Fastest Birth: పురుటి నొప్పులు లేవు.. సిజేరియన్ చేయలేదు.. కేవలం 27 సెకన్లలోనే.. బిడ్డను కనేసింది!
Birth in seconds: పురుటి నొప్పులు అనే పేరు చెబితే.. మహిళల్లో ఒక్క క్షణమైనా భయం కనిపిస్తుంది. పండంటి బిడ్డను కనే సమయంలో తల్లి పడే ఆ నరకం గురించి ఎంతో మంది ఎన్నో రకాలుగా చెప్పారు.
Fastest Birth: పురుటి నొప్పులు అనే పేరు చెబితే.. మహిళల్లో ఒక్క క్షణమైనా భయం కనిపిస్తుంది. పండంటి బిడ్డను కనే సమయంలో తల్లి పడే ఆ నరకం గురించి ఎంతో మంది ఎన్నో రకాలుగా చెప్పారు. వైద్యులు కూడా ఆ పురుటి నొప్పుల గురించి ఎప్పుడు ఆందోళన పడతారు. ఒక్కోసారి బిడ్డను కనే క్రమంలో నొప్పులను తల్లి తట్టుకోలేదు.. ఆమె శరీరం అందుకు సహకరించదు.. అనే పరిస్థితిలో సిజేరియన్ చేసి బిడ్డలను బయటకు తీస్తారు. సహజంగా జరిగే ప్రక్రియ ఇది. కానీ, ఎటువంటి ప్రసవ వేదనా లేకుండా.. చాలా మామూలుగా.. అదీ 27 సెకెన్లలో బిడ్డకు జన్మనిచ్చింది ఓ మాతృమూర్తి. ఈ సంఘటన ఇంగ్లాండ్ లో చోటుచేసుకుంది.
29 ఏళ్ల సోఫీ బగ్ తెల్లవారుజామున నాలుగు గంటలకు టాయిలెట్ కు వెళ్ళింది. ఆమె 38 వారాల గర్భవతి..టాయిలెట్ కు వెళ్ళిన ఒక్క నిమిషంలో బిడ్డతో తిరిగి వచ్చింది. అవును.. మీరు చదివింది నిజమే. ఇది ఎలా జరిగింది అనేది ఆ తల్లి మాటల్లోనే..
”నేను ఉదయం టాయిలెట్ కు వెళ్లాను. అక్కడ మామూలుగా కూచునే సమయంలో కొద్దిగా అసహజంగా అనిపించింది. ఎదో బయటకు వస్తున్నట్టు అనిపించింది. నాకు అర్ధం అయింది. నా బిడ్డ బయటకు రాబోతోందని నా చేతిని కాళ్ళమధ్య ఉంచాను. నేను టాయిలెట్ లోంచి నా భర్తను పిలిచాను. ఫోన్ లో డాక్టర్ బిడ్డను ఒక్కసారిగా పుష్ చేయమని చెప్పింది. అదీ 27 సెకన్లలో జరగాలని చెప్పింది. సరిగ్గా అలానే చేశాను. అది చాలా వేగంగా కన్ను మూసి తెరిచే లోపు జరిగిపోయింది. నేను నమ్మలేకుండా ఉన్నాను. నిమిషంలో నా బిడ్డ నా చేతుల్లో ఉంది.”
ఆ తరువాత డాక్టరు ఫోనులో చెప్పిన విధంగా బొడ్డుతాడు కోశాడు ఆమె భర్త. ఆ తరువాత తల్లీ బిడ్డలను ఆసుపత్రికి తీసుకు వెళ్ళారు. అక్కడ మూడుగంటల పాటు ఆమెకు వైద్య సహాయం అందించి తరువాత ఇంటికి క్షేమంగా పంపించారు.
ఇలా సోఫీ బగ్ ఇంత త్వరగా బిడ్డ పుట్టడం జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఆమె ఇదే విధంగా తన బిడ్డలకు జన్మ ఇచ్చింది. 2013 లో తన మొదటి బిడ్డ గర్భంలో ఉండగా ఒకరోజు అర్ధ రాత్రి ఇలానే టాయిలెట్ కు వెళ్ళింది. అక్కడ ఆమె బిడ్డను కనడం జరిగింది. అయితే, అప్పుడు 12 నిమిషాలు బిడ్డను కనడానికి సమయం పట్టింది. తరువాత బిడ్డ కూడా ఇలానే తండ్రి చేతుల్లోనే పుట్టేసింది. దీనిపై సోఫీ బగ్ మాట్లాడుతూ.. నాకు అసలు పురిటి నొప్పులే తెలియవు. అకస్మాత్తుగా అలా జరిగిపోతుంది. నా అన్ని కాన్పులలోనూ నా భర్త నా పక్కన ఉన్నారు. అంతేకాదు, నా బిడ్డలను ఆయనే రక్షించి బొడ్డుతాడు కోశారు. ఇది ఎంతో సంతోషకరమైన విషయం అని చెప్పింది.