థ్యాంక్స్ కేసీఆర్‌ జీ: నవీన్‌ పట్నాయక్‌

ఫొని తుపాను సృష్టించిన బీభత్సంతో ఒడిశా అల్లాడుతున్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన సాయానికి ఒడిశా సీఎం కృతజ్ఞతలు తెలిపారు. ఒడిశాకు సహాయక బృందాలను పంపినందుకు కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెబుతూ లేఖలో పేర్కొన్నారు. ఈ ఏడాది మే మొదటి వారంలో ఫొని తుపాను ఒడిశాలో బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. భారీగా వీచిన గాలుల తీవ్రతకు అక్కడ విద్యుత్‌ స్తంభాలు నేలకూలడంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో అక్కడి చాలా ప్రాంతాల్లో ప్రజలు అంధకారంలోనే ఉన్న పరిస్థితుల్లో […]

థ్యాంక్స్ కేసీఆర్‌ జీ: నవీన్‌ పట్నాయక్‌
Follow us

| Edited By:

Updated on: Jul 28, 2019 | 5:30 AM

ఫొని తుపాను సృష్టించిన బీభత్సంతో ఒడిశా అల్లాడుతున్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన సాయానికి ఒడిశా సీఎం కృతజ్ఞతలు తెలిపారు. ఒడిశాకు సహాయక బృందాలను పంపినందుకు కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెబుతూ లేఖలో పేర్కొన్నారు.

ఈ ఏడాది మే మొదటి వారంలో ఫొని తుపాను ఒడిశాలో బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. భారీగా వీచిన గాలుల తీవ్రతకు అక్కడ విద్యుత్‌ స్తంభాలు నేలకూలడంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో అక్కడి చాలా ప్రాంతాల్లో ప్రజలు అంధకారంలోనే ఉన్న పరిస్థితుల్లో ఒడిశా ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్ స్పందించి అరుదైన సాయం చేశారు. తెలంగాణలోని విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి రాష్ట్రం నుంచి సుమారు వెయ్యి మంది విద్యుత్‌ శాఖ ఉద్యోగులను ఒడిశాకు పంపారు. దీంతో విద్యుత్‌ పునరుద్ధరణ చర్యలు వేగవంతం చేసి తిరిగి సాధారణ స్థితి తీసుకురావడంలో విశేష సేవలందించారు. అందుకు కృతజ్ఞతగా ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ శనివారం కేసీఆర్‌కు లేఖ రాశారు.