చిత్తూరు జిల్లాలో 13 మంది తహసీల్దార్లకు క‌రోనా టెస్టులు..రీజ‌న్ ఇదే..

ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల్లో భాగంగా చిత్తూరు జిల్లాలోని 13 మంది త‌హ‌సీల్దార్ల‌కు కోవిడ్ టెస్టుల చేయించుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌రేట్ అధికారులు ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఇటీవ‌ల అనంత‌పురం జిల్లాలో డ్యూటీలో ఉన్న ఓ త‌హ‌సీల్దార్ కు కోవిడ్ సోక‌డంతో అధికారులు ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్నారు. రెడ్ జోన్ల ప‌రిధిలో విధులు నిర్వ‌ర్తిస్తోన్న తహసీల్దార్లు అంద‌రూ టెస్టులు చేయించుకోవాల‌ని అధికారులు పేర్కొన్నారు. తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, ఏర్పేడు, రేణిగుంట, తొట్టంబేడు, శ్రీకాళహస్తి, వడమాలపేట, పుత్తూరు, నగరి, […]

చిత్తూరు జిల్లాలో 13 మంది తహసీల్దార్లకు క‌రోనా టెస్టులు..రీజ‌న్ ఇదే..
Follow us

|

Updated on: Apr 16, 2020 | 9:28 AM

ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల్లో భాగంగా చిత్తూరు జిల్లాలోని 13 మంది త‌హ‌సీల్దార్ల‌కు కోవిడ్ టెస్టుల చేయించుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌రేట్ అధికారులు ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఇటీవ‌ల అనంత‌పురం జిల్లాలో డ్యూటీలో ఉన్న ఓ త‌హ‌సీల్దార్ కు కోవిడ్ సోక‌డంతో అధికారులు ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్నారు. రెడ్ జోన్ల ప‌రిధిలో విధులు నిర్వ‌ర్తిస్తోన్న తహసీల్దార్లు అంద‌రూ టెస్టులు చేయించుకోవాల‌ని అధికారులు పేర్కొన్నారు. తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, ఏర్పేడు, రేణిగుంట, తొట్టంబేడు, శ్రీకాళహస్తి, వడమాలపేట, పుత్తూరు, నగరి, నిండ్ర, నారాయణవనం, విజయపురం, పలమనేరు తహసీల్దార్లు కరోనా టెస్టులు చ చేయించుకోవాలని ఆదేశించారు.

హాట్‌స్పాట్స్ లిస్ట్ లో చిత్తూరు జిల్లా

కేంద్ర ప్రభుత్వం బుధవారం రిలీజ్ చేసిన హాట్‌స్పాట్ ఏరియాస్ లిస్ట్ లో చిత్తూరు జిల్లా కూడా ఉంది. కరోనా వైరస్ వేగంగా విస్త‌రిస్తోన్న‌ జిల్లాలను హాట్‌స్పాట్‌గా గుర్తించిన కేంద్రం ఓ లిస్ట్ రిలీజ్ చేసింది. జిల్లాలో 23 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో ఆ జాబితాలో చేర్చింది. తిరుపతి, రేణిగుంట, పలమనేరు, శ్రీకాళహస్తి, నగరి, ప్రాంతాల్లో ఎక్కువగా క‌రోనా పాటిజివ్‌ కేసులు రావడంతో వీటిని రెడ్‌ జోన్లుగా గుర్తించారు.