AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Millionaire by Selling Milk: లీటర్ పాల ధర రూ. 2628.. ఒక్క దెబ్బతో మిలియనీర్ అయిపోయాడు.. ఎక్కడో తెలుసా?

Millionaire by Selling Milk: గత రెండు నెలల్లో దేశ వ్యాప్తంగా పెట్రోల్-డీజిల్, ఎల్‌పీజీ ధరలు విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే.

Millionaire by Selling Milk: లీటర్ పాల ధర రూ. 2628.. ఒక్క దెబ్బతో మిలియనీర్ అయిపోయాడు.. ఎక్కడో తెలుసా?
Milk Of Horse
Shiva Prajapati
|

Updated on: Mar 15, 2021 | 12:12 PM

Share

Millionaire by Selling Milk: గత రెండు నెలల్లో దేశ వ్యాప్తంగా పెట్రోల్-డీజిల్, ఎల్‌పీజీ ధరలు విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే. పాల ధరలనూ పెంచుతున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఇటీవల మధ్యప్రదేశ్‌లోని 15 గ్రామాలకు చెందిన పాల ఉత్పత్తిదారులు సమావేశమై పాల ధరను లీటరుకు రూ. 55 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం పాలను లీటరుకు రూ .43 చొప్పున విక్రయిస్తున్నారు. ఇదంతా ఇలా ఉంటే.. మీ ప్రాంతంలో పాల ధర ఎంత ఉంటుంది? మహా అయితే గరిష్టంగా లీటర్‌కు రూ. 100 ఉంటుంది అనుకుందాం. కానీ ఇక్కడ లీటర్ పాల ఎంతో తెలిస్తే మాత్రం తప్పకుండా షాక్ అవుతారు. అక్కడ ఏకంగా లీటర్ పాల ధర రూ. 2628 గా ఉంది. అయితే, ఆవు, గేదె పాలు కాదులేండి. ఓ వ్యక్తి గుర్రం పాలను లీటర్ రూ. 2628కి అమ్ముతున్నాడు. అంతేకాదు.. అతను ఆ పాలను అమ్ముతూ బిలియనీర్ అవతారమెత్తాడు.

గుర్రం పాలకు విపరీతమైన డిమాండ్.. యుకేలోని సోమెర్‌సెట్‌లో నివసిస్తున్న 62 ఏళ్ల ఫ్రాంక్ షెల్లార్డ్ మరే పాల వ్యాపారం చేస్తున్నాడు. అయితే, అతను ఆవు పాలో, గేదె పాలో విక్రయించడం లేదు. గుర్రం పాలను విక్రయిస్తున్నాడు. ఫ్రాంక్ మరేకి 14 గుర్రాలు ఉన్నాయి. తొలుత కొందరికి గుర్రం పాలు సాధారణంగా విక్రయించే వాడు. అయితే రాను రాను ఆ పాలకు విపరీతమైన డిమాండ్ వస్తుండటంతో.. గుర్రం పాల వ్యాపారాన్ని తన వృత్తిగా ఎంచుకున్నాడు. ఇంకేముందు గుర్రం పాల అమ్మకాలు సాగించి ఏకంగా మిలియనీర్‌గా మారిపోయాడు. ఇతని వద్ద గుర్రం పాలు కొనుగోలు చేసే వారిలో హాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా ఉన్నారంటేనే అతని పాల వ్యాపారం ఏ రేంజ్‌లో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు.

ఒక లీటరు పాలు ధర రూ. 2628.. ఫ్రాంక్ మరే.. గుర్రం పాలను బాటిళ్లలో ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నాడు. లీటర్ పాలను రూ. 2628 గా నిర్ణయించి అమ్మకాలు సాగిస్తున్నాడు. అయితే, 250 ఎంఎల్(పావు లీటర్) ధర రూ. 650 కన్నా ఎక్కువగానే ఉంది. ఫ్రాంక్ వద్ద 150 మందికి పైగా కస్టమర్లు రోజూ గుర్రం పాలు కొనుగోలు చేస్తారని అంతర్జాతీయ వార్తా సంస్థ పేర్కొంది. ఈ 150 మందిలో బ్రిటన్‌కు చెందిన ప్రముఖులు కూడా ఉన్నారు.

గుర్రం పాలకు ఎందుకంత డిమాండ్..? అవు పాల కంటే గుర్రం పాలు బలవర్ధకమైనవని నిపుణులు చెబుతున్నారు. గుర్రం పాలలో పోషకాలు చాలా ఉంటాయట. కాల్షియం, భాస్వరం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, క్లోరైడ్, సల్ఫర్ వంటి ప్రధాన ఖనిజ పదార్థాలు ఈ పాలలో ఉంటాయని చెబుతున్నారు. అంతేకాదు.. ఈ పాలలో కొవ్వు పదార్థాలు కూడా చాలా తక్కువగా ఉంటాయ. సి విటమిన్ పుష్కలంగా ఉంటుందట మానవ శరీరానికి కావాల్సిన పోషకాలను సరైన పరిమాణంలో అందిస్తుందని చెబుతున్నారు. అందుకే ఆవు పాల కన్న గుర్రం పాలు చాలా బెటర్ అని నమ్మి ఆ పాలను కొనుగులు చేస్తున్నారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. గుర్రం పాలకు.. మనిషి పాలకు పెద్దగా తేడా ఉండదు. ఇదిలాఉంటే.. ఫ్రాంక్.. తన ఇంటిల్లిపాదికి గుర్రం పాలనే తాగిపిస్తాడట.

Also read: Meelo Evaru Koteeswarudu : కరోనా టైమ్, ఎవరు మీలో కోటీశ్వర్లు షోలో ప్రేక్షకులుంటారా..? సమాధానం ఆయన మాటల్లోనే

Telangana Budget Live: ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు.. తెలంగాణ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది: గవర్నర్‌ తమిళిసై ‌