WhatsApp: వాట్సాప్ గ్రూపులో సెమీ న్యూడ్ ఫోటో అప్ లోడ్ చేసిన టీచర్.. తర్వాత ఏమైందంటే..

WhatsApp: ఇటీవల కాలంలో సోషల్ మీడియా అధికారిక సమాచార వేదికగా కూడా మారిపోయింది. ముఖ్యంగా వాట్సాప్ లో తమ పని సులభంగా.. వేగంగా పూర్తి కావడానికి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నారు చాలా మంది.

WhatsApp: వాట్సాప్ గ్రూపులో సెమీ న్యూడ్ ఫోటో అప్ లోడ్ చేసిన టీచర్.. తర్వాత ఏమైందంటే..
Whatsapp
KVD Varma

|

Jul 21, 2021 | 5:37 PM

WhatsApp: ఇటీవల కాలంలో సోషల్ మీడియా అధికారిక సమాచార వేదికగా కూడా మారిపోయింది. ముఖ్యంగా వాట్సాప్ లో తమ పని సులభంగా.. వేగంగా పూర్తి కావడానికి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నారు చాలా మంది. ఇందులో తమ అధికారిక గ్రూప్ ఏర్పాటు చేసుకుని అందరి మధ్య సమాచార మార్పిడి ఉండేలా చేసుకుంటున్నారు. దీనివలన వేగంగా సమాచారం అందించగలగడమే కాకుండా.. సమాచారం కచ్చితంగా అందరికీ స్పష్టంగా తెలిసే అవకాశం ఉంటుంది. సాధారణంగా ప్రతి ఒక్కరూ తమ అధికారిక గ్రూపులతో పాటు ఇతర అనేక రకాల గ్రూపులలోకూడా సభ్యులుగా ఉంటూ ఉంటారు. ఇలా వేర్వేరు గ్రూపుల్లో ఉండేవారు జాగ్రత్తగా ఉండకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. ఇదంతా ఎందుకంటే.. ఓ స్కూల్ ప్రిన్సిపాల్ పాఠశాలకు సంబంధించిన గ్రూపులో పొరపాటున ఒక అభ్యంతరకరమైన ఫోటో పెట్టాడు. దీంతో రభస జరిగిపోయింది. ఆతరువాత అతను తన ఉద్యోగం నుంచి సస్పెండ్ కావాల్సి వచ్చింది.

కర్ణాటకలోని మండ్య జిల్లాలో మాలవల్లి తాలూకా వద్ద వద్దరహళ్లి సమీపంలోని కిట్టూర్ అనే ఊరిలో రాణి చెన్నమ్మ రెసిడెన్షియల్ స్కూల్ ఉంది. ఈ స్కూల్ కు శివకుమార్ ప్రిన్సిపాల్ గా వ్యవహరిస్తున్నారు. ఈయనగారు ఓ రోజు సాయంత్రం తన ఇంటిలో సగం బట్టల్లో కూచుని.. బీరు తాగుతూ సరదాగా ఓ సెల్ఫీ దిగారు. దిగినోడు దాన్ని అలా దాచుకోవచ్చు కదా. ఆ పని చేస్తే అతని గురించి మనం ఎందుకు చెప్పుకుంటాం లెండి. ఆ సెల్ఫీని జాగ్రత్తగా తన ఫోన్ లోని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసాడు. తన స్నేహితులు ఉన్న గ్రూప్ తో పాటు స్కూల్ అధికారిక గ్రూప్ లోనూ ఆ ఫోటో అప్ లోడ్ చేశేశాడు.

అయ్యగారి సగం దినగంబరత్వాన్ని చూసిన స్కూల్ యాజమాన్యం అదిరిపడింది. పైగా అతని పక్కన బీర్ బాటిల్ కూడా ఆ సెల్ఫీలో దర్శనం ఇస్తోంది. దీంతో ఈ పెద్దయ్య గారిని అర్జెంటు మీటింగ్ ఉందని పిలిపించి వివరణ అడిగారు. తాగిన మత్తులో అలా చేశానని సదరు ప్రిన్సిపాల్ శివకుమార్ సంజాయిషీ ఇచ్చాడు. దీంతో స్కూల్ యాజమాన్యం వెంటనే అతనిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఫోటో తీసిన ప్రదేశం కూడా ఆ స్కూల్ రెసిడెన్షియల్ క్వార్ట్రర్స్.

ఈ ఫోటో.. అందులోని విషయం శివకుమార్ పూర్తి వ్యక్తిగతం అయినప్పటికీ.. దానిని స్కూల్ వాట్సాప్ లో షేర్ చేయడం తప్పుగా స్కూల్ యాజమాన్యం భావించి సస్పెన్షన్ విధించినట్టు చెప్పింది. శివకుమార్ ఈ ఫోటో షేర్ చేసిన గ్రూప్ లో  మీడియా వ్యక్తులు, స్థానిక ప్రజల ప్రతినిధులు, అదేవిధంగా అనేక మంది తాలూకా స్థాయి అధికారులు సభ్యులుగా ఉన్నారు. చూశారా.. వాట్సాప్ గ్రూపుల్లో విషయాలను షేర్ చేసేముందు ఎంత జాగ్రత్తగా ఉండాలో..

Also Read: Bajaj Chetak : బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్..! రేపటి నుంచి ఈ 3 నగరాల్లో బుకింగ్ ప్రారంభం..

Space Tour: స్పేస్ టూరిజం సూపర్ సక్సెస్.. కానీ ఖర్చు ఎంత అవుతుందో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu