AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashi Phalalu: పెళ్లి ప్రయత్నాల్లో వారికి శుభవార్తలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today (November 19, 2025): మేష రాశి వారికి ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. నిరుద్యోగులకు ఒకటి రెండు శుభవార్తలు అందే అవకాశం ఉంది. వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. తోబుట్టువులకు ఆర్థికంగా బాగా సహాయం చేస్తారు. మిథున రాశి వారి కుటుంబంలో శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Rashi Phalalu: పెళ్లి ప్రయత్నాల్లో వారికి శుభవార్తలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Rashi Phalalu 19 November 2025
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 19, 2025 | 5:31 AM

Share

దిన ఫలాలు (నవంబర్ 19, 2025): మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఒకటి రెండు శుభవార్తలు అందే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలకు బంధువుల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది. కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. ఆదాయం పెరుగుతుంది. మిత్రుల మీద బాగా ఖర్చు చేయడం జరుగుతుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): వృత్తి, ఉద్యోగాలు నిలకడగా ముందుకు సాగుతాయి. వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. ప్రభుత్వోద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. తోబుట్టువులకు ఆర్థికంగా బాగా సహాయం చేస్తారు. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో సానుకూల సమాచారం అందుతుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు పెరుగుతాయి. వ్యాపారాల్లో ఆశించినంతగా లాభాలు అందుకుంటారు. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు. కుటుంబంలో శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. కొందరు బంధుమిత్రులకు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్ని, పనుల్ని సంతృప్తికరంగా, సకాలంలో పూర్తి చేస్తారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఉద్యోగంలో మీ సలహాలు, సూచనలు అధికారులకు లబ్ధి చేకూరుస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు, చేర్పులు చేపట్టి లాభాలు గడిస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండ కపోవచ్చు. అదనపు ఆదాయ మార్గాలకు సంబంధించి శుభవార్త వినే అవకాశం ఉంది. తోబుట్టువులతో సఖ్యత ఏర్పడుతుంది. కుటుంబ పెద్దల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఒకరిద్దరు బంధువుల కారణంగా ఆర్థికంగా నష్టపోయే సూచనలున్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): రోజంగా సానుకూలంగా సాగిపోతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి ఉన్నప్పటికీ బాధ్యతలను, లక్ష్యా లను పూర్తి చేస్తారు. వృత్తి జీవితంలో కాస్తంత డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు వృద్ధి చెందుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. కుటుంబ సభ్యుల మీద ఖర్చు పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. విలాసాల మీద ఖర్చుల్ని తగ్గించుకోవాలి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికారులు బాగా ప్రోత్సహిస్తారు. వ్యాపారాల్లో లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆర్థిక విషయాల్లో రోజంతా ఆశించిన విధంగా సాగిపోతుంది. ఇష్టమైన బంధువుల్ని, సన్నిహితుల్ని కలుసుకుంటారు. పిల్లల నుంచి సంతోషకరమైన సమాచారం అందుతుంది. పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి బంధువర్గం నుంచి ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ధనాదాయం బాగానే వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా కొనసాగుతుంది. బంధుమిత్రులకు మీ సలహాలు, సూచనలు బాగా ఉపయోగపడతాయి. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికా రులు మీ మీద ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్లను మించి పోతారు. ఒకరిద్దరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేయాల్సి వస్తుంది. పిల్లలు శుభవార్త తీసుకువస్తారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఉద్యోగంలో పదోన్నతి కలగడానికి, జీతభత్యాలు పెరగడానికి అవకాశం ఉంది. సహోద్యోగులనుంచి ఆశించిన సహకారం అందుతుంది. వృత్తి జీవితంలో గుర్తింపు లభించి డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాల్లో రాబడి కొద్దిగా వృద్ది చెందుతుంది. ఆదాయానికి లోటుండదు. కుటుంబ ఖర్చులు బాగా పెరుగుతాయి. కొద్దిపాటి అనారోగ్యానికి అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి పని భారం పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో రోజంతా అనుకూలంగా సాగిపో తుంది. అత్యవసర వ్యవహారాలను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. పిల్లల విషయంలో శుభ వార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాల్లో విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. అన్ని రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది. కొత్త ప్రయత్నాలు, కొత్త నిర్ణయాలు కలిసివస్తాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4), శ్రవణం, ధనిష్ట 1,2): ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. కాస్తంత ఓర్పు, సహనాలతో వ్యవహరిస్తే అన్ని సమస్యలూ సర్దుకుంటాయి. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్య మైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాల్లో బంధువులనుంచి ఆశించిన శుభ వార్తలు అందుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): వృత్తి, ఉద్యోగాలలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఒకటి రెండు సమస్యలను తేలికగా పరిష్క రించుకుంటారు. కొద్దిగా బరువు బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. ప్రస్తుతానికి ఎవరితోనూ ఆర్థిక వ్యవహారాలు పెట్టుకోకపోవడం మంచిది. వ్యాపారాలు ఆశాజనకంగా పురోగమిస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా ఒత్తిడి పెరుగుతుంది. అలవికాని లక్ష్యాల వల్ల ఇబ్బంది పడతారు. అధికారులతో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా పురోగమిస్తాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. దూరపు బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించవచ్చు. మిత్రులకు అండగా నిలబడతారు.