India-Origin Paediatrician : అమెరికాలో భారతీయ సంతతి డాక్టర్ ఘాతుకం.. ఓ వైద్యురాలిని చంపి..తనని తాను కాల్చున్న భరత్

అమెరికాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇటీవల క్యాన్సర్ బారినపడిన 43 ఏళ్ల భారతీయ-అమెరికన్ చిన్నపిల్లల వైద్య నిపుణుడు మరో మహిళా వైద్యురాలిని కాల్చి చంపాడు. అనంతరం తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని..

India-Origin Paediatrician : అమెరికాలో భారతీయ సంతతి డాక్టర్ ఘాతుకం.. ఓ వైద్యురాలిని చంపి..తనని తాను కాల్చున్న భరత్
Follow us

|

Updated on: Jan 29, 2021 | 10:52 AM

India-Origin Paediatrician : అమెరికాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇటీవల క్యాన్సర్ బారినపడిన 43 ఏళ్ల భారతీయ-అమెరికన్ చిన్నపిల్లల వైద్య నిపుణుడు మరో మహిళా వైద్యురాలిని కాల్చి చంపాడు. అనంతరం తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఆస్టిన్ పోలీసులు తెలిపారు. హంతకుడు డా. భరత్ కుమార్ నారుమంచి(43) గా గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే..

చిన్నపిల్లల వైద్య నిపుణుడిగా కాలిఫోర్నియాలో ప్రాక్టీస్ చేస్తున్న భరత్ కుమార్ కు క్యాన్సర్ బారిన పడ్డారు. ఇక ఆయన ఆయుస్సు కూడా తక్కువ సమయమే అని వైద్యులు చెప్పారు. దీంతో టెక్సాస్ రాజధాని ఆస్టిన్‌లోని చిల్డ్రన్స్‌ మెడికల్‌ గ్రూప్‌ ఆస్పత్రికి వెళ్లిన భరత్ కుమార్ తాను స్వచ్చందంగా పనిచేస్తానని దరఖాస్తు చేసుకున్నాడు. ఆయన ఆర్జీని ఆస్పత్రి వారు తిరస్కరించారు. హతురాలు కేథరిన్‌ లిండ్లే డాడ్సన్‌(43). ఆమె కూడా చిన్నపిల్లల వైద్య నిపుణురాలే. అయితే భరత్‌కు కేథరిన్‌తో మునుపు ఏరకంగానూ పరిచయం లేదు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు రెండు పెద్ద బ్యాగులు, ఒక తుపాకీతో ఆ ఆస్పత్రిలోకి భరత్‌ ప్రవేశించారు.

ఆ సమయంలో ఆస్పత్రిలో పిల్లలు గానీ రోగులు గానీ లేరు. అక్కడి ఉద్యోగులంతా ఇళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. నారుమంచి ఒక్కసారిగా తుపాకీ ఎక్కుపెట్టి లిండ్లే డాడ్సన్‌ సహా ఐదుగురు వైద్యులను బందీలుగా తీసుకున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసినా ఏకంగా ఆరుగంటల పాటు టెన్షన్‌ నెలకొంది. బందీలైన వైద్యుల్లో నలుగురు తప్పించుకోవడమో, భరత్‌ విడిచిపెట్టడమో జరిగింది. అనంతరం మిగిలిన ఒకే ఒక్క వైద్యురాలు లిండ్లే డాడ్సన్‌ను భరత్‌ తుపాకీతో కాల్చి చంపారు. ఆపై తనను తాను కాల్చుకొని ప్రాణాలు విడిచారు. ఆస్టిన్‌లో మంచి హస్తవాసి ఉన్న చిన్నపిల్లల వైద్య నిపుణురాలిగా కేథరిన్‌ లిండ్లే డాడ్సన్‌కు చక్కని పేరుంది. కాగా ఇంతటి ఘాతుతానికి తమ కుమారుడు ఎందుకు పాల్పడ్డాడనేది అర్థం కావడం లేదని భరత్‌ తల్లిదండ్రులు పేర్కొన్నారు. తమ కొడుకు చేసిన ఈ దారుణం తమను జీవితాతం బాధపెడుతుందని.. డాడ్సన్‌ కుటుంబసభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నామంటూ ఓ ప్రకటన విడుదల చేశారు భరత్‌ తల్లిదండ్రులు.

Also Read:  ప్రపంచదేశాలకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చే కెపాసిటీ భారత్ కు మాత్రమే ఉంది… అదే పెద్ద ఆస్తి ఐక్యరాజ్యసమితి