తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం లేదా ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకోవడం ప్రతి ఒక్కరి కల. అయితే జీవితంలో తమని ప్రేమని గెలిపించుకోవడం అంత సులభం కాదు. దీని కోసం చాలా మంది అనేక పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రేమని గెలిపించుకోవడానికి ఎదురైన పరీక్షలను కొందరు ఎంత కోరుకున్నా ఎన్నటికీ పూర్తి చేయలేరు. ఫిజీ కుర్రాళ్లు కూడా ప్రేమ పరీక్షను గెలిచి తాను వలచిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిందే. అయితే ఈ పరీక్ష చాలా ప్రమాదకరమైనది. ఈ పరీక్ష సమయంలో కొందరు ప్రాణాలు కూడా కోల్పోవచ్చు.
ఫిజీలో ప్రేమ పరీక్షను టబువా అంటారు. ఇక్కడ ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయం. ఇక్కడ యువకులు సముద్రంలోకి వెళ్లి తిమింగలం దంతాన్ని బయటకు తీసుకురావాలి. శతాబ్దాలుగా ఇక్కడ ఈ ఆచారం కొనసాగుతోంది. ఫిజీలోని మొత్తం 300 ద్వీప సమూహాల్లో తిమింగలం నుంచి దంతాన్ని సేకరించే అభ్యాసాన్ని కొనసాగిస్తున్నారు.
తిమింగలం సముద్రపు లోతైన భాగంలో నివసించే చేపలలో ఒకటి. ఈ తిమింగలం దగ్గరికి వెళ్లి దాని పళ్ళు విరగొట్టి.. దాని దంతం తీసుకుని రావాల్సి ఉంటుంది. ఈ ధైర్యం చేయాల్సింది ప్రేమ కోసం.
అయితే సముద్రంలోకి వెళ్లి తిమింగలం దంతాన్ని తిరిగి తెచ్చే ధైర్యం అందరికీ ఉండదు. దీంతో ఈ పని ఇక్కడ వృత్తిపరమైన వ్యక్తులు చేస్తారు. పెళ్లి చేసుకోవాలని అనుకునే యువకులు ఈ తిమింగలం దంతం తెచ్చే వ్యక్తులు అడిగినంత సమర్పించుకోవాల్సిందే.
జలచరాల్లో అతి పెద్ద చేప తిమింగలం. ఈ తిమింగలం చేపకు 26 దంతాలు ఉంటాయి. ఒక్కో పంటి బరువు ఒక కిలోగ్రాము ఉంటుంది. ఈ దంతం వివాహం వేడుకల్లో మాత్రమే కాదు పుట్టిన సమయంలో, మరణించినా బహుమతిగా ఇస్తారు.
ఈ తిమింగలం దంతాలు చాలా విలువైనవిగా పరిగణించబడుతున్నాయి. లక్షల రూపాయలు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ స్పెర్మ్ వేల్ చాలా అరుదైన చేపగా మారింది. ఈ చేపను రక్షించడానికి అనేక ఆంక్షలు విధించారు. సముద్ర క్షీరద రక్షణ చట్టం (MMPA) అమల్లో ఉంది. ఈ తిమింగలం వేటాడితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అయితే స్మగ్లర్లు రహస్యంగా వేటాడటం వల్ల ఈ స్పెర్మ్ వేల్స్ సంఖ్య వేగంగా తగ్గుతోంది.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..