Tooth Brush Story: మొదటి టూత్ బ్రష్ పంది వెంట్రుకలతో తయారైంది..ఎక్కడో..ఎప్పుడో తెలుసా?

Tooth Brush Story: సాధారణంగా అందరూ ఉదయాన్నే లేవగానే చేసే మొదటి పని బ్రష్ చేసుకోవడం. చాలా మంది రాత్రి పడుకోబోయే ముందు కూడా బ్రష్ చేసుకుంటారు. మీరు బ్రష్ చేసుకున్తున్నపుడు ఈ బ్రష్ ఎవరు ఎప్పుడు కనిపెట్టారో అని అనిపించిందా?

Tooth Brush Story: మొదటి టూత్ బ్రష్ పంది వెంట్రుకలతో తయారైంది..ఎక్కడో..ఎప్పుడో తెలుసా?
Tooth Brush Story
Follow us
KVD Varma

|

Updated on: Jun 26, 2021 | 7:56 PM

Tooth Brush Story: సాధారణంగా అందరూ ఉదయాన్నే లేవగానే చేసే మొదటి పని బ్రష్ చేసుకోవడం. చాలా మంది రాత్రి పడుకోబోయే ముందు కూడా బ్రష్ చేసుకుంటారు. మీరు బ్రష్ చేసుకున్తున్నపుడు ఎపుడైనా అనుమానం వచ్చిందా? ఈ బ్రష్ ఎవరు ఎప్పుడు కనిపెట్టారో అని అనిపించిందా? అనిపించే ఉంటుంది. కానీ, పెద్దగా దానిగురించి పట్టించుకుని ఉండరు. కదా. కానీ, మేమలా కాదు బ్రష్ ఎప్పుడు తాయారు అయింది.. ఎవరు ముందు బ్రష్ వాడారు? అసలు బ్రష్ ఇప్పుడున్నట్టుగానే గతంలోనూ ఉందా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికి మీకోసం అందిస్తున్నాం. ఎందుకంటే 1498 లో ఈ రోజున (జూన్ 26), చైనా పాలకుడు హాంగ్జి టూత్ బ్రష్‌కు పేటెంట్ తీసుకున్నాడు. అంటే అఫీషియల్ గా ఈరోజు టూత్ బ్రష్ బర్త్ డే.

అసలు పళ్ళు తోముకోవడం అనే అలవాటు ఎప్పుడో వందల వేల ఏళ్ల క్రితం నుంచే ఉంది. పళ్ళు తోముకోవడం.. దంతాలు తెల్లగా ఉండేలా చూసుకోవడం అనే చరిత్ర చాలా పాతది. క్రీస్తు పూర్వం 3000లో ప్రజలు చెట్ల సన్నని కొమ్మలను ఉపయోగించి పళ్ళు మెరిసేలా ఉంచుకునేవారని చెబుతారు. క్రీస్తు పూర్వం 1600 లో, చైనీయులు సుగంధ చెట్ల కొమ్మలను ఉపయోగించడం ప్రారంభించారు. దీనితో, దంతాలు శుభ్రంగా ఉండటంతో పాటు దుర్వాసన సమస్య నుండి బయటపడతాయని వారు తెలుసుకున్నారు.

దాదాపుగా అదే సమయంలో ప్రజలు చెక్క హ్యాండిల్‌పై జంతువుల జుట్టును ఉంచడం ద్వారా బ్రష్ చేయడం ప్రారంభించారు. టూత్‌పేస్ట్ అప్పటికి ఇంకా అందుబాటులోకి రాలేదు. అందుకు బదులుగా ప్రజలు బంకమట్టి, బూడిద, గుడ్డు పెంకుల పేస్ట్, ఇలా అనేక ఇతర వస్తువులను ఉపయోగించారు. 1498 సంవత్సరంలో, చైనాలోని మింగ్ రాజవంశం రాజు హాంగ్జి పంది వెంట్రుకల నుండి మొదటి టూత్ బ్రష్ ను తయారుచేశాడు. ఈ వెంట్రుకలు ఎముక లేదా కలపతో జతచేశారు. ఈ ప్రయత్నం బాగా విజయవంతం అయింది. ఈ ప్రయోగంలో దంతాలు బాగా శుభ్రపడటం ఆ రాజు గమనించాడు. దీని తరువాత టూత్ బ్రష్ల వాడకం పెరగడం ప్రారంభమైంది. హాంగ్జి తయారు చేసిన ఈ టూత్ బ్రష్ ప్రపంచమంతటా ఉపయోగించడం ప్రారంభమైంది. టూత్ బ్రష్ అనే పదాన్ని 1690 లో మొదటిసారి ఉపయోగించారు. ఆంథోనీ వుడ్ అనే వ్యక్తి తన ఆత్మకథలో మరొక వ్యక్తి నుండి టూత్ బ్రష్ కొన్నానని రాశాడు. టూత్ బ్రష్ అనే పదాన్ని ఇలా మొదటిసారిగా ఉపయోగించినట్లు చెబుతారు.

1780 సంవత్సరంలో, విలియం అడిస్ మొదటిసారి టూత్ బ్రష్లను పెద్ద ఎత్తున తయారుచేసే పనిని ప్రారంభించాడు. అతను ఈ బ్రష్‌లో గుర్రపు వెంట్రుకలను ఉపయోగించాడు. జైలులో ఉన్న సమయంలో విలియమ్‌కు టూత్ బ్రష్ చేయాలనే ఆలోచన వచ్చిందని చెబుతారు. వాస్తవానికి, ఆ సమయంలో జైలులో నివసిస్తున్న ఖైదీలు దంతాలను శుభ్రం చేయడానికి మట్టి, బూడిదను మాత్రమే ఉపయోగించారు. విలియం జిగురు సహాయంతో ఎముకలో జుట్టును అతికించి బ్రష్ సిద్ధం చేశాడు. విలియం జైలు నుండి బయటకు వచ్చాకా టూత్ బ్రష్లు తయారు చేయడం ప్రారంభించాడు. ఇప్పటికీ ఆయనకు విజ్డమ్ టూత్ బ్రష్ అనే సంస్థ ఉంది. దానిని ఆయన కుటుంబీకులు నిర్వహిస్తున్నారు.

మొదటి మూడు-లైన్ టూత్ బ్రష్ 1844 లో తయారు చేశారు. టూత్ బ్రష్ రూపకల్పన సామగ్రిలో ఇప్పటివరకు పెద్ద మార్పులు లేవు. 1935 సంవత్సరంలో, వాలెస్ కరోథర్స్ ఒక సూపర్ పాలిమర్‌ను సృష్టించాడు. దీనికి నైలాన్ అని పేరు పెట్టారు. అప్పటి నుండి, టూత్ బ్రష్లలో జంతువుల జుత్తు స్థానంలో నైలాన్ ఉపయోగించడం మొదలైంది. అంతేకాదు అప్పటి నుంచి టూత్ బ్రష్ ల వినియోగం కూడా బాగా పెరిగింది. ఎలక్ట్రిక్ టూత్ బ్రష్లు కూడా 1960 లలో మార్కెట్లోకి ప్రవేశించాయి. కానీ ఇవి పెద్దగా విజయవంతం కాలేదు. ఇప్పుడు టూత్ బ్రష్ లు వివిధ రూపాల్లో.. పరిమాణాల్లో.. ఆకారాల్లో మార్కెట్ లో లభిస్తున్నాయి. అదీ టూత్ బ్రష్ ల కథ!

Also Read: Black Berry: డయాబెటిస్‌తో బాధపడుతున్నారా?.. ఈ పండ్లు తినండి ఆరోగ్యంగా ఉండండి..

Sugar free Mangoes: చక్కర రహిత మామిడి పండ్లు.. తిన్నారంటే వదిలి పెట్టరు.. పాకిస్తాన్ వ్యవసాయవేత్త సృష్టి!

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే