AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Child Adoption Rules: పిల్లలను దత్తత తీసుకోవాలనుకుంటున్నారా? ఈ రూల్స్ తప్పక తెలుసుకోవాల్సిందే..

Child Adoption Rules: వివిధ కారణాల వల్ల చాలా మంది దంపతులు తల్లిదండ్రులు కాలేకపోతున్నారు. కొందరు పిల్లల కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలితం లేకుండా పోతోంది

Child Adoption Rules: పిల్లలను దత్తత తీసుకోవాలనుకుంటున్నారా? ఈ రూల్స్ తప్పక తెలుసుకోవాల్సిందే..
Adoption
Shiva Prajapati
|

Updated on: Aug 15, 2022 | 8:48 PM

Share

Child Adoption Rules: వివిధ కారణాల వల్ల చాలా మంది దంపతులు తల్లిదండ్రులు కాలేకపోతున్నారు. కొందరు పిల్లల కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలితం లేకుండా పోతోంది. పిల్లలు లేని మరికొందరు.. దత్తత వైపు ఆసక్తి చూపుతున్నారు. పిల్లలను దత్తత తీసుకుంటున్నారు. అయితే, పిల్లలను దత్తతకు భారతదేశంలో ప్రత్యేక చట్టాలు, నియమ నిబంధనలు ఉన్నాయి. దాని ప్రకారమే పిల్లల దత్తత ఇవ్వడం జరుగుతుంది. సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ దీనికి సంబంధించిన నియమాలు, నిబంధనలను పర్యవేక్షిస్తుంది. చాలా మందికి ఈ విషయాలు తెలియక.. దత్తత విషయంలో ఇబ్బందులు పడుతుంటారు. మరి ఆ నియమనిబంధనలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

దత్తత తీసుకోవడానికి అర్హతలు.. 1. భారతదేశంలో ఒక భారతీయ పౌరుడు, NRE, విదేశీ పౌరుడు ఒక బిడ్డను దత్తత తీసుకోవచ్చు. అయితే, ఈ ముగ్గురు పౌరులకు సంబంధించిన నియమ, నిబంధనల్లో తేడా ఉంది. 2. స్త్రీ, పురుషుడు అనే దానితో పాటు వారి వైవాహిక స్థితిపై(కొన్ని మినహాయింపులతో) సంబంధం లేకుండా దత్తత తీసుకోవడానికి అవకాశం ఉంది. 3. వివాహిత దంపతులు పిల్లలను దత్తత తీసుకున్న తరువాత కనీసం రెండు సంవత్సరాలు స్థిరమైన బంధాన్ని కొనసాగించాలి. బిడ్డను దత్తత తీసుకునే దంపతులు ఈ నిర్ణయాన్ని అంగీకరించడం అతి ముఖ్యం. ఏ ఒక్కరు అంగీకరించకపోయినా ఇది వర్తించదు. 4. పిల్లల వయస్సులు బట్టి వేర్వేరు ప్రమాణాలు ఉంటాయి.

సాధారణ షరతులు.. 1. దత్తత తీసుకునే జంట మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి. జీవితానికి ప్రమాదకరమైన ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండకూడదు. 2. దత్తత తీసుకునే పిల్లలను బాగా చూసుకునేలా ఆర్థిక పరిపుష్టిని కలిగి ఉండాలి. 3. ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉన్న జంటలు కొన్ని ప్రత్యేక సందర్భాలలో తప్ప పిల్లలను దత్తత తీసుకోలేరు. 4. ఎవరైనా ఒక బిడ్డను సింగిల్ పేరెంట్‌గా దత్తత తీసుకోవాలనుకుంటే, స్త్రీ అయితే, ఆమె ఏ లింగానికి చెందిన బిడ్డనైనా దత్తత తీసుకోవచ్చు. కానీ, సింగిల్ పేరెంట్‌గా ఉండాలనుకునే పురుషుడు మాత్రం కుమార్తెను దత్తత తీసుకోలేడు. 5. సింగిల్ పేరెంట్ వయస్సు 55 ఏళ్లు మించకూడదు. అలాగే, దత్తత తీసుకున్న జంటల ఉమ్మడి వయస్సు 110 ఏళ్లు మించకూడదు.

పిల్లల దత్తత ప్రక్రియ.. 1 రిజిస్ట్రేషన్: గుర్తింపు పొందిన భారతీయ ప్లేస్‌మెంట్ సంస్థలు, ప్రత్యేక దత్తత సంస్థలలో పిల్లల దత్తత నమోదు చేయబడుతుంది. 2. రిజిస్ట్రేషన్ తర్వాత బిడ్డను దత్తత తీసుకోవాలనుకునే దంపతుల ఇంటికి వెళ్లి సదరు జంట పిల్లలను చూసుకునే సామర్థ్యం కలిగి ఉన్నారా? లేరా? అనే సమాచారాన్ని సేకరిస్తారు. 3. మూడవ దశలో, ఒక బిడ్డ దత్తత తీసుకోవడానికి అందుబాటులో ఉన్నప్పుడు, దత్తత కోసం నమోదు చేసుకున్న తల్లిదండ్రులు లేదా దంపతులకు ఆ సమాచారాన్ని అందజేయడం జరుగుతుంది. బిడ్డను దత్తత తీసుకోవడానికి ఆసక్తి కలిగి ఉంటే, వారు పిల్లలతో కొంత సమయం గడపడానికి అనుమతించవచ్చు. ఆ తరువాత వారు బిడ్డను దత్తత తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే, కొన్ని అవసరమైన పత్రాలపై సంతకం చేయాలి. 4 ఈ డాక్యుమెంట్స్ వర్క్ అంతా న్యాయవాది సహాయంతో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ అడాప్షన్ పత్రాలను కోర్టులో సమర్పించడానికి న్యాయవాది సహాయం తీసుకోవాలి. 5. కోర్టు విచారణ సందర్భంగా పిల్లల కోసం తల్లిదండ్రులు కొంత డబ్బును జమ చేయాల్సి ఉంటుంది. ఆ మొత్తాన్ని దత్తత తీసుకున్న పిల్లల పేరు మీద ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత పిల్లల దత్తత ప్రక్రియ పూర్తవుతుంది.

మరిన్ని హ్యూమన్ ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..