ఐపీఎల్‌లో అమెరికా ఆటగాడు అలీఖాన్‌

ఐపీఎల్‌లో అమెరికా ఆటగాడు అలీఖాన్‌

అమెరికాలో క్రికెట్‌ ఏమిటి? అని ఆశ్చర్యపోకండి.. చాన్నాళ్లుగా అమెరికా ఐసీసీ టోర్నమెంట్లలో ఆడుతోంది.. ఐసీసీలో సభ్యదేశం కూడా! ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే మరో వారం రోజుల్లో ప్రారంభం కాబోతున్న ఐపీఎల్‌లో

Balu

|

Sep 12, 2020 | 3:14 PM

అమెరికాలో క్రికెట్‌ ఏమిటి? అని ఆశ్చర్యపోకండి.. చాన్నాళ్లుగా అమెరికా ఐసీసీ టోర్నమెంట్లలో ఆడుతోంది.. ఐసీసీలో సభ్యదేశం కూడా! ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే మరో వారం రోజుల్లో ప్రారంభం కాబోతున్న ఐపీఎల్‌లో ఓ అమెరికన్‌ క్రికెటర్‌ కూడా ఆడబోతున్నాడు.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరపున ఐపీఎల్‌లో ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్న 29 ఏళ్ల అలీఖాన్ ప్రస్తుతం అమెరికా తరఫున ఆడుతున్నాడు.. కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-సీపీఎల్‌లో ట్రిన్‌బాగ్‌ నైట్‌రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఫాస్ట్‌ బౌలర్‌ ఈ సీజన్‌లో ఎనిమిది మ్యాచ్‌లు ఆడాడు. ఎనిమిది వికెట్లు తీసుకున్నాడు.. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఆటగాడు హరీ గర్నీ గాయం కారణంగా ఐపీఎల్‌ నుంచి తప్పుకోవడం అలీఖాన్‌కు కలిసొచ్చింది. హరీ గర్నీ స్థానాన్ని అలీఖాన్‌తో రీప్లేస్‌ చేయాలనుకుంటోంది కేకేఆర్‌.. నిజానికి లాస్ట్‌ సీజన్‌లోనే అలీఖాన్‌ను తీసుకుందామని అనుకుందట! కొన్ని కారణాల వల్ల అప్పుడు వర్క్‌ అవుట్‌ అవ్వలేదట.. ఈసారి మాత్రం అలీఖాన్‌ ఆట తీరు పట్ల కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఓనర్‌ షారూక్‌ ఖాన్‌ ఐపీఎల్‌లో ఆడాల్సిందేనని అనుకుంటున్నాడట. ఒకవేళ అదే జరిగితే అమెరికా నుంచి ఐపీఎల్‌లో ఆడిన తొలి క్రికెటర్‌గా అలీఖాన్‌ రికార్డు సాధిస్తాడు. అలీఖాన్‌ టాలెంట్‌ను మొదట గుర్తించింది వెస్టిండీస్‌ ప్లేయర్‌ డ్వేన్‌ బ్రేవో… 2018లో గ్లోబల్‌ టీ-20 కెనడా లీగ్‌లో చక్కటి ఆటతీరును కనబర్చిన అలీఖాన్‌ … బ్రేవో దృష్టిలో పడ్డాడు.. అతనే అలీఖాన్‌ను సీపీఎల్‌లోకి తీసుకొచ్చాడు.. ఆ సీజన్‌లో గయానా అమెజాన్‌ వారియర్స్‌ టీమ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఆ సీజన్‌లో ఆడిన 12 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు తీసుకోవడం గమనార్హం.. ఆ తర్వాత ట్రినిబాగ్‌ నైట్‌రైడర్స్‌ ఇతడిని తీసుకుంది.. ఈ ఏడాది ట్రినిబాగ్‌ నైట్‌ రైడర్స్‌ టైటిల్‌ గెల్చుకున్నదంటే అలీఖాన్‌ చలవే!

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu