AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ పాదాలు మీ గురించి ఏం చెబుతున్నాయో ఇప్పుడే తెలుసుకోండి.. ఎవరికీ తెలియని రహస్యాలు మీకోసం..!

మన వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడం ద్వారా జీవితంలో ముందుకు సాగడానికి ఎంతో ఉపయోగపడుతుంది. మన లో ఉన్న బలాలు, బలహీనతలు, మన ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి కొన్ని ఆసక్తికరమైన పద్ధతులు ఉన్నాయి. ఇవి మీ ఎదుగుదలకు, మెరుగైన సంబంధాలకు ఉపయోగపడతాయి. అవేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

మీ పాదాలు మీ గురించి ఏం చెబుతున్నాయో ఇప్పుడే తెలుసుకోండి.. ఎవరికీ తెలియని రహస్యాలు మీకోసం..!
Flat Vs High Arches
Prashanthi V
|

Updated on: Jun 27, 2025 | 2:44 PM

Share

మన పాదాల ఆకృతి ఆధారంగా మన మనసు ఎలా పనిచేస్తుందో తెలుసుకోవచ్చు. ఇవి మనం తీసుకునే నిర్ణయాలకు మార్గదర్శకాలు కావు.. కానీ వ్యక్తిగత అభివృద్ధికి మాత్రం మంచి సూచకాలు కావచ్చు. ఇప్పుడు పాదాల ఆకృతి ద్వారా మనం ఏ రకమైన వ్యక్తులమో తెలుసుకుందాం.

Flat Vs High Arches 1

మీ పాదాలు ఫ్లాట్ గా ఉంటే (Low Arch / Flat Feet).. మీరు జీవితాన్ని ప్రశాంతంగా, స్థిరంగా ముందుకు నడిపించే వ్యక్తిగా కనిపిస్తారు. మీ స్వభావంలో నిజాయితీ ప్రధానంగా ఉంటుంది. ఇతరులతో కలిసి మెలిసి ఉండటంలో మీరు ముందుంటారు. మీకు సామాజికంగా చురుకైన అలవాట్లు ఉంటాయి. మీరు సమతుల్యమైన ప్రవర్తనతో, శాంతియుతంగా వ్యవహరిస్తారు. వాస్తవికతపై నమ్మకంతో జీవిస్తారు. కలల కంటే నిజాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. మీరు మితంగా, సహనంగా ఉండే వ్యక్తి.

అలాగే ఇతరులతో స్నేహ సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఇష్టపడతారు. గుంపుల్లో, స్నేహితుల మధ్య మీకు ఇష్టపడే వాతావరణం ఉంటుంది. మీరు కలలు కన్నా కార్యాచరణపై నమ్మకంతో ముందుకు సాగుతారు. ప్రేమ, ఆదరణతో స్పందించగల శక్తి మీలో ఉంటుంది. ఎక్కువగా ఇతరుల దృష్టిలో పడాలని భావించరు. సాధారణ జీవనశైలిని మెచ్చుకునే వ్యక్తిగా ఉంటారు. స్వాతంత్య్రంపై మీకు పెద్దగా ఆసక్తి ఉండకపోవచ్చు. కానీ మీకు దగ్గరి సంబంధాలు, ఇతరుల మద్దతు ఉంటే ముందుకు సాగాలని కోరుకుంటారు.

Flat Vs High Arches 2

మీ పాదాలు పైకి ఉంటే (High Arch).. మీరు ఊహాశక్తితో, లోతైన ఆలోచనలతో నిండి ఉండే వ్యక్తిగా కనిపిస్తారు. మీలో తగినంత ఆత్మవిశ్వాసం ఉంటుంది. మీ అభిప్రాయాలపై మీరు నమ్మకంగా ఉంటారు. కొత్త విషయాలపై కుతూహలం, వ్యక్తిగత అభివృద్ధిపై ఆసక్తి మీలో బలంగా ఉంటాయి. ఒంటరిగా ఉండి ప్రశాంతంగా ఆలోచించడం మీకు ఇష్టం. మీ సొంత ప్రపంచంలో జీవించాలనుకునే ధోరణి మీలో ఉంటుంది. సమస్యలు ఎదురైతే వాటిని మీరే పరిష్కరించాలనుకునే గుణం కలిగి ఉంటారు. సహాయం అడగడం కన్నా స్వయంగా చేద్దామని భావిస్తారు.

మీరు కొత్త కలలతో, విభిన్న ఆలోచనలతో ముందుకు సాగుతారు. సాధారణంగా మీరు ఒక డ్రీమర్‌ గా భావించబడతారు. మీరు మొదట చూస్తే కొంచెం తక్కువగా స్పందించే వ్యక్తిగా అనిపించవచ్చు.. కానీ మాట్లాడేటప్పుడు మీ మాటలు స్పష్టంగా, నిశ్చయంగా ఉంటాయి. మీలో ఉన్నతమైన గమనించే శక్తి ఉంటుంది. మీ పరిసరాలను, వ్యక్తుల మానసికతను బాగా అర్థం చేసుకునే గుణం మీలో ఉంటుంది. ఈ విధంగా మన పాదాల ఆకృతిని బట్టి మన వ్యక్తిత్వ లక్షణాలను కొంతవరకు అంచనా వేయవచ్చు.