Dreams: కలలో కాకి కనిపిస్తే ఏమవుతుంది.? స్వప్నశాస్త్రం ఏం చెబుతోందంటే..
కలలో కాకి కనిపిస్తే మనలో చాలా మంది అపశనుకంగా భావిస్తుంటాం. నిజానికి కాకి అనగానే అదేదో చెడుగా భావిస్తుంటాం. ఇంతకీ కలలో కాకి కనిపిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి.? అసలు కలలో కాకి కనిపిస్తే ఏం జరుగుతుంది.? స్వప్నశాస్త్రంలో ఇందుకు సంబంధించి ఎలాంటి విషయాలు తెలిపారు ఇప్పుడు తెలుసుకుందాం..

రాత్రి పడుకున్న సమయంలో కలలు రావడం సర్వసాధారణమైన విషయం. అయితే కలలో కనిపించే కొన్ని దృశ్యాలు మనల్ని కొన్ని సందర్భాల్లో భయపెడుతుంటే, మరికొన్ని సందర్భాల్లో సంతోషాన్ని ఇస్తుంటాయి. అయితే భయంకరంగా కనిపించే దృశ్యాలన్నీ చెడు సంకేతాలు కావని, మంచిగా కనిపించేవన్నీ మంచికి సంకేతాలు కావని స్వప్నశాస్త్రం చెబుతోంది.
కలలో కాకి కనిపిస్తే మనలో చాలా మంది అపశనుకంగా భావిస్తుంటాం. నిజానికి కాకి అనగానే అదేదో చెడుగా భావిస్తుంటాం. ఇంతకీ కలలో కాకి కనిపిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి.? అసలు కలలో కాకి కనిపిస్తే ఏం జరుగుతుంది.? స్వప్నశాస్త్రంలో ఇందుకు సంబంధించి ఎలాంటి విషయాలు తెలిపారు ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా ఎవరైనా చనిపోతే కాకికి పిండం పెట్టడం అనవాయితీగా వస్తుంది. కాకి పిండాన్ని ముడితే చనిపోయిన వారి ఆత్మ శాంతించినట్లు అర్థం చేసుకోవాలని చెబుతుంటారు. మరి అలాంటి కాకి కలలో కనిపిస్తే.. చనిపోయిన మన పూర్వీకులకు కర్మలు చేయాలని అర్థం. అలాగే కలలో కాకి కనిపిస్తే మీ జీవితంలో ఏదో మార్పు జరగనున్నట్లు అర్థం చేసుకోవాలి. కర్మ ఫలితం ఏదో అనుభించపోతున్నారని చెబుతున్నారు. ఒకవేళ కలలో కాకి కనిపిస్తే ఉదయాన్ని శని భగవానుడిని దర్శించుకోవాలని పండితులు చెబుతున్నారు.
ఇక కలలో కాకి కనిపిస్తే ఆర్థికంగా మీకు ఏదో లాభం చేకూరనుందని అర్థం చేసుకోవాలని పండితులు చెబుతున్నారు. అలాగే ఒకవేళ కాకి తూర్పు నుంచి పడమరకు వెళ్తున్నట్లు కనిపిస్తే.. త్వరలోనే సంపాదన కలిసొచ్చే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. ఒకవేళ మీ కలలో కాకి పెరుగు తింటున్నట్లు కనిపిస్తే అనారోగ్యంతో బాధపడేవారికి ఆ సమస్య నుంచి విముక్తి లభించే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. మీ వ్యాపారం స్థలంలో కాకి ఉన్నట్లు కనిపిస్తే.. మంచి లాభాలు ఆర్జించబోతున్నారని అర్థం చేసుకోవాలని స్వప్నశాస్త్రంలో చెబుతున్నారు.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం పలువురు పండితులు, స్వప్నశాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి…




