AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tyre Pressure: చలికాలంలో కారు టైర్లలో గాలి ప్రెజర్‌ ఎంతుండాలో తెలుసా.. అంతకంటే తక్కువైనా.. ఎక్కువైనా ఇక అంతే..

వాతావరణం మారుతోంది. మారుతున్న సీజన్‌తో పాటు మన కారు టైర్ ప్రెజర్‌ను కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు ప్రయాణించే వాహనం టైర్ ప్రెజర్ ఎంత ఉండాలనేది మీరు ఇక్కడ తెలుసుకోండి..

Tyre Pressure: చలికాలంలో కారు టైర్లలో గాలి ప్రెజర్‌ ఎంతుండాలో తెలుసా.. అంతకంటే తక్కువైనా.. ఎక్కువైనా ఇక అంతే..
Tyre Pressure
Sanjay Kasula
|

Updated on: Oct 31, 2022 | 12:51 PM

Share

ఎంత చెట్టుకు అంతగాలి అన్న చందంగా.. మనం నిత్యం వినియోగంచే టూ వీలర్, ఫోర్ వీలర్.. వీటిలో ఏదైనా వేగంగా, సవైంగా పరులుగు పెట్టాలంటే వాటికి ఉండే టైర్లు చాలా ప్రధానం. ఎందుకంటే.. ఆ టైర్లలో ఉండే గాలి ఆ వాహనంను సక్రమంగా రన్ పని చేస్తుంది. ఆ టైర్లలో గాలి ఉండాలన్నది కూడా చాలా ముఖ్యం. టైర్లలో ఉండే పీడనం ఆ కారు వేగంగా ముందుకు వెళ్లేందకు సహాయపడుతుంది. రోడ్డుపై వాహనం సౌకర్యవంతంగా నడపాలంటే ఈ టైర్లు చాలా అవసరం. దీంతో రోడ్డుపై ఎలాంటి ఇబ్బంది లేకుండా వాహనం సాఫీగా సాగిపోతోంది. ఈ సమయంలో దేశంలో వాతావరణం మారుతోంది. అయితే ప్రతి సీజన్‌కు టైర్ల గాలి పీడనం భిన్నంగా ఉంటుంది. మీరు కూడా కారు నడుపుతుంటే, దాని గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి ఏ సీజన్‌లో టైర్‌లో గాలి ఒత్తిడి ఎంత ఉండాలో తెలుసుకుందాం.

టైర్ ప్రెజర్ సిస్టమ్..

ఈ మధ్యకాలంలో టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మన దేశంలో కూడా అదుబాటులోకి వచ్చింది. ఇప్పుడు చాలా మంది తమ కార్లలో ఈ మానిటరింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు. దీని ప్రయోజనం ఏంటంటే మీరు కారు టైర్ రియల్ టైమ్ ప్రెజర్‌ను దీనితో చెక్ చేయవచ్చు. దీంతో ఒక్కసారిగా టైర్లు చూసి ఇబ్బంది పడాల్సిన పనిలేదు. ఈ వ్యవస్థ మీకు టైర్ హెల్త్ గురించి ముందుగానే సమాచారాన్ని అందిస్తుంది.

ఒత్తిడి ఎలా ఉండాలి..?

ప్రతి కారుకు వేర్వేరు ప్రెజర్‌

ఒక్కో వాహనానికి ఒక్కో రకమైన ఒత్తిడి ఉంటుంది. ఇందులో, స్పోర్ట్స్ కార్లకు 40 PSI ఒత్తిడి సరైనదిగా పరిగణించబడుతుంది. అయితే చిన్న కార్లకు 35 PSI ప్రెజర్‌ సరైనదిగా పరిగణించబడుతుంది. ట్రక్కులు మొదలైన పెద్ద వాహనాలకు 40 PSI ప్రెజర్‌ చాలా తక్కువగా పరిగణించబడుతుంది. 30 నుంచి 40 psi ఒత్తిడి చాలా కార్లకు ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. టైర్ ప్రెజర్‌ ఎలా ఉండాలి.. ఇది పూర్తిగా వాహనం. టైర్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.

ఉష్ణోగ్రత గణనీయమైన ప్రభావం

టైర్ ఒత్తిడిపై ఉష్ణోగ్రత గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది.

వేసవి – వాహన తయారీదారు సూచించిన టైర్ ప్రెజర్‌ని ఉపయోగించమని సిఫార్సు చేస్తారు నిపుణులు.

శీతాకాలంలో- మీరు వేసవి టైర్ సిఫార్సు కంటే 0.2 బార్‌కు టైర్‌లను పెంచాలి. వెచ్చని గ్యారేజీలో ఉష్ణోగ్రత బయట కంటే 30 ˚C వరకు ఎక్కువగా ఉంటుంది. టైర్ ఒత్తిడిని లోపల పరిశీలిస్తే.. అది బయట ఉష్ణోగ్రతలకు చాలా తక్కువగా ఉంటుంది.

ఉదాహరణ: గ్యారేజీలో ఉష్ణోగ్రత +20 ˚C, అయితే బయటి ఉష్ణోగ్రత -10˚ C à ​​గ్యారేజీలో ఒత్తిడిని సర్దుబాటు చేస్తే, టైర్‌లకు జోడించిన ఒత్తిడి సిఫార్సు చేసిన దాని కంటే 30 kPa (0.3 బార్) ఎక్కువగా ఉండాలి. వెలుపల సరైన ఒత్తిడి స్థాయిని నిర్ధారించడానికి విలువ.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం