బీజేపీ గూటికి 10 మంది ఎమ్మెల్యేలు…!

సిక్కిం రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ సిక్కిం డెమోక్రసి ఫ్రంట్‌కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీడీఎఫ్ పార్టీ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, జనరల్ సెక్రటరీ రామ్ మాధవ్‌తో సమావేశమైన 10 మంది ఎమ్మెల్యేలు.. అనంతరం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎస్‌డీఎఫ్ పార్టీని బీజేపీలో కలిపే అంశాన్ని పార్టీ నిర్ణయిస్తుందని రామ్ మాధవ్ స్పష్టం చేశారు. 2-3 కన్నా ఎక్కువ మంది […]

బీజేపీ గూటికి 10 మంది ఎమ్మెల్యేలు...!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 13, 2019 | 7:24 PM

సిక్కిం రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ సిక్కిం డెమోక్రసి ఫ్రంట్‌కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీడీఎఫ్ పార్టీ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, జనరల్ సెక్రటరీ రామ్ మాధవ్‌తో సమావేశమైన 10 మంది ఎమ్మెల్యేలు.. అనంతరం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎస్‌డీఎఫ్ పార్టీని బీజేపీలో కలిపే అంశాన్ని పార్టీ నిర్ణయిస్తుందని రామ్ మాధవ్ స్పష్టం చేశారు. 2-3 కన్నా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు వేరే పార్టీలో చేరితే ఫిరాయింపుల వ్యతిరేక చట్టం ఉల్లంఘన కిందకు రాదని ఆయన పేర్కొన్నారు.