బడ్జెట్‌లో మహిళలకు వడ్డీలేని రుణాల కోసం రూ. 1,140 కోట్లు
వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత తొలిసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో ముఖ్యంగా ఎన్నికల మేనిఫెస్టో అమలుపైనే ప్రధానంగా దృష్టి సారించినట్టుగా కనిపిస్తోంది. ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపుల్లో డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాల కోసం రూ.1140 కోట్లు కేటాయించారు. అలాగే పట్టణ స్వయం సహాయక బృందాలకు వైఎస్సార్ వడ్డీలేని రుణం కింద రూ. 64 కోట్లు కేటాయించారు. పౌర సరఫరాల శాఖకు బియ్యం రాయితీ కింద రూ.3000కోట్లు, బియ్యం తదితర […]
వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత తొలిసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో ముఖ్యంగా ఎన్నికల మేనిఫెస్టో అమలుపైనే ప్రధానంగా దృష్టి సారించినట్టుగా కనిపిస్తోంది. ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపుల్లో డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాల కోసం రూ.1140 కోట్లు కేటాయించారు. అలాగే పట్టణ స్వయం సహాయక బృందాలకు వైఎస్సార్ వడ్డీలేని రుణం కింద రూ. 64 కోట్లు కేటాయించారు. పౌర సరఫరాల శాఖకు బియ్యం రాయితీ కింద రూ.3000కోట్లు, బియ్యం తదితర సరకుల సరఫరాకు రూ.750కోట్లు, గ్రామ వాలంటీర్ల కోసం రూ.720 కోట్లు, గ్రామ సచివాలయం కోసం రూ.700 కోట్లు, మున్సిపల్ వార్డు వాలంటీర్ల కోసం రూ.280 కోట్లు, మున్సిపల్ వార్డు సచివాలయాల కోసం రూ.180 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్ధిక మంత్రి బుగ్గన తెలిపారు.
పేదింటి ఆడపిల్ల వివాహం కోసం ఈసారి బడ్జెట్‌లో భారీగానే కేటాయించారు. వైఎస్‌ఆర్ కల్యాణ కానుకకు రూ.300 కోట్లు, ఎస్సీలకు వైఎస్‌ఆర్ కల్యాణ కానుక కింద రూ.200కోట్లు, ఎస్టీలకు వైఎస్‌ఆర్ గిరి పుత్రిక కల్యాణ కానుక కింద రూ.45కోట్లు, మైనార్టీలకు వైఎస్‌ఆర్ షాదీ తోఫా కింద రూ.100కోట్లు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. అదే విధంగా న్యాయవాదుల సంక్షేమం కోసం కూడా ప్రభుత్వం వందకోట్లను కేటాయించింది. వారికి ఆర్ధిక సాయం చేసేందుకు మరో పదికోట్లు, ఏపీ రహదారుల అభివృద్ధి కార్పొరేషన్‌కు రూ. 260 కోట్లు, ఏపీఎస్‌ఆర్టీసీకి రూ. 1000 కోట్లు, రాయితీల కోసం మరో రూ.500 కోట్లు కేటాయింపులు చేశారు.