పాకిస్తాన్ లో ఇదేం పెళ్లి ? సింహం పిల్లకు మత్తు మందిచ్చి, వేడుకలో ‘క్రూరత్వం’ , నెటిజన్లు ఫైర్

పాకిస్తాన్ లో విచిత్రమైన పెళ్లి జరిగింది. ఇలాంటి శుభ కార్యాలప్పుడు సాధారణంగా ఎక్కడైనా  వధూవరులు సాంప్రదాయక పెళ్లి బట్టల్లో ఉంటూనే . అమ్మాయి తరఫు బాలికనో , బందువునో దగ్గర కూర్చోబెట్టుకుంటారు.

పాకిస్తాన్ లో ఇదేం పెళ్లి ? సింహం పిల్లకు మత్తు మందిచ్చి, వేడుకలో 'క్రూరత్వం' , నెటిజన్లు ఫైర్
Pakistan Couple Faces Backlash For Using Sedated Lion Cubin Wedding Shoot
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Mar 15, 2021 | 1:07 PM

పాకిస్తాన్ లో విచిత్రమైన పెళ్లి జరిగింది. ఇలాంటి శుభ కార్యాలప్పుడు సాధారణంగా ఎక్కడైనా  వధూవరులు సాంప్రదాయక పెళ్లి బట్టల్లో ఉంటూనే . అమ్మాయి తరఫు బాలికనో , బందువునో దగ్గర కూర్చోబెట్టుకుంటారు. ఇలా చేయడం వల్ల తమకు శుభం జరుగుతుందని నమ్ముతారు. కానీ పాకిస్థాన్ లో జరిగిన ఓ పెళ్లి మాత్రం భలే విచిత్రంగా ఉంది. వధూవరులు తమ మధ్య ఓ సింహం పిల్లను ఉంచుకున్నారు. అప్పటికే  మత్తు మందు ఇచ్చి ఉండడంతో అది మత్తులో జోగుతూ ఉండిపోయింది. అది తమ మధ్య ఉండగా పెళ్లికూతురు,పెళ్లి కొడుకు చేతిలో చేయి వేసుకుని ఫొటోలకు,  వీడియోలకు పోజులిచ్చారు.   లాహోర్ లో జరిగిన ఈ వెడ్డింగ్ తీరు సోషల్ మీడియాలో వీడియోగా వైరల్ అయింది. ‘షేర్డీ  రాణీ’ అనే హ్యాష్ ట్యాగ్ తో ఇది  సర్క్యులేట్ కావడంతో జంతు ప్రేమికులు మండిపడ్డారు. ఒక సింహం కూనకు మత్తు మందు ఇఛ్చి పెళ్ళిలో దాన్ని ప్రాపగాండా కోసం వాడుకోవడమేమిటని వారు దుయ్యబట్టారు.పాక్ లోని ‘సేవ్ ది వైల్డ్’ అనే జంతు కారుణ్య సంస్థ.. దీన్ని ట్విటర్ లో షేర్ చేస్తూ.. ఇది ఎనిమల్ క్రూయల్టీ (జంతు హింస) కిందకు వస్తుందని, వెంటనే ఆ సింహం పిల్లను ఆ పెళ్లి వేదిక నుంచి రక్షించాలని కోరింది.

ఇది సిగ్గు చేటని, పెళ్లి సందర్భంగా సింహం పిల్లకు మత్తు మందిచ్చి దాన్ని ప్రాపగాండా కోసం వాడుకోవడాన్ని క్షమించరాని చర్య అని పలువురు తిట్టి పోశారు. ఇక ఫోటోగ్రఫీ స్థూడియోలో ముందే ఆ జంతువును తెచ్చి ఉంచారని, దాని ముందు ఈ వధూవరులు కూర్చుని ఫోటోలు, వీడియోలు దిగారని ఎనిమల్ రెస్క్యూ అండ్  షెల్టర్ గ్రూపు తెలిపింది.  అప్పటికే  తమ ఫోటోలు దిగేందుకు ఈ జంట అక్కడ ఉన్నారని, ఇది కాకతాళీయమే తప్ప మరొకటి కాదని .ఈ గ్రూపు వ్యవస్థాపకుడు చెప్పారు. పాకిస్థాన్ లో ఎవరైనా క్రూర జంతువును పెంచుకోవాలనుకుంటే అందుకు లైసెన్స్ పొందుతారని, బహుశా ఈ సింహం పిల్ల తాలూకు వారు కూడా లైసెన్స్ పొంది ఉండవచ్చునని ఆయన అన్నారు.

మరిన్ని చదవండి ఇక్కడ :శోభనానికి అంగీకరించని భార్య ఆరాతీస్తే విస్తుపోయే నిజాలు.. షాక్ అయిన భర్త..! : Wedding viral Video ‘నా సావు నేను చస్తా’ డైరెక్టర్‌గా ప్రియదర్శి : Comedian Priyadarshi to turn Director Video.