వరదల ధాటికి 600 మంది మృత్యువాత

గత కొద్ది రోజులుగా ఆసియాలోని పలు దేశాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటి వరకు 600 మంది మరణించారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ముఖ్యంగా భారత్, బంగ్లాదేశ్, నేపాల్, మాయన్మార్ దేశాల్లో గత కొద్ది రోజుల నుంచి పెద్ద ఎత్తున వర్షపాతం నమోదైంది. ఈ వానలకు దాదాపు 2.5 కోట్ల మంది వరదల బారిన పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఐక్య రాజ్య సమితి ప్రధాన కార్యదర్శికి అధికార ప్రతినిధి అయిన ఫర్హన్‌ హాక్‌ వెల్లడించారు. వీరి సంఖ్య […]

వరదల ధాటికి 600 మంది మృత్యువాత
Follow us

| Edited By:

Updated on: Jul 28, 2019 | 8:52 AM

గత కొద్ది రోజులుగా ఆసియాలోని పలు దేశాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటి వరకు 600 మంది మరణించారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ముఖ్యంగా భారత్, బంగ్లాదేశ్, నేపాల్, మాయన్మార్ దేశాల్లో గత కొద్ది రోజుల నుంచి పెద్ద ఎత్తున వర్షపాతం నమోదైంది. ఈ వానలకు దాదాపు 2.5 కోట్ల మంది వరదల బారిన పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఐక్య రాజ్య సమితి ప్రధాన కార్యదర్శికి అధికార ప్రతినిధి అయిన ఫర్హన్‌ హాక్‌ వెల్లడించారు. వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.

భారత్‌లోని అసోం, బీహార్, యూపీ రాష్ట్రాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉందని.. ఇప్పటికే యునిసెఫ్‌ సహకారం అందిస్తోందని వెల్లడించారు. వరదల వల్ల వ్యాధులు ప్రభలకుండా మారుమూల ప్రాంతాల్లోనూ తాగునీరు, ఆహారం, మందులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. వరదల ధాటికి ఒక్క అసోంలోనే దాదాపు 2 వేల పాఠశాలలు దెబ్బతిన్నాయని చెప్పారు.