Big Conspiracy : ఎర్రకోట పరిసరాల్లోకి నిరసనకారులు ఎలా వెళ్లారు…? అనుమతి ఎవరిచ్చారు..? ఆ దాడి ఓ కుట్ర..!
గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగిన ఎర్రకోట దాడిపై కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎర్రకోటపై జరిగిన దాడిని భారీ కుట్రగా అభివర్ణించారు.

Big Conspiracy : 26 జనవరి రోజు ఎర్రకోట దాడి ఘటనపై తనదైన తరహాలో కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎర్రకోటపై జరిగిన దాడిని భారీ కుట్రగా సిబల్ అభివర్ణించారు. రైతు ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ఎన్నో కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. ఇందులో భాగంగానే ఈ దాడి జరిగిందని కపిల్ సిబల్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
ఎర్రకోట పరిసరాల్లోకి ఎవరూ అనుమతి లేకుండా ప్రవేశించలేరు అంటూ పేర్కొన్నారు. కానీ ఆందోళనకారులు నేరుగా ఎర్రకోట వైపు ఎలా వెళ్లారు అంటూ ప్రశ్నించారు. లోపలికి వెళ్లి ఆందోళనలు చేశారు అంటూ కొన్ని ప్రశ్నలను సందించారు.
ఎర్రకోటలోపలికిి వెళ్తున్న సమయంలో తమను ఎవరూ అడ్డుకోలేదని ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్న రైతులు తమతో అన్నారని సిబల్ వెల్లడించారు. వారు చెప్పిన దానిని బట్టి అర్థం చేసుకోవచ్చన్నారు. ఆందోళనను దెబ్బతీయడానికి ఇలాంటి కుట్రలు అనేకం జరుగుతున్నాయంటూ కపిల్ సిబల్ పేర్కొన్నారు.
बिना इजाजत के कोई लाल किले में नहीं पहुंच सकता। वे लोग सीधा लाल किला चले गए और वो लोग खुद कह रहे हैं कि हमें किसी ने नहीं रोका। आंदोलन को तोड़ने के लिए कई षड्यंत्र रचे जा रहे हैंः कांग्रेस नेता कपिल सिब्बल pic.twitter.com/IHzbyF5pJi
— ANI_HindiNews (@AHindinews) January 30, 2021
ఆ రోజు ఏం జరిగిందంటే…
గణతంత్ర దినోత్సవం రోజు నిరసన తెలుపాలనుకున్న రైతులు అన్నంత పనిచేశారు. పోలీసుల అంక్షలు అధిగమిస్తూ కిసాన్ ట్రాక్టర్ ర్యాలీ ఎర్రకోటకు చేరుకున్నారు. దేశం నలుమూలాల నుంచి చేరుకున్న రైతులు ఎర్రకోటను ముట్టడించారు.
అంతకు ముందు పోలీసులు అనుమతించిన సమయంలో కాకుండా ముందుగానే ర్యాలీ మొదలుపెట్టిన సెంట్రల్ ఢిల్లీలోకి రావడానికి ప్రయత్నించిన రైతులను పోలీసులు అడ్డుకున్నారు. కొన్ని పోలీసులు లాఠీలకు పని చెప్పారు. దారికి అడ్డుపెట్టిన బారికేడ్లను తొక్కేసుకుంటూ రైతులు ముందుకు దూసుకువచ్చారు. ఈ సందర్భంగా కొందరు నిహంగ్ ఆందోళనకారులు తమ దగ్గర ఉన్న ఖడ్గాలను పోలీసులపై దూసి భయాందోళనలకు గురిచేశారు.