AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మనందరికీ పాలు తెల్లగా ఉంటాయనే తెలుసు..! కానీ నల్లని పాలు కూడా ఉంటాయని మీకు తెలుసా..?

ప్రపంచంలో అరుదైన జంతువుల గురించి వింటుంటాం. కానీ నల్లని రంగు పాలను ఇచ్చే జంతువు గురించి తెలుసా..? సాధారణంగా తెల్లటి పాలను ఇచ్చే జంతువులను మాత్రమే చూస్తాం. అయితే, ఆఫ్రికన్ బ్లాక్ గండమృగం మాత్రం నల్లని పాలను ఉత్పత్తి చేసే అద్భుతమైన జీవి. ఇది ఎందుకు ఇలాంటి పాలను ఇస్తుందో తెలుసుకోవాలని ఉందా..? అయితే తెలుసుకుందాం పదండి.

మనందరికీ పాలు తెల్లగా ఉంటాయనే తెలుసు..! కానీ నల్లని పాలు కూడా ఉంటాయని మీకు తెలుసా..?
Black Milk Mystery
Prashanthi V
| Edited By: |

Updated on: Mar 06, 2025 | 3:17 PM

Share

పాలు మన ఆరోగ్యానికి అత్యంత కీలకం. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ రోజువారీ జీవితంలో పాలను ఉపయోగిస్తారు. తల్లిపాలు చిన్నపిల్లలకు ఉత్తమమైనవి. ఆ తర్వాత ఆవు లేదా గేదే పాలను తాగడం సాధారణంగా జరుగుతుంది. పాలను శరీరానికి అవసరమైన పోషకాలు, కాల్షియం, విటమిన్లు అందించే శక్తివంతమైన ఆహారంగా పరిగణిస్తారు.

ప్రపంచంలో అనేక రకాల పాలిచ్చే జంతువులు ఉన్నాయి. మానవులే కాకుండా ఆవులు, గొర్రెలు, ఒంటెలు, కుందేళ్లు, సింహాలు, పులులు వంటి అనేక జంతువులు పాలిచ్చే జంతువులుగా గుర్తించబడ్డాయి. వీటి ద్వారా మనం పాలు, పాల ఉత్పత్తులను వినియోగించుకుంటూ ఉంటాం.

ప్రపంచంలో సుమారు 6,400 పాలిచ్చే జంతువులలో కేవలం ఒకే ఒక్క జంతువు మాత్రమే నల్లని పాలను ఇస్తుంది. ఇది చాలా అరుదైన విషయం… ఎందుకంటే సాధారణంగా మనం తెల్లటి లేదా కొంచెం పసుపు రంగు పాలనే చూస్తూ ఉంటాం. అయితే నిజంగా ఒక జంతువు నల్లని రంగు పాలను ఉత్పత్తి చేస్తుంది.

నల్లని రంగు పాలు ఇచ్చే అరుదైన జంతువు కృష్ణం (బ్లాక్) గండమృగం. ఇది ఆఫ్రికన్ బ్లాక్ రైనోసరస్ (African Black Rhinoceros) అని పిలవబడుతుంది. సాధారణంగా గండమృగాల పాలలో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది. అంటే 0.2% మాత్రమే. ఈ పాలు తాగునీటిని పోలి ఉంటాయి. కానీ రంగు పూర్తిగా నల్లగా ఉంటుంది.

నల్ల గండమృగాలు 4 నుంచి 5 సంవత్సరాల వయసులోనే ప్రజనన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇవి ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలం గర్భంతో ఉంటాయి. సాధారణంగా ఒకసారి కేవలం ఒక పిల్లను మాత్రమే ప్రసవిస్తాయి. గండమృగాలు ప్రధానంగా ఆఫ్రికా ఖండంలోని అడవుల్లో నివసిస్తాయి.

పాలిచ్చే అన్ని జంతువుల్లో కేవలం ఒకటే జంతువు నల్లని రంగు పాలను ఉత్పత్తి చేయడం ఒక ఆద్భుతమైన ప్రకృతి రహస్యంగా భావించబడుతుంది. గండమృగాల పాలలో కొవ్వు శాతం తక్కువగా ఉండడం వల్ల ఇవి తాగునీటిని పోలినట్లుగా కనిపిస్తాయి.