అయిదో కప్పు కోసం ఆరాటపడుతున్న ముంబాయి ఇండియన్స్‌

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఆరంభానికి పట్టుమని వారం రోజులు కూడా లేదు.. జట్లన్నీ ప్రాక్టీస్‌లో మునిగిపోయాయి.. ఈసారి టైటిల్‌ ఎవరికి దక్కబోతుందన్న ఆసక్తి అందరిలోనూ పెరిగింది. క్రీడా విశ్లేషకులు గణాంకాల దుమ్ము దులుపుతున్నారు..

అయిదో కప్పు కోసం ఆరాటపడుతున్న ముంబాయి ఇండియన్స్‌
Follow us

|

Updated on: Sep 12, 2020 | 12:27 PM

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఆరంభానికి పట్టుమని వారం రోజులు కూడా లేదు.. జట్లన్నీ ప్రాక్టీస్‌లో మునిగిపోయాయి.. ఈసారి టైటిల్‌ ఎవరికి దక్కబోతుందన్న ఆసక్తి అందరిలోనూ పెరిగింది. క్రీడా విశ్లేషకులు గణాంకాల దుమ్ము దులుపుతున్నారు.. పుష్కరకాలం చరిత్ర ఉన్న ఐపీఎల్‌లో ముంబాయి జట్టే ఎక్కువ టైటిల్స్‌ గెల్చుకుంది.. మరి రోహిత్‌శర్మ సేన అయిదో కప్పును అందుకుంటుందా? ముంబాయి అభిమానులు మాత్రం తప్పకుండా అని జవాబిస్తున్నారు. డిఫెడింగ్‌ ఛాంపియన్‌గా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో అడుగుపెట్టిన రోహిత్‌శర్మ నేతృత్వంలోని ముంబాయి జట్టు టైటిల్‌ను నిలుపుకోవాలనే పట్టుదలతో ఉంది.. టీ 20 టోర్నమెంట్లలో మెగా టోర్నీగా పేరుగాంచిన ఐపీఎల్‌లో విజేతగా నిలవడమంటే మాటలు కాదు! 2013లో మొదటి సారి టైటిల్‌ను గెల్చుకున్న ముంబాయి ఆ తర్వాత 2015, 2017, 2019లలో ఐపీఎల్‌ కప్‌ను అందుకుంది.. ఈసారి కూడా టైటిల్‌ ఫేవరెట్‌గానే బరిలో దిగుతున్నది.. జట్టులోని బలాబలాలను చూస్తే గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనిపిస్తోంది. అయితే క్రికెట్‌లో అనుకున్నవి అనుకున్నట్టుగా జరగవు.. నిరుడు కూడా చివరి నిమిషం వరకు విజయం అటు చెన్నై సూపర్‌ కింగ్స్‌తో ఇటు ముంబాయి టీమ్‌తోనూ దోబూచులాండింది.. ఉత్కంఠంగా సాగిన ఆ మ్యాచ్‌లో చివరకు ఒక్క పరుగు తేడాతో ముంబాయి గెలుపొందింది. ప్రస్తుతం దుబాయ్‌ స్టేడియంలో ప్రాక్టీసు చేస్తున్న ముంబాయి జట్టు వచ్చే శనివారం అబుదాబిలో ఉన్న షేక్‌ జాయెద్‌ స్టేడయంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో తలపడనుంది.. ముంబాయి టాప్‌ ఆర్డర్‌ బలంగా ఉంది.. ఆస్ట్రేలియాకు చెందిన క్రిస్‌ లీన్‌ రాకతో బ్యాటింగ్‌ లైనప్‌ మరింత పటిష్టంగా తయారయ్యింది. క్రిస్‌ లీన్‌తో కలిసి సౌతాఫ్రికా వికెట్‌ కీపర్‌ క్వింటాన్‌ డికాక్‌ ఇన్నింగ్స్‌ను ఓపెన్‌ చేసే అవకాశం ఉంది. ఎప్పటిలాగే రోహిత్‌శర్మ నంబర్‌ త్రీలో వస్తాడు..ఈ ముగ్గురిలో ఎవరూ బ్యాటింగ్‌ను ఝళిపించినా ప్రత్యర్థి జట్లు బౌలర్లకు మాత్రం విషమపరీక్షే! ఇక ముంబాయి ఇండియన్స్‌లో ఆల్‌ రౌండర్లకు కొదవలేదు.. పాండ్యా సోదరులు హార్దిక్‌, క్రునాల్‌లతో పాటు పొలార్డ్‌ కూడా అటు బ్యాట్‌తోనూ ఇటు బాల్‌తోనూ మ్యాజిక్‌ చేయగలరు. అలాగని బలహీనతలు లేవా అంటే అవీ ఉన్నాయి.. ఇన్ని రోజుల విరామం వచ్చింది కాబట్టి బుమ్రా మునుపటిలా బౌలింగ్‌ చేయగలడా అన్నది అందరికీ వస్తున్న సందేహం.. అదే సమయంలో ఒత్తిడి కూడా అతడిపై ఎక్కువగానే ఉంటుంది. ఇక ఐపీఎల్ చరిత్రలో ముంబాయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మొత్తం 30 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ముంబాయి ఇండియన్స్‌ జట్టే ఎక్కువ సార్లు గెలిచింది. ముంబాయి ఇండియన్స్ మొత్తం 18 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, చెన్నై 12 మ్యాచ్‌ల్లో గెలిచింది. తటస్థ వేదికలలో వారిద్దరూ 5-5 మ్యాచ్‌ల్లో గెలిచారు. ఓ రకంగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ కూడా తటస్థ వేదికే కాబట్టి ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి..

ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
టాస్ గెలిచిన బెంగళూరు.. భారీ స్కోర్ మిస్..
టాస్ గెలిచిన బెంగళూరు.. భారీ స్కోర్ మిస్..
ఆహారంలో సూపర్​ఫుడ్స్​ తీసుకోండి ఇల.. బంగారంలాంటి ఆరోగ్యం మీ సొంతం
ఆహారంలో సూపర్​ఫుడ్స్​ తీసుకోండి ఇల.. బంగారంలాంటి ఆరోగ్యం మీ సొంతం
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
ఇదో వింత ఆచారం... పూజారి కాలితో తంతే మోక్షం కలుగుతుందట..
ఇదో వింత ఆచారం... పూజారి కాలితో తంతే మోక్షం కలుగుతుందట..
చిరంజీవి, రమ్యకృష్ణ మధ్యలో ఉన్న చిన్నారి ఎప్పుడు ఎలా ఉందో తెలుసా.
చిరంజీవి, రమ్యకృష్ణ మధ్యలో ఉన్న చిన్నారి ఎప్పుడు ఎలా ఉందో తెలుసా.
Moodami 2024: మూఢాల్లోనూ యోగాల వర్షం! ఆ రాశుల వారికి శుభ ఫలితాలు.
Moodami 2024: మూఢాల్లోనూ యోగాల వర్షం! ఆ రాశుల వారికి శుభ ఫలితాలు.
దళపతి విజయ్ చేతులు, తలపై గాయాలు.. నెట్టింట్లో ఫోటోలు వైరల్
దళపతి విజయ్ చేతులు, తలపై గాయాలు.. నెట్టింట్లో ఫోటోలు వైరల్
అందమైన దుబాయ్‌ని ఛిద్రం చేసిన వర్షం.. తిరిగి మెరవాలంటే ఎంతఖర్చు.?
అందమైన దుబాయ్‌ని ఛిద్రం చేసిన వర్షం.. తిరిగి మెరవాలంటే ఎంతఖర్చు.?
ఈ 5 అలవాట్లు సంబంధాల్లో చీలికను సృష్టిస్తాయి.. ఈరోజే మార్చుకోండి
ఈ 5 అలవాట్లు సంబంధాల్లో చీలికను సృష్టిస్తాయి.. ఈరోజే మార్చుకోండి
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!