Centipedes In Dreams: కలలో ఈ జీవి కనిపించటం అదృష్టానికి సంకేతం.. అన్నీ శుభాలే..!!

అందులో కొన్ని కలలు మంచి తీపి, జ్ఞాపకాలుగా ఉంటాయి. ఎక్కడికో తీసుకెళ్తుంటాయి. కొన్నిసార్లు ఎవరితోనో గొడవ పడుతున్నట్టుగా, మరికొన్ని సార్లు ఏనుగు, కుక్క వంటి ఇతర జంతువులను కూడా కలలో చూస్తుంటాం. కానీ మీరు ఎప్పుడైనా మీ కలలో శతపాదం అంటే జెర్నీని చూశారా..? కలలో జెర్నీ కనిపిస్తే అది మీకు కొన్ని సంకేతాలను అందజేస్తుందని జ్యోతిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Centipedes In Dreams: కలలో ఈ జీవి కనిపించటం అదృష్టానికి సంకేతం.. అన్నీ శుభాలే..!!
Dreams About Centipede

Updated on: Jul 20, 2024 | 6:16 PM

నిద్రలో కలలు కనడం సర్వసాధారణం. చాలా సార్లు మనకు వచ్చిన కలను మేలకువ రాగానే మర్చిపోతుంటాం. కానీ, కొన్ని కలలు వెంటాడుతున్నట్టుగా గుర్తుండిపోతాయి. కానీ, కలల శాస్త్రం ప్రకారం, ప్రతి కలకి భిన్నమైన అర్థాలు ఉంటాయి. కలలు మీ భవిష్యత్తులో జరిగే శుభ, అశుభకరమైన సంఘటనలను సూచిస్తాయి. నిజానికి ఎన్నో రకాల కలలు వస్తుంటాయి. అందులో కొన్ని కలలు మంచి తీపి, జ్ఞాపకాలుగా ఉంటాయి. ఎక్కడికో తీసుకెళ్తుంటాయి. కొన్నిసార్లు ఎవరితోనో గొడవ పడుతున్నట్టుగా, మరికొన్ని సార్లు ఏనుగు, కుక్క వంటి ఇతర జంతువులను కూడా కలలో చూస్తుంటాం. కానీ మీరు ఎప్పుడైనా మీ కలలో శతపాదం అంటే జెర్నీని చూశారా..? కలలో జెర్నీ కనిపిస్తే అది మీకు కొన్ని సంకేతాలను అందజేస్తుందని జ్యోతిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1. ముందు జాగ్రత్త హెచ్చరిక:

మీ కలలో శతపాదం వస్తే అది మీ మనస్సులో కూర్చున్న భయానికి చిహ్నం కావచ్చు. మీరు జీవితంలో అనేక సమస్యలతో పోరాడుతున్నారని ఇది చూపిస్తుంది. ఇది కాకుండా, ఈ కల మీ జీవితంలో రాబోయే ప్రమాదాల గురించి కూడా హెచ్చరిస్తుంది. అంతేకాదు.. మీ కలలో శతపాదాన్ని చూడటం మీకు అనుకూల సంకేతం అంటున్నారు. ఇది మీ జీవితంలో సానుకూల సంకేతాలను ఇస్తుందని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

2. ఆధ్యాత్మిక మార్పుకు సంకేతం:

కలలో శతపాదం చూడటం కూడా ఆధ్యాత్మిక మార్పుకు సంకేతంగా చెబుతున్నారు. దాని లెక్కలేనన్ని కాళ్లు జీవిత ప్రయాణానికి అనుకూలమైన సంకేతాలను ఇస్తాయి. కలలో మీకు కనిపించే జెర్రీ మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేలా ప్రోత్సహిస్తుంది.

3. సహనానికి ప్రతీక:

కలలో శతపాదం కనిపించడం కూడా సహనానికి చిహ్నం అంటున్నారు నిపుణులు. మీరు కలలో జెర్రీని చూసినట్టయితే.. మీరు అడ్డంకులను ఎలా అధిగమించగలరో సూచిస్తుంది. ఇతరులకు సేవ చేయడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది.

4. చనిపోయిన శతపాదం చూడటం:

మీ కలలో చనిపోయిన జెర్రి కనిపిస్తే, అది మీ జీవితంలో సానుకూలతకు సంకేతం కావచ్చు. అంటే ఇది మీ కెరీర్‌లో పురోగతిని కూడా చూపుతుంది. ఈ కల మీ ఉద్యోగంలో మార్పు లేదా వ్యాపారంలో లాభాన్ని కూడా సూచిస్తుంది. మీరు పెళ్లిని ప్లాన్ చేసుకుంటే, మీ నిరీక్షణ కూడా ఫలిస్తుంది.

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..