Hindu Temple: ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం ఎక్కడుందో తెలుసా..?

| Edited By: Ravi Kiran

Dec 11, 2021 | 6:36 AM

Hindu Temple: దేవాలయాలకు పెట్టింది పేరు భారతదేశం. హిందు, ముస్లిం, క్రిస్టియన్లకు చెందిన ఎన్నో దేవాలయాలు భారత దేశంలో కొలువై ఉన్నాయి. భారత దేశంలో హిందువులకు..

Hindu Temple: ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం ఎక్కడుందో తెలుసా..?
Follow us on

Hindu Temple: దేవాలయాలకు పెట్టింది పేరు భారతదేశం. హిందు, ముస్లిం, క్రిస్టియన్లకు చెందిన ఎన్నో దేవాలయాలు భారత దేశంలో కొలువై ఉన్నాయి. భారత దేశంలో హిందువులకు చెందిన దేవాలయాల సంఖ్య లెక్కించడం చాలా కష్టం. ఎందుకంటే ఎందుకంటే హిందూ దేవాలయాలు అన్ని ఉన్నాయో లెక్కపెట్టలేనన్ని ఉన్నాయన్నమాట. కాని ప్రపంచంలోకెళ్లా పెద్ద హిందువుల ఆలయం కాంబోడియాలోని ఆంగ్ కోర్ వాట్లో ఉంది. ఆ ఆలయంలో శ్రీ మహావిష్ణువు కొలువై ఉన్నాడు. ఈ ఆలయం ప్రపంచంలోనే పెద్ద హిందు దేవాలయంగా చరిత్రకెక్కింది. 12వ శతాబ్ధంలో సూర్యవర్మస్ అనే రాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ ఆలయం హిందువుల నిర్మాణ శైలిలో కాకుండా క్మేర్ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. కాని శిల్పాకళా నైపుణ్యం మాత్రం హిందూ సాంప్రదాయంగా ఉంటుంది. ఆలయ నిర్మాణంలో అక్కడక్కడ తమిళనాడులోని ఆలయాలకు చెందిన శైలి కనిపిస్తుంది.

భారతదేశంలో మనం చెప్పుకుంటున్న ఇతిహాసాలను కూడా తనలోచూపిస్తూ ఎంతో ఆకట్టుకుంటుంది ఈ ఆలయం. శ్రీ మహావిష్ణువు కొలువైన ఈ ఆలయాన్ని 200 చ .కి.మీ విస్తీర్ణంలో ఉంది. ఈ ఆలయం నిర్మించడానికి సుమారు 30 సంవత్సరాలు పట్టిందని సమాచారం. ప్రపంచంలో ఎక్కడైనా నీళ్లు ఎగువ నుంచి దిగువ ప్రాంతానికి ప్రవహిస్తాయి… కానీ ఇక్కడ మాత్రం నీళ్లు దిగువ నుంచి ఎగువ ప్రాంతానికి ప్రవహిస్తాయట. ఇలా ఎందుకు జరుగుతోందని ఇప్పటి వరకు ఎవరు కనిపెట్టలేకపోయారు. కంబోడియా దేశ జాతీయ పతాకంలో ఈ దేవాలయానికి స్థానం దక్కింది. హిందువులకు చెందిన ఆలయం మరొక దేశ జాతీయ పతాకంపై ఎగురుతుండటం ఎంతో సంతోషాన్ని ఇచ్చినా.. అదే ఆలయం మన ఇండియాలో లేకపోవడం బాధాకరం.

ఇవి కూడా చదవండి:

Moon-Sun: సూర్యకాంతి లాగా వెన్నెల వేడిగా ఉందుకు ఉండదు..? చందమామ చల్లగా ఎందుకుంటాడు

Nasa: ఈ నెల12న ఆకాశంలో అద్భుతం.. గ్రీన్‌ కలర్‌ తోకచుక్క దర్శనం..70వేల ఏళ్ల తర్వాత భూమికి చేరువుగా..