90ఏళ్ల పాపయ్య తాత సైకిల్‌ సవారీ..70ఏళ్ల ప్రయాణంలో రోజుకు 32 కిలోమీటర్లు..!

ప్రస్తుత కాలంలో పట్టుమని 18 ఏళ్లు కూడా నిండని వారు సైతం..కాలు కదిపితే మోటార్‌ సైకిల్‌ కావాల్సిందేనంటారు.. విద్యార్థులు తమ విద్యా సంస్థలకు వెళ్లాలన్నా.. చిరు వ్యాపారస్తులు వీధి వీధి తిరిగి తమ వస్తువులు విక్రయించాలన్నా..

90ఏళ్ల పాపయ్య తాత సైకిల్‌ సవారీ..70ఏళ్ల ప్రయాణంలో రోజుకు 32 కిలోమీటర్లు..!
Cycle

Updated on: May 23, 2022 | 3:55 PM

ప్రస్తుత కాలంలో పట్టుమని 18 ఏళ్లు కూడా నిండని వారు సైతం..కాలు కదిపితే మోటార్‌ సైకిల్‌ కావాల్సిందేనంటారు.. విద్యార్థులు తమ విద్యా సంస్థలకు వెళ్లాలన్నా.. చిరు వ్యాపారస్తులు వీధి వీధి తిరిగి తమ వస్తువులు విక్రయించాలన్నా.. ఇంటి అవసరాలకు సామాగ్రి తీసుకురావాలన్నా.. అందరూ మోటార్‌ సైకిళ్లనే వాడుతున్నారు. ప్రస్తుతం మోటార్‌ సైకిళ్ల హవానే నడుస్తోంది. అయితే ఓ తొంభై సంవత్సరాల వృద్ధుడు.. తను ఎటు వెళ్లాలన్నా.. ఏ పని చేసుకుని రావాలన్నా.. సైకిల్‌నే వినియోగిస్తున్నాడంటే ఆశ్చర్యం కలగక మానదు. అతడు 70 ఏళ్లుగా సైకిల్‌పైనే సవారీ చేస్తున్నాడంటే ఎవరైనా ముక్కున వేలేసుకోవడం ఖాయం. అతడే ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం గైగొల్లపల్లి గ్రామానికి చెందిన పాపయ్య.

ఈ రోజుల్లో పక్క ఊరు వెళ్లాలంటే ఆటోలు, కార్లు, బస్సులు, మోటారు సైకిళ్లు ఉన్నాయి. వాటితో సుఖమైన ప్రయాణం. కానీ, పాపయ్య మాత్రం సైకిల్‌పైనే కిలో మీటర్ల దూరం ప్రయాణం చేస్తుంటాడు. అతని వయస్సు తక్కువేమి కాదు 90 సంవత్సరాలు పైనే. సైకిల్‌తోనే ఎంతో అనుబంధం పెనవేసుకుందని, దానిపైనే ఎన్నో వేల కిలోమీటర్లు ప్రయాణం చేశానని చెబుతున్నాడు పాపయ్య. మండలంలోని గైగొల్లపల్లి గ్రామానికి చెందిన సీపీఎం సీనియర్‌ నాయకుడు, పార్టీ మాజీ మండల కార్యదర్శి కొరట్ల పాపయ్య.. మధ్య తరగతి వ్యవసాయ కుటుంబానికి చెందిన వ్యక్తి ఇతను.. తన యుక్త వయస్సు… అంటే 20 సంవత్సరాల వయస్సులో సైకిల్‌ కొనుక్కున్నాడు. నాటి నుంచి నేటి వరకు అదే సైకిల్‌ అతని ప్రయాణ సాధనం. తనకు సైకిలే నేస్తం. ఇప్పటికీ తన ఊరు నుంచి మండల కేంద్రమైన కూసుమంచికి సుమారు 16 కిలోమీటర్లు రోజూ సైకిల్‌పైనే వస్తుంటాడు.

ఇవి కూడా చదవండి