Mutton: మటన్‌ ప్రియులకు హెచ్చరిక..! జర చూసి కొనండి.. లేదంటే ప్రాణాలకే ప్రమాదం..

Mutton Buyers: ఆదివారం వచ్చిందంటే చాలు మటన్‌ షాపుల దగ్గర మాంసం ప్రియులు క్యూ కడుతారు. ఎంత సమయమైనా సరే వేచి చూసి మటన్ తీసుకొని ఇంటికి వస్తారు.

Mutton: మటన్‌ ప్రియులకు హెచ్చరిక..! జర చూసి కొనండి.. లేదంటే ప్రాణాలకే ప్రమాదం..
Mutton

Edited By: Anil kumar poka

Updated on: Oct 27, 2021 | 3:51 PM

Mutton Buyers: ఆదివారం వచ్చిందంటే చాలు మటన్‌ షాపుల దగ్గర మాంసం ప్రియులు క్యూ కడుతారు. ఎంత సమయమైనా సరే వేచి చూసి మటన్ తీసుకొని ఇంటికి వస్తారు. ఎందుకంటే మాంసం అంటే వారికి అంత ప్రీతి. ఇక కొంతమందికైతే ముక్క లేనిదే అసలు ముద్ద దిగదు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ అసలు కథ ఇప్పుడే మొదలైంది. మటన్‌ తినొద్దని ఎవ్వరూ చెప్పడం లేదు. కానీ పరిశుభ్రమైన మటన్‌ తినాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఎందుకంటే మేకలకు, గొర్రెలకు వింత రోగాలు సంభవిస్తున్నాయి. వీటి గురించి తెలిసి కొందరు, తెలియక కొందరు వ్యాపారులు ఇష్టారీతిన తమకు నచ్చిన రీతిలో మాంసం విక్రయాలు జరుపుతున్నారు. తక్కువకు వస్తుంది కదా.. అని తీసుకొని తిన్నారనుకో మరునాడే ఆస్పత్రి బెడ్ పై ఉండాల్సి వస్తుంది. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో గొర్రెలు, మేకల్లో ఆంత్రాక్స్‌ వ్యాధి విజృంభిస్తోంది. దాని సంగతేందో తెలుసుకుందాం.

మటన్‌ తీసుకునే ముందు ఒక్కసారి ఆ జీవాలను పశువైద్యులు తనిఖీ చేశారో? లేదో తెలుసుకోవాలి. మటన్ కొట్టు వారు చెప్పేది మీరు అబద్దమని భావిస్తే ఒక్కసారి జీవాలను కట్‌ చేసిన స్థలాన్ని పరిశీలించాలి. గొర్రెను కానీ మేకను కానీ కోసినప్పుడు వెలువడే రక్తం గడ్డకట్టకుండా ద్రవరూపంలో ఉంటే ఆ జీవానికి ఆంత్రాక్స్‌ సోకినట్లు గుర్తించాలి. ఇటువంటి జీవాల మాంసాన్ని విక్రయించకూడదని ప్రభుత్వం ఇప్పటికే మాంసం వ్యాపారులకు హెచ్చరించింది.

ముఖ్యంగా మారుమూల గ్రామాల ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అక్కడి కొంతమంది గొర్ల, మేకల కాపర్లకు ఈ వ్యాధిపై అవగాహన ఉండదు. ఏదో జబ్బు చేసి చనిపోయి ఉంటుందని భావిస్తారు. అంతేకాదు జీవి చనిపోతే దానిని కోసి మాంసం విక్రయించడం లేదంటే వారే వండుకొని తినడం చేస్తారు. ఇలా చేయడం చాలా ప్రమాదకరం. ఆంత్రాక్స్‌ అనేది చాలా డేంజర్‌ వ్యాధి. ఒక్కసారి సోకిందంటే దాని ఆనవాళ్లు 60 ఏళ్ల వరకు ఉంటాయి.

Pension: మీరు పెన్షన్ తీసుకుంటున్నారా? లేదా మీ ఇంట్లో పెన్షనర్స్ ఉన్నారా? వెంటనే ఇలా చేయకపోతే పెన్షన్ ఆగిపోవచ్చు!

Moral Values: మనిషి జీవితంపై సాంగత్యం ఏ విధంగా ప్రభావం చూపిస్తాయి.. ప్రతికూల పరిస్థితి ఏర్పడితే ఏమి చేయాలంటే..

Weather: నైరుతి ఉపసంహరణ.. ఈశాన్య రుతుపవనాల ఎంట్రీ.. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం!