Tomato: సిరులు కురిపిస్తున్న టమోట.. ఇప్పుడు రైతుల కళ్లలో ఆనందం..

|

Oct 24, 2021 | 9:28 PM

Tomato: గత కొన్ని రోజులుగా కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. ముఖ్యంగా టమోటాల రేటు ఆకాశాన్నంటింది. రెండు నెలల క్రితం టమోటా రైతులకు సరైన ధర

Tomato: సిరులు కురిపిస్తున్న టమోట.. ఇప్పుడు రైతుల కళ్లలో ఆనందం..
Tomato
Follow us on

Tomato: గత కొన్ని రోజులుగా కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. ముఖ్యంగా టమోటాల రేటు ఆకాశాన్నంటింది. రెండు నెలల క్రితం టమోటా రైతులకు సరైన ధర లభించలేదు. నిరాశతో రోడ్డుపైనే వదిలేసిన రోజులున్నాయి. కానీ ఇప్పుడు కాలం మారింది. టమోటాకు మంచి ధర లభిస్తోంది. రికార్డు ధర పలుకుతోంది. రోజుకు పదివేల వరకు ఆదాయాన్ని సంపాదిస్తున్నారు.

నష్ట పరిహారం..
భారీ వర్షాల కారణంగా అన్ని కూరగాయలు, పండ్లకు భారీ నష్టం వాటిల్లింది. చాలా మంది రైతుల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆ తర్వాత మార్కెట్లలో కూరగాయల రాక తగ్గింది. దీంతో ఇప్పుడు కొత్తిమీర, టమాటా, జామ, ఉల్లి, బెండకాయ తదితర కూరగాయల ధరలు ఆకాశాన్ని ఆకాశాన్నంటుతున్నాయి. జనాలు కిలోకు రూ.50 చొప్పున టమోటాలు విక్రయిస్తున్నారు. ఈ కారణంగా టమోటా ఉత్పత్తి చేసే రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఇప్పుడు తమకి సరైన ధర లభిస్తుందని అంటున్నారు. భారీ వర్షాల తర్వాత ప్రస్తుతం రైతులు మళ్లీ సాగు ప్రారంభించారు.

అప్పుడు టమోటాలు వీధుల్లో విసిరేసారు..
జూలై, ఆగస్టు నెలల్లో మార్కెట్లో టమోటాలు భారీగా వచ్చాయి. దీంతో మార్కెట్‌లో టమాట ధరలు భారీగా పడిపోయాయి. కిలో రెండు రూపాయలు పలికింది. ఈ కారణంగా రైతులు టమోటాలను రోడ్డుపై విసిరేశారు. అప్పుడు రైతులకు కన్నీరు తప్పించి ఏం మిగలలేదు. కానీ ఇప్పుడు టమోటా రైతులు మంచి ధర లభించడంతో ఆనందపడుతున్నారు.

IND vs PAK, T20 World Cup 2021: పాకిస్తాన్ టార్గెట్ 152.. క్లాసిక్ అర్థ సెంచరీతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ

Pooja Hegde: నల్ల చీరలో ఫ్యాన్స్ కవ్విస్తున్న బుట్ట బొమ్మ …