Aadhaar-Ration Card: రేషన్ కార్డు హోల్డర్స్‌కు శుభవార్త.. ఇక నుంచి ఆ పని మరింత సులభతరమైంది.. పూర్తి వివరాలు ఇప్పుడే తెలుసుకోండి..

Aadhaar-Ration Card: భారత పౌరులందరికీ ఆధార్ కార్డ్ అత్యంత కీలకమైన ధృవీకరణ పత్రం. ప్రతీ అంశంలో దీని అవసరం పడుతుంది. ఆధార్‌కు సంబంధించిన అన్ని సేవలను ఆన్‌లైన్‌లోకి మార్చారు.

Aadhaar-Ration Card: రేషన్ కార్డు హోల్డర్స్‌కు శుభవార్త.. ఇక నుంచి ఆ పని మరింత సులభతరమైంది.. పూర్తి వివరాలు ఇప్పుడే తెలుసుకోండి..
Follow us

|

Updated on: Jan 05, 2022 | 12:51 PM

Aadhaar-Ration Card: భారత పౌరులందరికీ ఆధార్ కార్డ్ అత్యంత కీలకమైన ధృవీకరణ పత్రం. ప్రతీ అంశంలో దీని అవసరం పడుతుంది. ఆధార్‌కు సంబంధించిన అన్ని సేవలను ఆన్‌లైన్‌లోకి మార్చారు. ఫలితంగా దీనికి సంబంధించి అన్ని పనులను ఇంట్లో కూర్చునే చేసుకునే అవకాశం ఉంది. కాగా, ఆధార్ కార్డు సహాయంతో రేషన్ కార్డు వినియోగదారులకు ప్రత్యక్ష ప్రయోజనాలు లభిస్తున్నాయి. సబ్సిడీ సొమ్ము నేరుగా వారి ఖాతాల్లోకే చేరుతోంది. అయితే, కొన్ని సార్లు ఇందుకు సంబంధించిన సబ్సిడీ సొమ్ము పక్కదారి పడుతోంది. ఈ నేపథ్యంలో.. ఇలాంటి అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే.. ఆధార్ కార్డుకు, రేషన్ కార్డుకు లింక్ పెట్టింది సర్కార్. ఆధార్, రేషన్ కార్డు లింక్ చేయాలంటూ లబ్ధిదారులను కోరింది. అలా చేస్తేనే లబ్ధి పొందుతారంటూ కండీషన్ పెట్టింది. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందాలంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డ్ లింక్ తప్పనిసరి అని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ రేషన్ కార్డుతో ఆధార్‌ను ఎలా అనుసంధానం చేయాలనే విషయాన్ని తెలుసుకుందాం..

ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డ్‌ని ఇలా లింక్ చేయండి.. >> దీని కోసం ముందుగా అధికారిక వెబ్‌సైట్ uidai.gov.in కి వెళ్లండి. >> ఇప్పుడు మీరు ‘Start Now’ పై క్లిక్ చేయండి. >> ఇప్పుడు ఇక్కడ మీరు మీ చిరునామాను జిల్లా, రాష్ట్రం సహా వివరాలను నింపాలి. >> దీని తర్వాత ‘రేషన్ కార్డ్ బెనిఫిట్’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. >> ఇప్పుడు ఇక్కడ మీరు మీ ఆధార్ కార్డ్ నంబర్, రేషన్ కార్డ్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ మొదలైన వివరాలను నింపండి. >> వివరాలను నింపిన తరువాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. >> ఇక్కడ OTPని నమోదు చేసిన తర్వాత, మీ స్క్రీన్‌పై ప్రక్రియ పూర్తయినట్లు సందేశం వస్తుంది. >> ఈ ప్రక్రియ అంతా పూర్తయిన వెంటనే, మీ ఆధార్ ధృవీకరించబడుతుంది. అలా మీ రేషన్ కార్డుతో ఆధార్ లింక్ చేయబడుతుంది.

మేరా రేషన్ మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.. వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ (ONORC) కింద మోడీ ప్రభుత్వం మేరా రేషన్ మొబైల్ యాప్‌ను కూడా ప్రారంభించింది. ఈ యాప్ సహాయంతో ఆన్‌లైన్ మొబైల్ యాప్ సహాయంతో రేషన్ కార్డుకు సంబంధించిన చాలా వరకు పనులు సునాయాసంగా పూర్తి చేసుకోవచ్చు. రేషన్ కార్డ్ హోల్డర్లు పీడీఎస్ సహాయంతో ఆహార ధాన్యాలను పొందుతారనే విషయం తెలిసిందే. అయితే ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అటువంటి పరిస్థితిలో ఎలాంటి సమస్యనైనా పరిష్కరించే ఉద్దేశ్యంతో ‘మేరా రేషన్’ యాప్‌ను ప్రారంభించింది ప్రభుత్వం.

మొబైల్ యాప్ సహాయంతో ఆధార్‌ను లింక్ చేయండి.. మేరా రేషన్ యాప్ సహాయంతో రేషన్ కార్డు కోసం అప్లికేషన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా రేషన్ కార్డును డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు. మీ రేషన్ ఆధార్ కార్డుతో లింక్ చేయబడిందా? లేదా? అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే లింక్ కూడా చేయవచ్చు. మీ రేషన్ కార్డులో ఇప్పటి వరకు ఎంత పంపిణీ జరిగింది, మీ చుట్టుపక్కల రేషన్ డీలర్ దుకాణం ఎక్కడ ఉంది వంటి వివరాలను కూడా సులువుగా తెలుసుకోవచ్చు. ఒకవేళ మీరు రేషన్ డీలర్‌ను మార్చాలనుకుంటే, ఈ మొబైల్ యాప్‌ ద్వారా మార్చుకోవచ్చు. ఈ ఫీచర్లన్నీ ఈ యాప్‌లో 10 విభిన్న భాషల్లో అందుబాటులో ఉన్నాయి.

Also read:

Viral Video: అందమైన ‘అల్బీనో స్నేక్‌’..సొగసు చూడతరమా..!

IND vs SA: ఆఫ్రికన్ గడ్డపై బుమ్రా, శార్దుల్ విధ్వంసం.. గాయాలపాలైన సౌతాఫ్రికా బ్యాటర్లు..!

Sara Ali Khan : లవ్‌ అంటూ ఇద్దరిని ముంచావ్‌.. ఇప్పుడు మూడో వాడు అలా ఉండాలా..(Video)

భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??