జమ్ముకశ్మీర్ : కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి సరిహద్దులో యథేచ్ఛగా కాల్పులకు తెగబడుతున్న పాక్ సైన్యానికి భారత భద్రతా దళాలు గట్టిగా బుద్ధి చెప్పాయి. భారత సైన్యం ధాటికి పాక్ బెంబేలెత్తిపోయింది. జమ్ముకశ్మీర్‌లోని పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో నియంత్రణ రేఖ వద్ద పాక్ గత మూడు రోజులుగా కాల్పులకు తెగబడుతోంది. దీంతో ఎదురు కాల్పులు ప్రారంభించిన భారత్ 12 మంది పాక్ సైనికులను మట్టుబెట్టింది. భారత్ కాల్పుల్లో మరో 22 మంది పాక్ సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. సుందర్బని సెక్టార్ నుంచి సైనికుల శవాలను ఎంఐ 17 హెలికాప్టర్లలో రావల్పిండికి తరలించారని ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. గత మూడు రోజులు పాటు నౌషేరా సెక్టార్‌లో ఎల్‌వోసీ వద్ద భారత సైనికులపై, సమీప గ్రామాలపై పాక్ సైనికులు అత్యాధునిక ఆయుధాలతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారని, దీంతో విసిగిపోయిన భారత సైన్యం పాకిస్థాన్ దళాలకు గట్టి జవాబు చెప్పాయని అధికారులు వెల్లడించారు. పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో మొత్తం ఇద్దరు భారత సైనికులు అమరులు కాగా, ముగ్గురు పౌరులు గాయపడ్డారని తెలిపారు. కాల్పుల విరమణను పాక్ అదేపనిగా ఉల్లంఘిస్తుండటంతో భారత జవాన్లకు అత్యాధునిక స్నైపర్ రైఫిళ్లు వాడినట్లు తెలిపారు.
పాక్ జెండా తలకిందులు మరోవైపు భారత జవాన్లు దీటుగా స్పందిస్తుండటంతో పాకిస్థాన్ సైన్యం బెదిరిపోయింది. ఏం చేయాలో పాలుపోక తన జెండాను తలకిందులు చేసింది. దీంతో తమ ఓటమిని ఒప్పుకొంటున్నామని, కాల్పులు ఆపాలని భారత్‌కు పరోక్షంగా సంకేతాలు పంపించింది. దీంతో భారత సైన్యం కాల్పులు ఆపింది.
#WATCH Indian Army video of Pakistani base destroyed in Indian firing in Akhnoor sector(J&K), Army sources say upside down Pakistan flag a signal for SOS (extreme danger/distress) pic.twitter.com/2srna7kS7P
— ANI (@ANI) March 24, 2019