అభాదేవి… ఈ పేరు చెబితే అక్కడ రౌడీలకు హడల్‌!

బిహార్‌ లోని పట్నా జిల్లా అలంపూర్‌ గోన్‌పుర గ్రామ పంచాయతీ కార్యాలయం.. ఆ గ్రామ సర్పంచ్‌ అభాదేవి విధుల్లో బిజీగా ఉన్నారు.. ఇంతలో ఒక ఫోన్‌ కాల్‌ .. సమీప గ్రామంలో ఒక అమ్మాయిని కొందరు యువకులు వేధిస్తున్నారన్న సమాచారం అందించారు.. వెంటనే అభాదేవి టేబుల్‌పై ఉన్న రివాల్వర్‌ తీసుకొని వాహనంలో అక్కడకు చేరుకుంది. ఆమె రాకను గమనించిన రౌడీలు పారిపోయారు..ఇలా ఒక్క ఈవ్‌టీజింగే కాదు మహిళలకు సంబంధించిన పలు సమస్యలను తీర్చడంలో ఆమె ముందుంటున్నారు. అలంపూర్‌ […]

అభాదేవి... ఈ పేరు చెబితే అక్కడ రౌడీలకు హడల్‌!
Follow us

| Edited By:

Updated on: Sep 02, 2019 | 9:31 PM

బిహార్‌ లోని పట్నా జిల్లా అలంపూర్‌ గోన్‌పుర గ్రామ పంచాయతీ కార్యాలయం.. ఆ గ్రామ సర్పంచ్‌ అభాదేవి విధుల్లో బిజీగా ఉన్నారు.. ఇంతలో ఒక ఫోన్‌ కాల్‌ .. సమీప గ్రామంలో ఒక అమ్మాయిని కొందరు యువకులు వేధిస్తున్నారన్న సమాచారం అందించారు.. వెంటనే అభాదేవి టేబుల్‌పై ఉన్న రివాల్వర్‌ తీసుకొని వాహనంలో అక్కడకు చేరుకుంది. ఆమె రాకను గమనించిన రౌడీలు పారిపోయారు..ఇలా ఒక్క ఈవ్‌టీజింగే కాదు మహిళలకు సంబంధించిన పలు సమస్యలను తీర్చడంలో ఆమె ముందుంటున్నారు.

అలంపూర్‌ గోన్‌పుర గ్రామ పంచాయతీ కింద మొత్తం 13 గ్రామాలున్నాయి. ఆకతాయిలు, రౌడీలు, గూండాలకు ఆమె పేరు చెబితేనే హడలిపోతారు. అవసరమైతే కాల్చేందుకు కూడా వెనకాడరని మహిళా సంఘాలు చెబుతున్నాయి. 2011, 2016 సంవత్సరాల్లో జరిగిన స్థానిక ఎన్నికల్లో ఆమె సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. మహిళల హక్కులకు ఎలాంటి భంగం కలిగినా ఊరుకోరు. పోలీసులు సైతం ఈవ్‌టీజింగ్‌ కేసులు తమ వద్దకు వస్తే ఆమె దగ్గరకే వెళ్లమని సూచించడం విశేషం. ఆమెను సహించలేని కొందరు 2015లో అభాదేవిపై ఆరు రౌండ్ల కాల్పులు జరిపారు. కానీ ఎలాంటి గాయాలు లేకుండా తప్పించుకొంది. దీంతో తుపాకీ లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకుంది. 2016లో ఉన్నతాధికారులు తుపాకీ లైసెన్స్‌ను మంజూరు చేయడంతో రివాల్వర్‌ను కొనుగోలు చేసి ప్రాణ రక్షణగా ఉంచుకుంది. భర్త శిక్షణ ఇవ్వడంతో తుపాకీ ప్రయోగించడం నేర్చుకుంది. 2017లో పంచాయతీ పరిధిలోని ఒక గ్రామంలో మత ఘర్షణలు చెలరేగాయి. ఇరువర్గాలు దాడులకు దిగారు. అక్కడకు చేరుకున్న ఆమె ఒక కర్ర తీసుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు.

అభాదేవి సర్పంచ్‌గా పదవీబాధ్యతలు స్వీకరించిన అనంతరం పంచాయతీ కార్యాలయానికి నూతన భవనాన్ని నిర్మించారు. పాఠశాల భవనాలను కూడా నిర్మిస్తున్నారు. తాగునీటి సౌకర్యం కల్పించారు. ఇంకా కళాశాలకు పక్కా భవనాలు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఎప్పుడూ రివాల్వర్‌ చేతబట్టుకొని తిరగడంతో ఆమెను స్థానికులు ‘లేడీ సింగం” రివాల్వర్‌ రాణి’గా పిలుస్తున్నారు. ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు సేవచేయడం ఆనందంగా ఉందని ఆమె అన్నారు.

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!