AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాములు ఇంట్లోకి రావడానికి కారణాలు ఇవే..! వెంటనే వీటిని సెట్ చేయండి.. లేకుంటే అంతే సంగతి..!

వర్షాకాలం మొదలయ్యాక చాలా మందికి ఒక కొత్త సమస్య ఎదురవుతుంది.. పాములు ఇంట్లోకి రావడం. వాతావరణం తడిగా మారితే.. వందల జీవులు మన చుట్టూ కదలడం మొదలుపెడతాయి. వాటిలో పాములు కూడా ఉంటాయి. మనం జాగ్రత్తలు తీసుకున్నా అవి ఇంటి చుట్టూ కనిపించడం ఆశ్చర్యంగా ఉంటుంది కదా..? అసలు అవి ఇంటి వైపు ఎందుకు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

పాములు ఇంట్లోకి రావడానికి కారణాలు ఇవే..! వెంటనే వీటిని సెట్ చేయండి.. లేకుంటే అంతే సంగతి..!
Snake Eating Rats
Prashanthi V
|

Updated on: Jul 31, 2025 | 7:57 PM

Share

తడిగా ఉండే వాతావరణంలో పాములకు సురక్షితమైన ప్రదేశాల అవసరం పెరుగుతుంది. పొలాలు, బురద నీరు నిలిచే చోట్లు పాములకు ఇబ్బంది కలిగిస్తాయి. అందుకే అవి ఇంటి వైపు, ముఖ్యంగా పొడిగా, వెచ్చగా ఉండే చోట్లకి కదులుతాయి. మీరు తలుపులు, కిటికీలు మూసినా.. చిన్న రంధ్రాల ద్వారా అవి లోపలికి రావడానికి దారులు వెతుకుతాయి.

ఆహార పదార్థాలు

మన ఇంట్లో బియ్యం, గోధుమలు, పప్పులు లాంటివి తెరిచి ఉంచితే.. అవి ఎలుకలను ఆకర్షిస్తాయి. ఎలుకల కోసం పాములు అక్కడికి వచ్చి ఇంట్లోకి వస్తాయి. అలాగే వంటింట్లో చెత్త డబ్బాను తెరిచి ఉంచడం.. అందులో తడి ఆహార ముక్కలు ఉండడం కూడా ఇదే సమస్యకు దారి తీస్తుంది. కాబట్టి ఆహార పదార్థాలను మూసివేయడం. చెత్తను రోజూ బయట పారేయడం చాలా అవసరం.

నీటి లీకేజీల ప్రభావం

పాములకు నీరు అవసరం. ఇంట్లో తడిగా ఉండే చోట్లు, ముఖ్యంగా వంటింట్లో లేదా బాత్రూంలో నీరు నిలిచే చోట్లు, వాటికి ఆహ్లాదకరమైన వాతావరణంగా ఉంటాయి. అవి దాక్కునే చోటు అవుతాయి. సింక్ కింద ఉండే నీటి చుక్కలు లేదా పైపు లీకేజీలు వాటిని ఆకర్షించవచ్చు. కాబట్టి ఇలాంటివి కనిపిస్తే వెంటనే బాగు చేయాలి.

మాంసాహార వాసనలు

చేపలు, మాంసం, గుడ్లు లాంటివి వండిన తర్వాత వాటి వాసనలు ఎలుకలు, కప్పలు లాంటి చిన్న జీవులను ఆకర్షిస్తాయి. అవే పాములకు ప్రధాన ఆహారం. కాబట్టి పాములు కూడా వెంటనే ఆ ప్రదేశానికి వస్తాయి. అందు వల్ల ఈ రకం ఆహార పదార్థాలను వెంటనే పారవేయడం లేదా బాగా మూసిపెట్టడం ముఖ్యం.

పాములకు ఇష్టమైన వాతావరణం

ఇంట్లో నిశ్శబ్దంగా ఉండే మూలలు, తడిగా ఉండే మూలల్లో దుమ్ము తీయకుండా ఉంచితే.. అవి పాములకు దాక్కునే ప్రదేశాలుగా మారతాయి. కాబట్టి ఇంటిలోని ప్రతి మూలనూ తరచూ శుభ్రం చేయడం తప్పనిసరి.

ఇంటి చిట్కాలు

  • ఉల్లిపాయ, వెల్లుల్లి వాసన పాములకు నచ్చదు. వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసి కిటికీ మూలల్లో ఉంచితే పనికొస్తుంది.
  • వేప ఆకులు, పటిక పొడి పాములను రాకుండా చేస్తాయి. వీటిని ఇంటి చుట్టూ చల్లాలి.
  • సర్పగంధ లేదా పొగాకు మొక్కలు పాములను దూరంగా ఉంచే బలమైన సహజ నివారణలు. వీటిని ఇంటి చుట్టూ పెడితే లాభం ఉంటుంది.

పాములు మనకు ప్రమాదకరమైన జీవులు. కానీ కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకుంటే.. వాటి నుంచి మన ఇంటిని సురక్షితంగా ఉంచుకోవచ్చు. ఇంటిని శుభ్రంగా ఉంచడం, తడిని అదుపు చేయడం, సహజ నివారణలు వాడడం ద్వారా వర్షాకాలంలో కూడా మీరు పాముల బెదిరింపుల నుంచి దూరంగా ఉండగలుగుతారు.