NASA: రాకెట్ ప్రయోగ సమయంలో 30 లక్షల లీటర్ల నీరు ఉపయోగిస్తారట.. కారణం ఏంటో తెలుసా?

ISRO లేదా NASA అంతరిక్షంలోకే అనేక రాకెట్లను ప్రయోగిస్తుంటాయి. భారీ రాకెట్ ప్రయోగించడానికి ఎన్నో రకాల చర్యలు తీసుకుంటారు శాస్త్రవేత్తలు. రాకెట్‌ను ప్రయోగించినప్పుడు భారీ మంటలు, పొగలు వెలువడుతుంటాయి. రాకెట్‌ ప్రయోగం సమయంలో ప్రతిచోటా వ్యాపించడం మనం తరచుగా చూస్తుంటాము. అయితే ఈ ప్రక్రియలో దాదాపు 30 లక్షల లీటర్ల నీరు..

NASA: రాకెట్ ప్రయోగ సమయంలో 30 లక్షల లీటర్ల నీరు ఉపయోగిస్తారట.. కారణం ఏంటో తెలుసా?
Rocket Launcher

Updated on: Mar 17, 2024 | 8:29 PM

ISRO లేదా NASA అంతరిక్షంలోకే అనేక రాకెట్లను ప్రయోగిస్తుంటాయి. భారీ రాకెట్ ప్రయోగించడానికి ఎన్నో రకాల చర్యలు తీసుకుంటారు శాస్త్రవేత్తలు. రాకెట్‌ను ప్రయోగించినప్పుడు భారీ మంటలు, పొగలు వెలువడుతుంటాయి. రాకెట్‌ ప్రయోగం సమయంలో ప్రతిచోటా వ్యాపించడం మనం తరచుగా చూస్తుంటాము. అయితే ఈ ప్రక్రియలో దాదాపు 30 లక్షల లీటర్ల నీరు వాడుతుంటారట. నిప్పు ఉన్నచోట నీరు ఉంటుంది. అయితే రాకెట్‌ ప్రయోగాలు చేపట్టేటప్పుడు కొన్ని లక్షల లీటర్ల నీరును ఉపయోగిస్తారు.

నాసా తన యూట్యూబ్ ఛానెల్‌లో కెన్నెడీ స్పేస్ సెంటర్ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో లాంచ్ ప్యాడ్ నీటి ప్రవాహ వ్యవస్థను పరీక్షించడం జరిగింది. పరీక్ష సమయంలో దాదాపు 30 లక్షల లీటర్ల నీటిని వినియోగించారు. రాకెట్లను ప్రయోగించడంలో ఇంత పెద్ద ఎత్తున నీటిని ఎందుకు ఉపయోగిస్తున్నారనేది ఒక ముఖ్యమైన ప్రశ్న.

30 లక్షల లీటర్ల నీరు:

ఇవి కూడా చదవండి

రాకెట్ ప్రయోగ సమయంలో శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల బృందం సిద్ధంగా ఉంటుంది. ప్రయోగ సమయంలో రాకెట్ చుట్టూ నీటి వేగవంతమైన స్ప్రే ప్రారంభమవుతుంది. నిమిషాల వ్యవధిలో రాకెట్ చుట్టూ 3 మిలియన్ లీటర్ల నీటి భారీ కొలను ఏర్పడుతుంది. రాకెట్ విజయవంతమైన ప్రయోగానికి ఈ నీరు చాలా ముఖ్యం.

నిజానికి రాకెట్ లాంచ్ ప్యాడ్ నుండి బయలుదేరినప్పుడు చాలా శబ్దం ఉంటుంది. ఒక SLS రాకెట్ 176 డెసిబుల్స్ ధ్వనిని ఉత్పత్తి చేయగలదు. ఇది జెట్‌లైనర్ కంటే ఎక్కువ శబ్దం వస్తుంది. లక్షలాది లీటర్ల నీటిని ఏకకాలంలో కురిపించినప్పుడు నీరు రాకెట్ శబ్దాన్ని చాలా తక్కువ డెసిబెల్‌కు తగ్గిస్తుంది. దీంతో రాకెట్‌ ప్రయోగంలో శబ్ధం తక్కువ చేసేందుకు కూడా ఈ నీరు ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఈ నీరు రాకెట్ శబ్దాన్ని తగ్గించడమే కాకుండా మంటలు, పొగలను నియంత్రించడంలో సహాయపడుతుంది. రాకెట్‌ను ప్రయోగించినప్పుడు చాలా మంటలు, పొగ విడుదలవుతాయి. ఇది మొబైల్ లాంచర్‌ను దెబ్బతీస్తుంది. కానీ నీరు ఇది జరగకుండా నిరోధిస్తుంది. మొబైల్ లాంచర్ సురక్షితంగా ఉంటుంది. ఇది కాకుండా, నీరు వైబ్రేషన్‌ను కూడా నియంత్రిస్తుంది.

సౌండ్ సప్రెషన్ సిస్టమ్:

కంపనం ఎక్కువగా ఉంటే లాంచ్ ప్యాడ్, రాకెట్ రెండూ దెబ్బతింటాయి. నీటికి సంబంధించిన ఈ వ్యవస్థను సౌండ్ సప్రెషన్ సిస్టమ్ అంటారు. రాకెట్ ప్రయోగం చివరి 10-సెకన్ల కౌంట్‌డౌన్‌కు 20 సెకన్ల ముందు సౌండ్ సప్రెషన్ సిస్టమ్ ప్రారంభమవుతుంది. 10 సెకన్ల తర్వాత రాకెట్ అగ్ని, పొగను విడుదల చేయడం ప్రారంభిస్తుంది.

ప్రయోగం సమయంలో వాటర్‌ ఎందుకు అవసరం?

  1. ఉష్ణోగ్రత నియంత్రణ : రాకెట్ ప్రయోగ సమయంలో రాకెట్ ఇంజన్లు చాలా వేడిగా ఉంటాయి. నీటి శీతలీకరణ ఇంజిన్‌ను చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది.
  2. నాయిస్ రిడక్షన్ : రాకెట్ ప్రయోగ సమయంలో పెద్ద శబ్ధం వినబడుతుంది. వాటర్ స్ప్రే ధ్వనిని తగ్గించడంలో సహాయపడుతుంది. చుట్టుపక్కల ప్రజలను, భవనాలను దెబ్బతినకుండా కాపాడుతుంది.
  3. కంపనాన్ని తగ్గించడం: రాకెట్ ప్రయోగ సమయంలో చాలా వైబ్రేషన్ ఉంటుంది. వాటర్ స్ప్రే కంపనాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది రాకెట్‌కు నష్టం జరగకుండా చేస్తుంది.
  4. భద్రత : వాటర్ జెట్ రాకెట్ చుట్టూ రక్షణ కవచాన్ని ఏర్పరుస్తుంది. ఇది బాహ్య ముప్పు నుండి రాకెట్‌ను రక్షిస్తుంది.
  5. పర్యావరణం: వాటర్ స్ప్రే దుమ్ము, ధూళిని గాలిలోకి ఎగరకుండా చేస్తుంది. ఇది లాంచ్ ప్యాడ్‌ను శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us