Viral Video: జీపునే ఆపేసిన మొసలి.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే షాకే.. వీడియో వైరల్..
సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో జంతువులకు సంబంధించినవి కూడా ఉంటాయి. తాజాగా ఓ మొసలికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఓ జీపు నీటిలో నుండి వెళ్తుండగా.. మొసలి ఒక్కసారిగా దాని కిందకు వచ్చింది. దాంతో జీపు ముందు కదలలేదు. ఆ తర్వాత..

మొసలి అంటే అందరికీ హడల్. నీళ్లలో ఎంత పెద్ద జంతువునైనా అది మట్టికరిపిస్తుంది. నీళ్లలో దాన్ని నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. ఇక మొసలి ఉందంటేనే అటు సైడ్ పోవడానికి అంతా భయపడతారు. మొసలి దాడి ఘటనలు తరుచూ వింటుంటాం. అయితే జీపు కింద మొసలి పడడంతో ఆ జీపు వెళ్లడానికి మొరాయిస్తుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆస్ట్రేలియాలోని కాకడు నేషనల్ పార్క్ లోని కాహిల్స్ క్రాసింగ్ అనే ప్రాంతంలో జరిగింది. అక్కడున్న నీటిలో భారీగా మొసళ్లు ఉంటాయి. అటువైపు వెళ్లడానికి చాలా మంది జంకుతారు.
ఈ నేపథ్యంలో ఒక జీపు ఆ నదిని దాటుతుండగా.. అకస్మాత్తుగా ఒక పెద్ద మొసలి దాన్ని కిందకు వచ్చింది. దాంతో జీపు ఆగిపోయింది. అతడికి ఏం జరిగిందో కాసేపు అర్థం కాలేదు. ఆ తర్వాత కిందనుంచి మొసలి పక్కకు వెళ్లిపోయింది. దాంతో జీపు ముందుకు కదిలింది. దీన్ని ఓ వ్యక్తి కెమెరాలో బంధించాడు. నా జీవితంలో ఒక వాహనం కింద మొసలి చిక్కుకోవడం చూడలేదు. ఇదే ఫస్ట్ టైమ్ అని చెప్పుకొచ్చాడు. నీటిలో మొసలి కనిపించకపోవడంతో అక్కడేం జరిగిందనేది జీప్ డ్రైవర్‌కు తెలియదని అతడు అన్నాడు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. జీప్ డ్రైవర్ అదృష్టం బాగుందని కొందరు కామెంట్లు చేస్తే.. జీప్ డ్రైవర్ కిందకు దిగకపోవడం మంచిది అయ్యింది.. లేకపోతే పెద్ద ప్రమాదంలో చిక్కుకుంటే అని మరికొందరు కామెంట్లు చేశారు.
4WD runs over a saltwater crocodile at Cahills Crossing in Kakadu National Park 😳 pic.twitter.com/ERSkA2GnZu
— Clown Down Under 🤡 (@clowndownunder) July 29, 2025
మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
