Terrifying: సముద్రంలో ఆడుకుంటున్న చిన్నారి.. వీడియో తీస్తున్న తల్లి.. ఇంతలో కెమెరాలో కనిపించిన దృశ్యం చూసి షాక్! Viral Video
Terrifying experience: మనకు పెద్దగా షార్క్ లు వాటితో ప్రమాదాలు తెలియవు కానీ, పాశ్చాత్య దేశాల్లో సముద్రం పై విహారం చేసేవారికి, సాహస క్రీడల్లో పాల్గొనే వారిపై షార్క్ లు చాలా సందర్భాల్లో దాడి చేసి ప్రాణంతకం అవుతూ ఉంటాయి.
Terrifying: మనకు పెద్దగా షార్క్ లు వాటితో ప్రమాదాలు తెలియవు కానీ, పాశ్చాత్య దేశాల్లో సముద్రం పై విహారం చేసేవారికి, సాహస క్రీడల్లో పాల్గొనే వారిపై షార్క్ లు చాలా సందర్భాల్లో దాడి చేసి ప్రాణంతకం అవుతూ ఉంటాయి. షార్క్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారు.. దాని దెబ్బకు అవయవాలు ఛిద్రం అయినవాళ్ళూ చాలా మంది ఉంటారు. ఒక్కోసారి షార్క్ దాడి నుంచి త్రుటిలో తప్పించుకున్న వారి కథలూ అక్కడ సర్వసాధారణంగా వెలుగులోకి వస్తుంటాయి. అటువంటిదే ఈ చిన్నారి కథ. సముద్రపు ఒడ్డుకు అమ్మా, నాన్నలతో కలిసి షికారుకు వెళ్లి..ఆడుకుంటున్న ఓ చిన్నారిని షార్క్ మింగేసినంత పనిచేసింది. అదృష్టవశాత్తూ ఆ చిన్నారి తప్పించుకోగాలిగింది. ఇదంతా ఆ బాలిక తల్లి వీడియో తీసింది.
హవాయి లో కాలమా బీచ్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. షెరీ గౌవేయా అనే ఆమె తన ఆరేళ్ళ చిన్నారి అనేలా రెజెంటెస్ ను కేలువాలోని బీచ్ వద్ద వీడియో రికార్డింగ్ చేస్తోంది. ఇంతలో ఆ పాప వెనుక ఒక సొరచేప ఒక్కసారిగా వచ్చింది. దానిని చూసిన చిన్నారి పక్కకు గెంతి త్రుటిలో దానిబారి నుంచి తప్పించుకోగాలిగింది. ఇదంతా చాలా వేగంగా జరిగిపోయింది. ఇదంతా ఆ తల్లి తీసిన వీడియోలో స్పష్టంగా కనిపించింది. కేమేరాలోంచి ఆ చిన్నారి ఆటలను చిత్రీకరిస్తున్న షెరీ గౌవేయా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. తన ప్రాణాలు పోయినట్టు అనిపించింది.
“అమ్మో ఒక్కసారే భయం వేసింది. నేను ఒక సొరచేపను చూశాను, అది నా వెనుక ఉన్నట్లు నేను గమనించలేదు. సడన్ గా చూసి నేను నిజంగా అయిపోయాను అనుకున్నాను. నేను నిజంగా భయపడ్డాను.” అంటూ తన అనుభవాన్ని చెప్పింది బాలిక అనేలా రెజెంటెస్ ”ఇక్కడకు తరచూ వస్తుంటాం. ఇలాంటి అనుభవం ఎప్పుడూ రాలేదు. నా పై ప్రాణాలు పైనే పోయాయి.” అంటూ చెప్పారు షెరీ గౌవేయా. ”నా బిడ్డ నీటిలోంచి ఒడ్డుకు పరిగెత్తుకుంటూ భయంతో వచ్చింది. తను విపరీతమైన షాక్ లో ఉంది. అసలు కొద్ది సేపు నోటిలో మాట రాలేదు.” అంటూ వివరించారు.
ఆ చిన్నారి వీడియో ఇదిగో ఇక్కడ ఉంది.. మీరూ చూడండి..
Also Read: ఊరు ఊరంతా ఐసోలేషన్!ఐసొలేషన్ పాటిస్తూ పొలాల్లో ఉంటున్న సగం ఊరి జనం వీడియో… : viral video.