ఐపీఎల్ 2020: ఈసారి ఆరెంజ్ క్యాప్ ఎవరిది? కోహ్లీని బీట్ చేయగలరా!

సురేష్ రైనా ఎపిసోడ్, ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్‌లో కరోనా కలకలం.. ఈ రెండూ కూడా ఐపీఎల్ 2020కి ఆరంభం ముందే మంచి పబ్లిసిటీని తెచ్చిపెట్టాయని చెప్పాలి.

ఐపీఎల్ 2020: ఈసారి ఆరెంజ్ క్యాప్ ఎవరిది? కోహ్లీని బీట్ చేయగలరా!
Follow us

|

Updated on: Sep 12, 2020 | 5:36 PM

IPL 2020: సురేష్ రైనా ఎపిసోడ్, ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్‌లో కరోనా కలకలం.. ఈ రెండూ కూడా ఐపీఎల్ 2020కి ఆరంభం ముందే మంచి పబ్లిసిటీని తెచ్చిపెట్టాయని చెప్పాలి. కరోనా వైరస్ కారణంగా మొదట్లో ఐపీఎల్ 2020పై బోలెడన్ని అనుమనులొచ్చాయి. అయితే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పట్టు వదలని విక్రమార్కుడు వలే.. ప్రయత్నాలు సాగిస్తూ.. చివరికి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో ఐపీఎల్ నిర్వహించేందుకు అన్ని మార్గాలను సుగుమం చేశాడు. దీనితో క్రికెట్ ప్రపంచం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మెగా క్రికెట్ టోర్నమెంట్ ఈ నెల 19వ తేదీ నుంచి 53 రోజుల పాటు సాగుతుంది.

మొత్తం నవంబర్‌ పదిన జరిగే ఫైనల్‌ మ్యాచ్‌తో కలిసి మొత్తం 60 మ్యాచ్‌లు జరుగుతాయి. లీగ్‌లో జరిగే 56 మ్యాచ్‌లను నిర్వహించడానికి దుబాయ్‌, అబుదాబి, షార్జా క్రికెట్‌ స్టేడియంలు సిద్ధమయ్యాయి. ఈసారి జరిగే ఐపీఎల్‌ ప్రత్యేకతేమిటంటే స్టేడియంలో ఒక్క ప్రేక్షకుడు కూడా లేకుండా.. ఖాళీ స్టేడియంలలోనే మ్యాచ్‌లను నిర్వహిస్తారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఎవరు ఆరెంజ్ క్యాప్ సాధిస్తాడా అనే చర్చ అప్పుడే సోషల్ మీడియాలో మొదలైంది. గత ఐపీఎల్ చరిత్ర ఒకసారి తిరగేస్తే అత్యధికంగా ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మూడుసార్లు ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకోగా.. భారత్ నుంచి సచిన్ టెండూల్కర్, రాబిన్ ఊతప్ప, విరాట్ కోహ్లిలు అత్యధిక పరుగులు వీరులుగా నిలిచారు. మరి ఈసారి పరుగులు వరద పారించే ఆ ఆటగాడు ఎవరో అన్నది వేచి చూడాలి.

ఐపీఎల్ చరిత్రలో: ఆరెంజ్ క్యాప్ వీరులు..

  • 2008: షాన్ మార్ష్(616)
  • 2009: మాధ్యూ హెడెన్(572)
  • 2010: సచిన్ టెండూల్కర్ (618)
  • 2011: క్రిస్ గేల్(608)
  • 2012: క్రిస్ గేల్(733)
  • 2013: మైకేల్ హస్సీ (733)
  • 2014: రాబిన్ ఊతప్ప (660)
  • 2015: వార్నర్ (562)
  • 2016: కోహ్లి (973)
  • 2017: వార్నర్ (641)
  • 2018: కేన్ విలియమ్సన్ (735)
  • 2019: వార్నర్(692)