మావటితో మాట్లాడుతున్న శ్రీరంగం దేవాలయం ఏనుగు.. వీడియో వైరల్.. వావ్ అంటోన్న నెటిజన్లు
మీరు మాట్లాడే ఏనుగును ఎక్కడైనా చూశారా..! అయితే తమిళనాడులోని ప్రముఖ శ్రీరంగం దేవాలయంలోని ఏనుగు మావటితో మాట్లాడుతోంది.

Srirangam Talking Elephant: మీరు మాట్లాడే ఏనుగును ఎక్కడైనా చూశారా..! అయితే తమిళనాడులోని ప్రముఖ శ్రీరంగం దేవాలయంలోని ఏనుగు మావటితో మాట్లాడుతోంది. రోడ్డుపై మావటితో పాటు నడుస్తూ వెళ్తోన్న ఆ ఏనుగు.. అతడి మాటలకు ఊ, ఊహూ అంటూ స్పందిస్తోంది. ఇక మధ్యలో మావటి వెళ్దాం పద అంటూ అభ్యర్థిస్తుండగా.. ఊహూ అంటూ అక్కడే ఉండిపోయింది. దీనికి సంబంధించిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నంద తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. (కరోనా అప్‌డేట్స్: తెలంగాణలో 1,050 కొత్త కేసులు.. నలుగురు మృతి.. కోలుకున్న 1,736 మంది)
మావటి అభ్యర్థనను ఏనుగు ఎంత బాగా తిరస్కరిస్తుందో.. వారిద్దరి మధ్య ఉన్న బంధం మాటలకు అందనిది అని ఆయన కామెంట్ పెట్టారు. కాగా ఈ వీడియోకు వావ్ అని కొంతమంది నెటిజన్లు స్పందిస్తున్నారు. మరికొందరేమో అది మూత్ర విసర్జన కోసం ఆగిపోయింది అని కామెంట్ పెడుతున్నారు. ఏదేమైనా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. అందరికీ బాగా ఆకట్టుకుంటోంది.(Bigg Boss 4: మొన్న మటన్.. నిన్న గుడ్లు.. అవినాష్‌ని కుమ్మేసిన హౌజ్‌మేట్స్)
The Mahout ( elephant keeper) pleads with the elephant of Srirangam temple situated in Tamil Nadu. And her polite refusal?It is beyond our comprehension to understand the special bond they share.. pic.twitter.com/hebRLzXBId
— Susanta Nanda IFS (@susantananda3) November 11, 2020