దసరా పండుగ వచ్చింది.. సెలవులెన్నో తెచ్చింది

| Edited By: Ram Naramaneni

Sep 18, 2019 | 5:53 PM

రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు దసరా సెలవులను ప్రకటించాయి. ఏపీలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు 12 రోజులు దసరా సెలవులు ఇవ్వనుండగా.. తెలంగాణాలో 16 రోజులు దసరా సెలవులుగా ప్రకటించారు. ఏపీలో విద్యాశాఖ ఆదేశాల ప్రకారం ఈ నెల 28 నుంచి అక్టోబర్ 9 వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు దసరా సెలవులుగా పరిగణించనున్నారు. అక్టోబర్ 10న తిరిగి స్కూళ్ళు తెరుచుకోనున్నాయి. అయితే అక్టోబర్ 10, 11న కూడా సెలవులు ప్రకటిస్తే.. అక్టోబర్ 12, 13 […]

దసరా పండుగ వచ్చింది.. సెలవులెన్నో తెచ్చింది
Follow us on

రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు దసరా సెలవులను ప్రకటించాయి. ఏపీలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు 12 రోజులు దసరా సెలవులు ఇవ్వనుండగా.. తెలంగాణాలో 16 రోజులు దసరా సెలవులుగా ప్రకటించారు.

ఏపీలో విద్యాశాఖ ఆదేశాల ప్రకారం ఈ నెల 28 నుంచి అక్టోబర్ 9 వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు దసరా సెలవులుగా పరిగణించనున్నారు. అక్టోబర్ 10న తిరిగి స్కూళ్ళు తెరుచుకోనున్నాయి. అయితే అక్టోబర్ 10, 11న కూడా సెలవులు ప్రకటిస్తే.. అక్టోబర్ 12, 13 రెండో శనివారం, ఆదివారం సెలవులు కలిసి వస్తాయని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. ఇలా అయితే మొత్తానికి 16 రోజులు పాటు దసరా సెలవులు ఉంటాయి. అయితే దీనిపై ఏపీ ప్రభుత్వం ఇంకా స్పందించాల్సి ఉంది. అటు ఈ సెలవు రోజుల్లో తరగతులు నడిపించే ప్రయత్నం చేస్తే విద్యాసంస్థలపై కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది.

ఇక తెలంగాణలో కూడా అన్ని పాఠశాలలకు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 13 వరకు దసరా సెలవులు ఇవ్వనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. దీనితో 16 రోజుల పాటు దసరా సెలవులు వర్తించనున్నాయి. అటు జూనియర్ కళాశాలలకు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 9 వరకు దసరా సెలవులు ఇవ్వనున్నట్టు ఇంటర్ బోర్డు వెల్లడించింది. అక్టోబర్ 10 నుంచి కళాశాలలు.. అక్టోబర్ 14నుంచి పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి.