకృష్ణతో దురుసుగా ప్రవర్తించాడు. కులంపేరుతో అతడిని దూషించి బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో మురళీకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వీసీ బెదిరించిన సీసీటీవీ ఫుటేజ్‌ని పోలీసులకు చూపించాడు. దీనిని పరిశీలించిన పోలీసులు వీసీని అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు. దీంతో అతడిపై 15 రోజుల పాటు జ్యూడీషియల్ కస్టడీ విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. కాగా, రెండు సంవత్సరాల క్రితం కూడా వీసీ పై ఇలాంటి కేసు నమోదైంది. వైసీపీకి అనుకూలంగా ఉన్నారన్న కారణంతో.. మురళీకృష్ణ ఆయన భార్యతో పాటు మరికొందరు ఉద్యోగులను కూడా కారణంగా లేకుండా తొలగించాడన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. వీసీ చర్యల కారణంగా నష్టపోయిన ఉద్యోగులు ఇప్పటికే గవర్నర్, సీఎంలకు ఫిర్యాదు చేశారు. వైసీ ఛాన్సలర్ పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించాల్సిందిగా సీఎం జగన్ అదేశాలు కూడా జారీ చేశారు.