AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాత్రంతా ఫోన్ ఛార్జింగ్‌ పెట్టి నిద్రపోతున్నారా..? బ్యాటరీ వేడెక్కుతే అంతే సంగతి! తస్మాత్‌ జాగ్రత్త..

స్మార్ట్‌ఫోన్లు ఇప్పుడు మనకు నిత్య సహచరులుగా మారాయి. తెల్లవారుజామున అలారం మోగించడం నుండి రాత్రిపూట గుడ్‌నైట్‌ పేరుతో స్క్రోల్ చేయడం వరకు ప్రతి ఒక్కరికి అతి ముఖ్యమైన లైఫ్‌ పార్ట్‌నర్‌గా మారింది. ఒక్కమాటలో చెప్పాలంటే స్మార్ట్‌ఫోన్ లేకుండా సాధారణ జీవితాన్ని సజావుగా గడపలేని పరిస్థితిలోకి వెళ్లిపోయారు ప్రతి ఒక్కరూ. అయితే, మన ఫోన్‌లను ఛార్జ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు పదేపదే చెబుతున్నప్పటికీ చాలా మందికి అర్థం కాలేదు. రాత్రిపూట ఫోన్‌ ఛార్జింగ్‌ పెట్టేసి యద్ధేచ్ఛగా నిద్రపోతుంటారు చాలా మంది.

రాత్రంతా ఫోన్ ఛార్జింగ్‌ పెట్టి నిద్రపోతున్నారా..? బ్యాటరీ వేడెక్కుతే అంతే సంగతి! తస్మాత్‌ జాగ్రత్త..
Smartphones On Charge
Jyothi Gadda
|

Updated on: Jul 09, 2025 | 12:46 PM

Share

అవును మనలో చాలా మంది రోజంతా ఫోన్‌లను ఉపయోగించి, రాత్రి పడుకునే ముందు వాటిని ఛార్జ్ చేస్తుంటారు. మనం రాత్రి నిద్రపోయినప్పటి నుండి ఉదయం నిద్రలేచి ఛార్జర్ నుండి ఫోన్‌ను అన్‌ప్లగ్ చేసే వరకు అది అలాగే ఉంటుంది. బ్యాటరీ 100 శాతం కెపాసిటీకి చేరుకున్నప్పటికీ, ఫోన్ రాత్రంతా ఛార్జింగ్‌లోనే ఉంటుంది. చాలా మంది ఎక్కువగా చేసే ఈ తప్పు తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది మీకు హానిచేయని అలవాటు కావొచ్చు.. కానీ, మీకు తెలియకుండానే మీ ఫోన్ జీవితకాలాన్ని తగ్గిస్తుంది. మీ భద్రతను కూడా ప్రమాదంలో పడేస్తుంది.

నేటి చాలా స్మార్ట్‌ఫోన్‌లు 100శాతానికి చేరుకున్న తర్వాత ఛార్జింగ్‌ను ఆపివేసేంత సమర్థవంతమైనవి కావు. పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత కూడా మీ ఫోన్ బ్యాక్‌గ్రౌండ్ పనుల కోసం తక్కువ మొత్తంలో పవర్‌ను ఉపయోగిస్తూనే ఉంటుంది. దీనివల్ల అది 100శాతం కంటే తక్కువకు పడిపోతుంది. ఇది తిరిగి ఛార్జ్ చేయడానికి ట్రికిల్ ఛార్జ్ ని ప్రేరేపిస్తుంది. 99 బ్యాటరీ 1 శాతం కూడా తగ్గిన వెంటనే మళ్లీ ఛార్జింగ్ ప్రారంభమవుతుంది. ఇది ఖచ్చితంగా బ్యాటరీ జీవితకాలాన్ని ప్రభావితం చేస్తుంది. గమనించదగ్గ మరో విషయం ఏమిటంటే, ఫోన్‌లు ఛార్జింగ్ చేసేటప్పుడు ఎక్కువ వేడిని ఉత్పత్తి చేస్తాయి. ఇది బ్యాటరీ, ఇతర భాగాలపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. దీనికి సంబంధించి, మీ ఐఫోన్ చాలా సమయం పాటు పూర్తి ఛార్జ్‌లో ఉన్నప్పుడు, బ్యాటరీ హెల్త్ పై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.

రాత్రిపూట ఛార్జింగ్ చేసేటప్పుడు బ్యాటరీ ఆరోగ్యానికి అతి పెద్ద ముప్పు వేడి. ఛార్జింగ్ వేడిని ఉత్పత్తి చేస్తుంది. మీ ఫోన్ దిండు కింద, ఒక కేసులో లేదా వెంటిలేషన్ సరిగా లేని ప్రదేశంలోఉంటే గనుక ఉష్ణోగ్రత త్వరగా పెరుగుతుంది. అధిక వేడి ముఖ్యంగా లిథియం-అయాన్ బ్యాటరీలకు హానికరం. దీనివల్ల అవి ఉబ్బుతాయి, సామర్థ్యాన్ని కోల్పోతాయి. తీవ్రమైన సందర్భాల్లో అగ్ని ప్రమాదం ఏర్పడుతుంది.

ఇవి కూడా చదవండి

నిపుణుల అభిప్రాయం ప్రకారం బ్యాటరీని ఎక్కువసేపు అధిక ఉష్ణోగ్రతల వద్ద ఉంచడం వల్ల రసాయన చర్య వేగవంతం అవుతుంది. రాత్రిపూట ఛార్జింగ్ మీ పరికరాన్ని గంటల తరబడి ఈ వెచ్చని స్థితిలో ఉంచుతంది. ప్రత్యేకించి మీరు ఛార్జింగ్ చేస్తున్నప్పుడు లేదా నేపథ్య యాప్‌లను వాడుతున్నప్పుడు మీరు మీ ఫోన్‌ను ఉపయోగిస్తుంటే అవి పేలిపోయే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే, మీ స్మార్ట్ ఫోన్ చార్జీంగ్ ఎప్పుడూ సగటున 20 శాతం నుంచి 80 శాతం రేంజ్​లో ఫోన్ ఛార్జింగ్ లెవల్స్‌ను ఉంటుకుంటే మంచిదని చెబుతున్నారు. దీంతో మీ ఫోన్ బ్యాటరీ కనీసం 1000కిపైగా ఛార్జ్ సైకిల్స్‌ను అందిస్తుంది. ఇది మూడేళ్ల పాటు రోజూ ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టిన దానితో సమానం అంటున్నారు నిపుణులు.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..