Personality test: మీరేంటో మీ కనుబొమ్మలు చేప్పేస్తాయి.. ఎలాగో తెలుసా.?
పైన కనిపిస్తున్న ఫొటోలో మొత్తం 6 రకాల కనుబొమ్మలు కనిపిస్తున్నాయి. వీటిలో ఒక్కో ఆకారం బట్టి మన వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పొచ్చన నిపుణులు చెబుతున్నారు. ఐబ్రో షేప్ పర్సనాలిటీ టెస్ట్‌గా ఉపయోగపడుతుందని అంటున్నారు. ఇవి మీ ఇష్టాయిష్టాలతో పాటు ప్రాధాన్యతలు ఎలాంటివి, మీ ఆలోచనాలు ఎలాంటివో చెప్పొచ్చని నిపుణులు చెబుతున్నారు...
మనం ఎలాంటి వాళ్లం.? మన ఆలోచనలు ఎలా ఉంటాయన్న విషయాలు మనతో మాట్లాడితే తెలుస్తాయి.? లేదా మన వ్యక్తిత్వాన్ని చూస్తే అర్థమవుతుంది. అయితే మన కనుబొమ్మల ఆధారంగా మనం ఎలాంటి వాళ్లమో చెప్తే ఎలా ఉంటుంది.? వినడానికి కాస్త ఆసక్తికరంగా ఉన్నా ఇది నిజమే అంటున్నారు నిపుణులు. మన కంటి బొమ్మల ఆకారం ఆధారంగా మనం ఎలాంటి వాళ్లమో చెప్పొచ్చని మానసిక నిపుణులు అంటున్నారు.
పైన కనిపిస్తున్న ఫొటోలో మొత్తం 6 రకాల కనుబొమ్మలు కనిపిస్తున్నాయి. వీటిలో ఒక్కో ఆకారం బట్టి మన వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పొచ్చన నిపుణులు చెబుతున్నారు. ఐబ్రో షేప్ పర్సనాలిటీ టెస్ట్‌గా ఉపయోగపడుతుందని అంటున్నారు. ఇవి మీ ఇష్టాయిష్టాలతో పాటు ప్రాధాన్యతలు ఎలాంటివి, మీ ఆలోచనాలు ఎలాంటివో చెప్పొచ్చని నిపుణులు చెబుతున్నారు మరి ఈ ఆరు ఐబ్రో షేప్స్ ఆధారంగా మీరు ఎలాంటి వాళ్లో ఇప్పుడు తెలుసుకుందాం..
* 1వ నెంబర్‌లో ఉన్న మీకు దట్టమైన కనుబొమ్మలు ఉంటే మీరు స్వేచ్ఛాయుతమైన ఆలోచనలతో ఉన్న వ్యక్తి అని అర్థం. ప్రలు మిమ్మల్ని ఎలా చూస్తున్నారన్న దాని గురించి పెద్దగా ఆలోచించారు. మీ జీవితాన్ని సంపూర్ణంగా జీవించడానికి ప్రాధాన్యత ఇస్తారు. మీ ఆదర్శాలు, ఆలోచనలకు అనుగుణంగానే జీవితాన్ని సంపూర్ణంగా జీవించాలని కోరుకుంటారు.
* 2వ నెంబర్‌లో ఉన్నట్లు మీరు సన్నని కనుబొమ్మలను కలిగి ఉన్నట్లయితే.. మీలో స్వీయ విశ్వాసం తక్కువగా ఉంటుందని అర్థం. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటారు. కొత్తగా ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి వెనకా ముందు అవుతుంటారు. అతిగా ఆలోచిస్తుంటారు. అయితే మీ వ్యక్తిత్వం మాత్రం నిరాడబరంగరంగా ఉంటుంది.
* 3వ నెంబర్‌లో ఉన్నట్లు వంగిన ఆకారంలో ఉన్న కనుబొమ్మలను కలిగి ఉన్నట్లయితే.. మీకు మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. మీ మాటలతో ఇతరులను ఆకర్షిస్తారు. ప్రజలు మీకు ఆకర్షితులవుతుంటారు. అయితే మీరు ఎమోషనల్ పర్సనాలిటీ కలిగి ఉంటారు.
* 4వ నెంబర్‌లో చూపించినట్లుగా పొడువుగా ఉన్న కనుబొమ్మలు కలిగి ఉంటే.. మీరు చాలా లాజికల్‌గా ఆలోచించే వ్యక్తి అని అర్థం. భావోద్వేగం కంటే హేతుబద్దంగా ఆలోచిస్తారు. ఎమోషన్ కంటే వాస్తవాలకు ప్రాధాన్యత ఇస్తారు.
* 5వ నెంబర్‌లో ఉన్నట్లు అతుకున్న కనుబొమ్మలు కలిగి ఉంటే.. ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో అన్న ఆలోచన అస్సలు ఉండదు. మీ వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా స్వీకరిస్తారు. మీకు మీరు అధిక ప్రాధాన్యత ఇచ్చుకుంటారు. మీకు నచ్చని చోట ఉండడానికి ఇష్టపడరు. అలాగే మీరు త్వరగా మనస్తాపం చెందే మనస్తత్వంతో కలిగి ఉంటారు.
* 6వ నెంబర్‌లో చూపిన విధంగా కనుబొమ్మల మధ్య గ్యాప్ ఎక్కువగా ఉంటే.. మీరు ప్రేమగల వ్యక్తి అని అర్థం. మీరు ఎలాంటి ప్రణాళిక లేకుండా వ్యవహరించే ప్రవర్తన కలిగి ఉండే అవకాశాలు ఉంటాయి. భావోద్వేగాలకు సింపుల్‌గా గురయ్యే అవకాశం ఉంటుంది. చిన్న విషయాలకే భయపడుతుంటారు.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం పలవురు నిపుణులు తెలిపిన విషయాలు, ఇంటర్నెట్ వేదికగా అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందించినది మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయత లేదని రీడర్స్ గమనించాలి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి…