AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హెచ్ 1బీ వీసా రద్దు, ట్రంప్ ప్రభుత్వానికి కోర్టులో ఊరట

హెచ్ 1 బీ వీసాల జారీని తాత్కాలికంగా రద్దు చేస్తూ  అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని వాషింగ్టన్ లోని కోర్టు సమర్థించింది. దీంతో ప్రాథమికంగా ట్రంప్ సర్కార్ కి కోర్టులో ఊరట  లభించింది. కరోనా వైరస్ నేపథ్యంలో..

హెచ్ 1బీ వీసా రద్దు, ట్రంప్ ప్రభుత్వానికి కోర్టులో ఊరట
Umakanth Rao
| Edited By: |

Updated on: Sep 17, 2020 | 2:09 PM

Share

హెచ్ 1 బీ వీసాల జారీని తాత్కాలికంగా రద్దు చేస్తూ  అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని వాషింగ్టన్ లోని కోర్టు సమర్థించింది. దీంతో ప్రాథమికంగా ట్రంప్ సర్కార్ కి కోర్టులో ఊరట  లభించింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ వీసాలను  నిలిపివేస్తున్నామని, అమెరికన్లకే ఉద్యోగాలు అన్నదే తమ నినాదమంటూ ట్రంప్ గత జూన్ 22 న ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ పాలసీ దేశానికి తీవ్ర హానికరమని బడా టెక్ కంపెనీలు దీన్ని సవాలు చేస్తూ కోర్టుకెక్కాయి. అలాగే అమెరికాలో వర్క్ వీసాలపై ఉద్యోగాలు చేస్తూ తిరిగి ఇండియాకు వఛ్చిన 169 మంది భారతీయులు కూడా ఈ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన వాషింగ్టన్ లోని డిస్ట్రిక్ట్ జడ్జి అమిత్ మెహతా..వీసా ఆంక్షల విధింపుపై ప్రభుత్వ నిషేధాన్ని నిలిపివేయజాలమని రూలింగ్ ఇఛ్చారు. ఆయన ఇలా రూలింగ్ ఇవ్వడం ఇది రెండో సారి. గత నెలలో కూడా ఆయన ఇదే విధమైన ఉత్తర్వులు ఇచ్చారు. ట్రంప్ ప్రభుత్వ డిక్రీని సస్పెండ్ చేయాలన్న అభ్యర్థన నిలవజాలదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే తాము సుప్రీంకోర్టులో ఈ రూలింగ్ పై అప్పీలు దాఖలు చేస్తామని భారతీయ వర్కర్లు తెలిపారు.

Follow Us
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే