
ప్రతి తల్లీదండ్రులు తమ పిల్లల చదువు పట్ల ఆందోళన పడుతుంటారు. పిల్లలు చదువుపై ఆసక్తి చూపడం లేదని, ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ ఫెయిల్ అవుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. అన్ని సౌకర్యాలు, వనరులను అందించినప్పటికీ పిల్లలు చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నారని, పరీక్షలు, పోటీలలో పదే పదే విఫలమవుతున్నారని మీరు భావిస్తే, మీరు ఖచ్చితంగా వారి స్టడీ రూమ్‌లోని వాస్తు దోషాలను తొలగించాల్సి ఉంటుంది. వాస్తు ప్రకారం స్టడీ రూమ్ లేకపోతే ఏకాగ్రత ,అధ్యయనం చేయలేరు. పిల్లల మనస్సు చదువులో నిమగ్నమై ఉండదు. దీనివల్ల వెనుకబడిపోతారు. అందుకే సరస్వతి దేవి, బుధ గ్రహానికి సంబంధించిన ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. అప్పుడే మీ పిల్లలు చదువులో రాణిస్తారని వాస్తు,జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం…
మనం పిల్లలకు చదువుకోవడానికి సరైన దిశానిర్ధేశం నేర్పించడం అంటే అది కేవలం సబ్జెక్ట్ గురించి మాత్రమే కాదు. చదువుకునేటప్పుడు వారి స్టడీ టేబుల్, వారి ముఖం ఎటువైపుగా కూర్చుంటున్నారు.. అనేవి కూడా ముఖ్యమైనవి అంటున్నారు వాస్తు నిపుణులు. ఎందుకంటే వాస్తు ప్రకారం, తప్పు దిశలో చదువుకోవడం వల్ల పిల్లలు నిరాశ, నిరుత్సాహానికి గురవుతారు. అయితే సరైన దిశలో కూర్చోవడం వల్ల వారు పూర్తి ఏకాగ్రతతో చదువుకోవడానికి సహాయపడుతుంది.
వాస్తు ప్రకారం, పిల్లలు చదువుకునే గదిని ఈశాన్య దిశలో నిర్మించాలి. ఇది సాధ్యం కాకపోతే పిల్లల టేబుల్‌ను ఈ దిశలో ఉంచండి. వాస్తు ప్రకారం, పిల్లలు ఎల్లప్పుడూ ఉత్తరం లేదా తూర్పు వైపు తిరిగి చదువుకోవాలి. రెండు దిశలకు ఎదురుగా చదువుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వారి లక్ష్యాలపై పూర్తిగా దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది.
మీ బిడ్డకు గుర్తుంచుకోవడంలో ఇబ్బందిగా ఉందని, వారు చదివిన వాటిని తరచుగా మరచిపోతున్నారని మీరు భావిస్తే..వారి జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి గణేశుడిని, సరస్వతి దేవిని పూజించమని వారిని ప్రోత్సహించండి. గణేశుడిని పూజించడం వల్ల వారి చదువులో అడ్డంకులు తొలగిపోతాయి. సరస్వతి దేవిని పూజించడం వల్ల వారి తెలివితేటలు పెరుగుతాయి.
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం క్లిక్ చేయండి..