PM Modi Rozgar Mela: నిరుద్యోగులకు మోదీ సర్కార్ గుడ్‌న్యూస్.. కొలువుల జాతర షురూ..! 10 లక్షల ఉద్యోగాలే టార్గెట్..
రానున్న 18 నెలల కాలంలో దేశ వ్యాప్తంగా 10 లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో రోజ్ గార్ మేళాను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. మొదటి దశలో ఎంపికైన 75,226 మంది యువకులకు నియామక పత్రాలు అందజేశారు. ముందు ప్రభుత్వ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.
గ్రూప్ A, B,Cల్లో గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. 38 డిపార్ట్‌మెంట్స్‌లో ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కేంద్రప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రక్షణ, రైల్వే, హోం, పోస్టల్ డిపార్ట్‌మెంట్, సీఐఎస్‌ఎఫ్, సీబీఐ, కస్టమ్స్, బ్యాంకింగ్ రంగాల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. దేశవ్యాప్తంగా 50 కేంద్రాలలో అపాయింట్‌మెంట్ లెటర్లు అందజేయగా.. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం, విజయవాడలో రోజ్‌గార్‌మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. 8 కేంద్ర శాఖల్లో 303 మందికి ఉద్యోగాలు కల్పించారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి మురుగన్ ఉద్యోగ నియమాక పత్రాలను అందజేశారు. 218 మందికి నేరుగా.. 85 మందికి వర్చువల్‌గా అపాయింట్‌మెంట్ లెటర్లు అందజేశారు.గత ఎనిమిదేళ్ల కాలంలో యువతకు ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపర్చామన్నారు ప్రధాని. రోజ్ గార్ మేళా ద్వారా ఏడాదిన్నర కాలంలో పది లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. భవిష్యత్తులోనూ యువతకు వివిధ రంగాల్లో ఎన్నో అవకాశాలు రానున్నాయని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో స్వయం సమృద్ధి సాధించే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. తమ సంకల్పంలో నూతన ఆవిష్కర్తలు, వ్యవస్థాపకులు, రైతులు అంతా భాగస్వామ్యం కావాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. యువతకు ఉద్యోగాలతో పాటు స్వయం ఉపాధి అవకాశాలను ప్రోత్సహిస్తున్నామన్నారు. ముద్రా యోజన కింద బ్యాంకుల ద్వారా రుణాలిస్తున్నామని ప్రధాని తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో
Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.