AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

December: డిసెంబర్‌లో పుట్టిన వారిలో ఉండే లక్షణాలు ఇవే..

ప్రస్తుతం ఏడాదిలో చివరి నెలలో ఉన్నాం. మరో కొత్త ఏడాదికి వెల్‌కమ్‌ చెప్పేందుకు సిద్ధమవుతున్నాం. మరి ఈ తరుణంలో ఈ నెలలో జన్మించే వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది.? వారి ఆలోచనలు ఎలా ఉంటాయి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

December: డిసెంబర్‌లో పుట్టిన వారిలో ఉండే లక్షణాలు ఇవే..
December
Narender Vaitla
|

Updated on: Dec 03, 2024 | 7:22 PM

Share

మరో కొత్త క్యాలెండర్‌ కొనుగోలు చేసే సమయం ఆసన్నమైంది. కాల గతిలో మరో ఏడాది గడిచిపోతోంది. ప్రస్తుతం డిసెంబర్‌ నెలలోకి ఎంట్రీ అయ్యాం. ఏడాదిలో డిసెంబర్‌ నెలకు ఎంతో ప్రత్యేకత ఉంటుందనే విషయం తెలిసిందే. మరి ఈ స్పెషల్‌ నెలలో జన్మించిన వారికి కూడా ప్రత్యేక లక్షణాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. పండితుల అభిప్రాయం, జ్యోతిష్యశాస్త్రం ప్రకారం డిసెంబర్‌ నెలలో పుట్టిన వారిలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి.? ఇప్పుడు తెలుసుకుందాం..

డిసెంబర్‌ నెలలో పుట్టిన వారు సాధారణం కంటే ఎక్కువ కాలం జీవిస్తారని చెబుతున్నారు. వీరిలో అనారోగ్య సమస్యలు తక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే అరుదైన వ్యాధుల బారినపడుతంటారని పండితులు చెబుతున్నారు. ఇక ఈ నెలలో పుట్టిన వారు ఆధ్యాత్మిక విషయాలకు ఎక్కువగా ఆకర్షితులవుతారని పండితులు అంటున్నారు. దైవపరమైన కార్యక్రమాల్లో పాల్గొనడంలో వీరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.

ఈ నెలల జన్మించిన వారిలో ఆర్థిక క్రమశిక్షణ ఎక్కువగా ఉంటుంది. డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉంటారు. ఇక కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తితో ఉంటారు. ఒకేచోట ఉండడానికి ఇష్టపడరు. నీటి ప్రవాహంలా ఉండేందుకు మొగ్గు చూపుతారు. ఇక ఈ నెలలో జన్మించిన వారు ఎవరితోనైనా ఇట్టే స్నేహం చేస్తారు. స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు. జీవితాన్ని తమకు నచ్చినట్లు జీవించేందుకు ఇష్టపడతారు. ఎవరి కోసమో కాంప్రమైజ్‌ అవ్వాలనే భావనలో ఉండరు.

డిసెంబర్‌ నెలలో జన్మించిన వారిలో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. వీరు విద్యలో బాగా రాణిస్తారు. తమ ఆత్మవిశ్వాసంతో అసాధ్యాలను సైతం సుసాధ్యం చేస్తుంటారు. ఇక ప్రేమ విషయంలో కూడా ఈ నెలలో పుట్టిన వారు ముందు వరుసలో ఉంటారు. ఇతరులను నిస్వార్థంగా ఇష్టపడతారు. ప్రతీ అంశంలో లోతైన అవగాహన పెంచుకోవాలని చూస్తారు. అన్ని రంగాల్లో అవగాహణ ఉండాలనే భావనతో ఉంటారు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..