AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇప్పుడు ఇక్కడ ఉన్నాము.. కానీ ఏదో ఒక రోజు పోతాము.. వైరల్‌గా మారిన జవాన్‌ చివరి మాటలు

నెలల తరబడి కుటుంబానికి దూరంగా ఉండాలి. గడ్డకట్టే చలిలోనూ సరిహద్దుల్లో గస్తీ కాయాలి. ఎప్పుడు, ఎక్కడ, ఎలా శత్రవులు దాడి చేస్తారో తెలీదు.

ఇప్పుడు ఇక్కడ ఉన్నాము.. కానీ ఏదో ఒక రోజు పోతాము.. వైరల్‌గా మారిన జవాన్‌ చివరి మాటలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 28, 2020 | 1:45 PM

Share

Martyred jawan chat: నెలల తరబడి కుటుంబానికి దూరంగా ఉండాలి. గడ్డకట్టే చలిలోనూ సరిహద్దుల్లో గస్తీ కాయాలి. ఎప్పుడు, ఎక్కడ, ఎలా శత్రవులు దాడి చేస్తారో తెలీదు. అయినా వారు భయపడరు. దేశ భద్రత బాధ్యతను భుజాన వేసుకునే వారు.. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశం రుణం తీర్చుకుంటుంటారు. ఇది జవాన్ల గాథ. కాగా ఇటీవల వీర మరణం పొందిన ఓ జవాన్ ముందు రోజు తన స్నేహితుడితో చెప్పిన చివరి మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఏదో ఒక రోజు మాకు మరణం తప్పదు కదా అంటూ ఓ వీర జవాన్ అన్న మాటలు అందరినీ కదిలిస్తున్నాయి. (ప్రభాస్‌-నాగ్‌ అశ్విన్ మూవీ.. ఆ ముగ్గురి పాత్రలు సమానంగా ఉండనున్నాయట.. అంతేకాదు..!)

వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లా చాలిగావ్‌ తాలూకాకు చెందిన యశ్‌ దేశ్‌ముఖ్(21) 2019లో ఆర్మీకి ఎంపికయ్యారు. ఆ తరువాత జమ్ముకశ్మీర్‌లోని 10 ఇన్‌ఫాంట్రీ బెటాలియన్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో గత గురువారం శ్రీనగర్‌లోని పారింపొరాలో జరిగిన దాడిలో యశ్‌ ప్రాణాలు కోల్పోయారు. ఇక చనిపోయే ఒక రోజు ముందు తన స్నేహితుడితో యశ్‌ వాట్సాప్‌లో మాట్లాడారు. అందులో ఎలా ఉన్నావు..? అన్న ఫ్రెండ్ ప్రశ్నకు.. నేను బాగానే ఉన్నా. మా జీవితం గురించి ఏం చెబుతాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నాము. ఏదో ఒక రోజు పోతాము అని యశ్‌ సమాధానం ఇచ్చాడు. సైనికుడి జీవితం అంటే దిన దిన గండమని మిత్రుడితో తెలిపారు. ఆ మరుసటి రోజే అతడు మరణించారు. ప్రస్తుతం యశ్‌ మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. మనసును కలిచివేస్తున్నాయి. (రజనీకాంత్ పాటతో జిమ్‌లో వర్కౌట్లు చేస్తోన్న ధనుష్‌, సారా అలీ ఖాన్.. వీడియో వైరల్‌)

రాయల్ లుక్‌లో యంగ్‌ బ్యూటీ సారా అర్జున్‌.. మతిపోగొట్టేలా ఫోజులు!
రాయల్ లుక్‌లో యంగ్‌ బ్యూటీ సారా అర్జున్‌.. మతిపోగొట్టేలా ఫోజులు!
చీకట్లో మగ్గుతున్న గిరి పుత్రుల జీవితాల్లో వెలుగులు..!
చీకట్లో మగ్గుతున్న గిరి పుత్రుల జీవితాల్లో వెలుగులు..!
కుంభ రాశిలో త్రిగ్రాహి రాజయోగం.. వీరికి పట్టిందల్లా బంగారమే!
కుంభ రాశిలో త్రిగ్రాహి రాజయోగం.. వీరికి పట్టిందల్లా బంగారమే!
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టాలీవుడ్ యంగ్ హీరో
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టాలీవుడ్ యంగ్ హీరో
నోట్లో వేయగానే కరిగిపోతుంది.. తందూరి చికెన్ ఇంట్లో ఇలా చేయండి!
నోట్లో వేయగానే కరిగిపోతుంది.. తందూరి చికెన్ ఇంట్లో ఇలా చేయండి!
ఒక్కసారి ఛార్జింగ్‌తో 110 కి.మీ రేంజ్‌.. ధర ఎంతో తెలుసా?
ఒక్కసారి ఛార్జింగ్‌తో 110 కి.మీ రేంజ్‌.. ధర ఎంతో తెలుసా?
రాజయోగం పట్టనుంది.. రాసిపెట్టుకోండి ఫిబ్రవరిలో ధనవంతులు వీరే
రాజయోగం పట్టనుంది.. రాసిపెట్టుకోండి ఫిబ్రవరిలో ధనవంతులు వీరే
ప్రేమంటే ఇదేరా.. రెండు హృదాయాలను కలిపే అద్భుతమైన కానుక..
ప్రేమంటే ఇదేరా.. రెండు హృదాయాలను కలిపే అద్భుతమైన కానుక..
మెట్రో స్టేషన్‌లో జంట ఎంగేజ్‌మెంట్‌.. గుక్కపట్టి ఏడ్చిన వరుడు!
మెట్రో స్టేషన్‌లో జంట ఎంగేజ్‌మెంట్‌.. గుక్కపట్టి ఏడ్చిన వరుడు!
నా పెళ్లి అయ్యేలోపు అమ్మను మరో పెళ్లి చేసుకోమని అడిగాను..
నా పెళ్లి అయ్యేలోపు అమ్మను మరో పెళ్లి చేసుకోమని అడిగాను..