మీ జీవిత భాగస్వామి కోసం వెతుకుతున్నారా? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి.. జీవితాంతం చింతించాల్సి వస్తుంది..!

మనదేశంలో వివాహానికి ప్రత్యేక స్థానం ఉంది. పెళ్లిని వేయి జన్మల బంధంగా పరిగణిస్తారు. మూడుముళ్ల బంధంతో ఒక అబ్బాయి, అమ్మాయి పెళ్లి జీవితాంతం ఒక్కటవుతారు. కడవరకూ తోడూనీడగా ఉంటారు.

మీ జీవిత భాగస్వామి కోసం వెతుకుతున్నారా? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి.. జీవితాంతం చింతించాల్సి వస్తుంది..!

Updated on: Mar 20, 2023 | 7:40 AM

మనదేశంలో వివాహానికి ప్రత్యేక స్థానం ఉంది. పెళ్లిని వేయి జన్మల బంధంగా పరిగణిస్తారు. మూడుముళ్ల బంధంతో ఒక అబ్బాయి, అమ్మాయి పెళ్లి జీవితాంతం ఒక్కటవుతారు. కడవరకూ తోడూనీడగా ఉంటారు. కానీ, కొన్నిసార్లు సరికాని భాగస్వామితో సంబంధం వల్ల ఆ వివాహ బంధం బలహీనపడుతుంది. తద్వారా ఆ జంట విడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే.. మీరు వివాహం కోసం మంచి జీవిత భాగస్వామి కోసం చూస్తున్నట్లయితే.. ముందుగానే కొన్ని లక్షణాలను గమనించాల్సిన ఆవశ్యకత ఉంది. ఎదుటివారు మీకు సరైనవారేనా? జీవితాంతం మీతో సవ్యంగానే ఉంటారా? అనే అంశాలను బేరీజు వేసుకోవాలి. తెలియక లేదా ఉద్దేశపూర్వకంగా చేసిన పొరపాట్ల వల్ల.. తప్పు భాగస్వామిని ఎంచుకుంటే, అది భవిష్యత్తులో మీ బంధం విఫలమవడానికి కారణం కావచ్చు. కాబట్టి జీవిత భాగస్వామిని ఎన్నుకునేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. ఆ విషయాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ అలవాట్లు ఉన్న వ్యక్తిని జీవిత భాగస్వామిగా ఎంచుకోవద్దు..

కెరీర్‌పై ఫోకస్ లేని వ్యక్తులు..

వివాహానికి సురక్షితమైన భవిష్యత్తు అవసరం. ఇద్దరు వ్యక్తులకు పెళ్లి చేయడం ద్వారా ఒక కుటుంబాన్ని ఏర్పరుస్తారు. కుటుంబ బాధ్యతలు దంపతులపై పడుతుంది. కానీ మీ భాగస్వామి తన కెరీర్ గురించి శ్రద్ధ పెట్టకపోతే, భవిష్యత్ గురించి ఎలాంటి ప్రణాళికలు చేయకపోతే.. వివాహం తర్వాత కుటుంబాన్ని నిర్వహించడం కష్టంగా మారుతుంది. భవిష్యత్తు కోసం ప్లాన్ చేసుకునే భాగస్వాములు మీకు సురక్షితమైన జీవితాన్ని ఇస్తారు. ప్రతి ఒక్కరూ ఈ అంశాన్ని తప్పక గమనించాలి.

అందం కాదు.. మంచి లక్షణాలుండాలి..

చాలామంది వ్యక్తులు తమ కోసం భాగస్వామిని ఎంచుకునేటప్పుడు.. వ్యక్తి ముఖాన్ని చూస్తారు. డేటింగ్ కోసం అందానికి ప్రాముఖ్యత ఇవ్వొచ్చు కానీ, జీవితాన్ని కలిసి ఉండాల్సిన అంశం పెళ్లి. అందుకే ఇక్కడ చూడాల్సింది ముఖం కాదు. మంచి వ్యక్తిత్వం చూడాలి. మంచి లక్షణాలు, వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి జీవిత భాగస్వామిగా వస్తే జీవితాంతం హ్యాపీగా గడిపేయొచ్చు. రూపురేఖలు చూసి జీవిత భాగస్వామిని ఎంచుకుంటే.. భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఇవి కూడా చదవండి

కోపం, దురుసు ప్రవర్తన..

డేటింగ్ చేస్తున్నప్పుడు తమ తమ భాగస్వామి సంతోషపెట్టేందుకు రకరకాల ప్రయత్నాలుు చేస్తారు. కొన్నిసార్లు కోపం, దుష్ప్రవర్తన, అసంతృప్తితో ఉంటారు. అయితే, సాధారణ కోపం, దుష్ప్రవర్తన అయితే పెద్దగా నష్టం లేదు. కానీ, జీవితాంతం ఇలాంటి ప్రవర్తనే కలిగి ఉండే భాగస్వామితో దూరంగా ఉండటం ఉత్తమం. పెళ్లి తరువాత కోపం, దుష్ప్రవర్తనతో ఉంటే.. భరించడం కష్టం అవుతుంది. వైవాహిక జీవితంలో ఎక్కువ కోపం శత్రువులా పని చేస్తుంది. ఆ బంధానికి బీటలుబారుతాయి.

గౌరవం ఇచ్చుకోవడం..

భార్యాభర్తలు ఒకరిపట్ల ఒకరు గౌరవ భావాన్ని కలిగి ఉండాలి. డేటింగ్ సమయంలో జంటలు స్నేహితుల వలె ప్రవర్తించవచ్చు. అదే సమయంలో ఒకరి తప్పులను మరొకరు కనుగొంటారు. ఈ క్రమంలో వారి కంటే తమను తాము ఉత్తమంగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు. కానీ వివాహం కోసం ఒకరినొకరు గౌరవించుకునే వ్యక్తులు కావాలి. అలా గౌరవించే వ్యక్తులు జీవితంలోకి వస్తే జీవితం సుఖమయం అవుతుంది. మీ జీవిత భాగస్వామిని మీతోపాటు సమానంగా చూడాలి. లోపాలను కనుగొనే బదులు, ఆ లోపాలను సరిదిద్దే ప్రయత్నం చేస్తే జీవితం ఆనందమయం అవుతుంది.

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..