AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్కడ ఆరుబయట ఆ బట్టలు ఆరేయడం చట్టవిరుద్దం.. కాదని చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?..

Weird Under Garments Rules: ఒక్కో దేశంలో ఒక్కో చట్టం ఉంటుంది. కొన్ని చట్టాలు మరీ భయంకరంగా ఉంటే.. కొన్ని చట్టాలు వింతగా.. విడ్డూరంగా ఉంటాయి. ఆ చట్టాల గురంచి తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. 

అక్కడ ఆరుబయట ఆ బట్టలు ఆరేయడం చట్టవిరుద్దం.. కాదని చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?..
Weird Rules
Sanjay Kasula
|

Updated on: Sep 15, 2021 | 1:46 PM

Share

ఒక్కో దేశంలో ఒక్కో చట్టం ఉంటుంది. కొన్ని చట్టాలు మరీ భయంకరంగా ఉంటే.. కొన్ని చట్టాలు వింతగా.. విడ్డూరంగా ఉంటాయి. ఆ చట్టాల గురంచి తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు.  ఒక దేశం నుంచి మరో దేశం వెళ్లిన ప్రతిసారి చట్టాలు, న్యాయవ్యవస్థ మారిపోతుంటాయి. అంతే కొన్ని దేశాల్లో నగరానికి.. నగరానికి మధ్య కూడా ఈ రూల్స్ మారిపోతుంటాయి. ప్రపంచంలో భారత దేశం చాలా భిన్నమైన దేశం. ఇలాంటి అనేక దేశాలలో లోదుస్తులు ధరించడం గురించి వింత చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాల గురించి తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. అండర్‌గార్‌మెంట్‌లకు సంబంధించి కొన్ని చట్టాలు ఏమిటో తెలుసుకోండి. ఎందుకంటే మీరు అక్కడికి వెళితే ఈ నియమాలను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది.  ఆ దేశంలోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే అక్కడి రూల్స్ తెలుసుకోవాలి.. అలా కూదూ కూడదూ అంటే.. చట్టాలు లెక్కింప చేస్తారు. కొన్ని దేశాల అండర్‌గార్‌మెంట్‌లకు సంబంధించిన చట్టాల గురించి మనం ఈ రోజు తెలుసుకుందాం. ఆ దేశంలోని చట్టాల గురించి తెలిసి నవ్వు ఆపుకోలేరు. అంతే చాలా ఆసక్తికరంగా కూడా ఉంటుంది. అలాగే, ఈ చట్టాలను ఎందుకు చేశారో కూడా తెలుసుకోవాలి.

అమెరికాలోని మిన్నెసోటాలో ఓ స్థలం ఉంది. ఈ ప్రదేశంలో అలాంటి విచిత్ర నియమం ఉంది, మీరు కూడా ఆ చట్టం గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆ దేశంలో మగ, ఆడ అండర్‌గార్మెంట్‌లను వైర్లను ఆరబెట్టడం అక్కడ కుదరదు. ఇక్కడ పురుషులు, మహిళల దుస్తులను వాషింగ్ లైన్‌లో కలిపి ఉతకడం కూడా చట్టవిరుద్ధంగా పరిగణించబడుతుంది.

థాయ్‌లాండ్‌లో ఒక నియమం ఉంది. ఇది లోదుస్తులు తప్పనిసరిగా ధరించాలనే రూల్ ఉంది. అంటే, థాయ్‌లాండ్‌లో లోదుస్తులు ధరించకుండా ఎవరూ ఇంటి బయటకు వెళ్లడం కుదరదు. మీరు థాయ్‌లాండ్‌కు వెళ్లినప్పుడల్లా ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. అక్కడి చట్టాన్ని నిర్లక్ష్యం చేస్తే కోర్టు మెట్లు ఎక్కాల్సి ఉంటుంది.

స్పానిష్ నగరమైన సెవిల్లెలో కూడా ఇలాంటి మరో చట్టం కూడా ఉంది. లోదుస్తుల గురించి మాట్లాడు కోసం కొన్నిసార్లు చాలా సిగ్గు ఉంటుంది. మీరు బయటకు వెళ్లినట్లయితే మీ అండర్‌గార్‌మెంట్‌లు కనిపించకూడదని మీరు వినే ఉంటారు. కానీ ఇక్కడ వాష్ చేసినవాటిన బయట  ఆరబెట్టడం కుదరదు.  

 జపాన్‌లో కొన్ని ప్రదేశాలలో కూడా అచ్చు ఇలాంటి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఎయిర్ కండిషన్డ్ భవనాలలో మహిళలు బ్రాలు ధరించడం తప్పనిసరి అనే చట్టం కూడా ఉంది. అంటే, వారు తప్పని సరిగా బ్రా ధరించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి: నెల్లూరులో దారుణం.. యువతిని వ్యభిచారం చేయాలంటూ దారుణంగా హింసించిన వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు

Viral Video:నీటి గుంటలో ఎంచక్కా ఈత కొట్టేస్తున్న బుజ్జి కుక్క పిల్లలు.. మీ కళ్లను మీరే నమ్మలేరు..