AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Single and Double Malt: సింగిల్‌, డబుల్‌ మాల్ట్‌ లిక్కర్ గురించి ఎప్పుడైనా విన్నారా? మద్యపానంలో ఆ రాష్ట్రం టాప్‌..

మన దేశంలో మద్యం సేవించే వారి సంఖ్య కోట్లలో ఉంటుంది. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు మద్యంపై విధించే పన్నుతో ప్రతి సంవత్సరం ప్రభుత్వ ఖజానాను నింపుకోవడానికి ఇదే కారణం. ప్రతి యేట దేశ వ్యాప్తంగా కోట్ల రూపాయల్లో మద్యం వ్యాపారం జోరుగా సాగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో మద్యపాన నిషేదం ఉన్నప్పటికీ పక్క రాష్ట్రాలకు వెళ్లిమరీ సురపానం చేసివస్తున్నారు. అయితే మీరు సింగిల్ మాల్ట్, డబుల్ మాల్ట్ మద్యం గురించి ఎప్పుడైనా విన్నారా? వాటి మధ్య తేడా..

Single and Double Malt: సింగిల్‌, డబుల్‌ మాల్ట్‌ లిక్కర్ గురించి ఎప్పుడైనా విన్నారా? మద్యపానంలో ఆ రాష్ట్రం టాప్‌..
Liquor Sales
Srilakshmi C
|

Updated on: Nov 30, 2023 | 12:57 PM

Share

మన దేశంలో మద్యం సేవించే వారి సంఖ్య కోట్లలో ఉంటుంది. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు మద్యంపై విధించే పన్నుతో ప్రతి సంవత్సరం ప్రభుత్వ ఖజానాను నింపుకోవడానికి ఇదే కారణం. ప్రతి యేట దేశ వ్యాప్తంగా కోట్ల రూపాయల్లో మద్యం వ్యాపారం జోరుగా సాగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో మద్యపాన నిషేదం ఉన్నప్పటికీ పక్క రాష్ట్రాలకు వెళ్లిమరీ సురపానం చేసివస్తున్నారు. అయితే మీరు సింగిల్ మాల్ట్, డబుల్ మాల్ట్ మద్యం గురించి ఎప్పుడైనా విన్నారా? వాటి మధ్య తేడా ఏమిటి, వాటిని తయారు చేయడానికి ఏ పద్ధతులు ఉపయోగిస్తారు? మన దేశంలోని ఏయే రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా మద్యం సేవిస్తారు? వంటి వివరాలు మీకోసం..

సింగిల్ మాల్ట్ మద్యం అంటే ఏమిటి?

సింగిల్ మాల్ట్ మద్యం లేదా సింగిల్ మాల్ట్ విస్కీ అత్యంత ప్రీమియంగా పరిగణించబడుతుంది. దీన్ని తయారు చేయడానికి మొక్కజొన్న లేదా గోధుమలను ఉపయోగిస్తారు. దీనిని ఒకే డిస్టిలరీలో ఉత్పత్తి చేస్తారు. ఈ మద్యాన్ని తయారు చేయడానికి ఒకేవిధమైన గింజలను ఉపయోగిస్తారు. ఈ మద్యం అత్యంత ఖరీదైనదిగా, నాణ్యమైనదిగా పరిగణించబడటానికి ఇదే కారణం. సింగిల్ మాల్ట్ విస్కీని ఎక్కువగా స్కాట్లాండ్‌లో ఉత్పత్తి చేస్తారు.

డబుల్ మాల్ట్ మద్యం ఎలా తయారు చేస్తారంటే..

డబుల్ మాల్ట్ మద్యాన్ని తయారు చేయడానికి రెండు రకాల గింజలను ఉపయోగిస్తారు. దీనిని రెండు డిస్టిలరీల సహాయంతో తయారు చేస్తారు. ఈ మద్యం సింగిల్ మాల్ట్ కంటే తక్కువ ధరకు విక్రయించబడటానికి కారణం ఇదే. రుచి కూడా భిన్నంగా ఉంటుంది. సింగిల్ మాల్ట్ మద్యం రుచి కంటే ఇది కొంచెం ఘాటుగా ఉంటుంది. ఇది తాగిన తర్వాత, చాలా కాలం పాటు ఇతర పదార్ధాల రుచిని అనుభవించలేరు.

ఇవి కూడా చదవండి

ఏ రాష్ట్ర ప్రజలు ఎక్కువగా మద్యం తాగుతారు

క్రిసిల్ సర్వే కంపెనీ నివేదిక ప్రకారం, 2020 సంవత్సరంలో దేశంలో విక్రయించబడిన మొత్తం మద్యంలో 45 శాతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళలో వినియోగించారు. అత్యధికంగా మద్యం సేవించే రాష్ట్రాల్లో ఛత్తీస్‌గఢ్‌ పేరు మొదటి స్థానంలో ఉంది. దాదాపు 3 కోట్ల జనాభా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో దాదాపు 35.6 శాతం మంది మద్యం సేవిస్తున్నారు. కాగా ఈ జాబితాలో త్రిపుర పేరు రెండో స్థానంలో ఉంది. త్రిపురలో దాదాపు 34.7 శాతం మంది మద్యం సేవిస్తున్నారు. వీరిలో దాదాపు 13.7 శాతం మంది క్రమం తప్పకుండా ఆల్కహాల్ తీసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉంది. ఇక్కడ దాదాపు 34.5 శాతం మంది నిత్యం మద్యం సేవిస్తుంటారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.