Viral video: మంచులో అందంగా స్కేటింగ్ చేస్తున్న బాలుడు..అంతలోనే ఎదురైన స్పీడ్‌బ్రేకర్..!? అదేంటో మీరే చూడండి..
సోషల్ మీడియా ప్రపంచంలో ఎప్పుడు ఏది వైరల్‌గా మారుతుందో ఊహించలేరు. నెటిజన్లు నిత్యం అనేక వీడియోలను షేర్ చేస్తుంటారు. వాటిలో ముఖ్యంగా కొన్ని చిన్నపిలల్ల ఫన్నీ వీడియోలు

సోషల్ మీడియా ప్రపంచంలో ఎప్పుడు ఏది వైరల్‌గా మారుతుందో ఊహించలేరు. నెటిజన్లు నిత్యం అనేక వీడియోలను షేర్ చేస్తుంటారు. వాటిలో ముఖ్యంగా కొన్ని చిన్నపిలల్ల ఫన్నీ వీడియోలు (Videos)ఉంటాయి. ఆ వీడియోలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటుకుంటుంటాయి.. అలాంటి వీడియోలను మళ్లీ మళ్లీ చూడాలానిపిస్తుంటుంది. ప్రత్యేకించి చిన్నారుల చిలిపి చేష్టలు, వారి అల్లారి పనులకు సంబంధించిన వీడియోలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట్లో (Social Media) తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోలో ఓ బుడతడు..స్కేటింగ్ చేస్తూ ఊహించని రీతిలో బొక్కబోర్లా పడిపోతాడు..పాపం బుడ్డొడు కిందపడ్డ సీన్ అక్కడి స్థానికుల్ని తెగ నవ్వించింది…దాంతో వీడియో ఇప్పుడు నెట్టింట మరింత ఫాస్ట్‌గా వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్న ఈ వైరల్ వీడియో, ఒక చిన్న పిల్లవాడు స్కేట్‌పార్క్‌లో ఫుల్ ప్రొటెక్షన్‌తో స్కేటింగ్ చేస్తున్నాడు. ఎత్తైన మంచుప్రదేశం నుండి అందంగా కిందకు దిగడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ, అతడు వెళ్తున్న మార్గంలో అనుకోకుండా ఓ ఎత్తైన దిబ్బలాంటిది ఎదురైంది..అతడు వెళ్తున్న స్పీడ్‌కి ఆ దిబ్బ వద్ద వేగం కంట్రోల్ చేయలేకపోయాడు..దాంతో ఒక్కసారిగా అంత ఎత్తుకు ఎగిరి కిందపడ్డాడు..అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదు..బాలుడు సురక్షితంగా ఉన్నాడు..అయితే, అతడు స్కేటింగ్ చేస్తున్న టైమ్‌లో బ్యాక్ గ్రౌండ్‌లో ఓ అందమైన మ్యూజిక్ ప్లే అవుతోంది..ఇక బాలుడు పడ్డ విధానం చూసి అక్కడే ఉన్న ఓ యువకుడు తెగ నవ్వుకుంటున్నట్టు మనం ఈ వీడియోలో చూడొచ్చు.
The jazz makes it pic.twitter.com/imte7nftjs
— Children falling over (@falling__over) May 21, 2022
మొత్తనికి సోషల్ మీడియాలో మాత్రం వీడియో తెగ హల్‌చల్ చేస్తోంది. వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తుండగా, మరికొందరు నెటిజన్లు మాత్రం థ్యాంక్ గాఢ్ బాలుడు సురక్షితంగా బయటపడ్డాడు అంటున్నారు.