AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యో దేవుడా.! కొడుకు కళ్ల ముందు పులికి ఆహారమైన తండ్రి.. ఏం చేయలేక..!

బాలాఘాట్‌ పులి దాడిలో ఒక రైతు మరణించాడు. ఆ రైతు తన పొలంలో ఉన్నప్పుడు పులి అతనిపై దాడి చేసింది. ఈ సంఘటన గ్రామంలో భయాందోళనలను రేకెత్తించింది. అటవీ శాఖ అధికారులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, మృతుడి కుటుంబానికి 25 లక్షల రూపాయల పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. పులి సంచారం పెరుగుతుందని అటవీ అధికారులకు సమాచారం ఇచ్చిప పట్టించుకోలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయ్యో దేవుడా.! కొడుకు కళ్ల ముందు పులికి ఆహారమైన తండ్రి.. ఏం చేయలేక..!
Tiger kills Farmer,
Balaraju Goud
|

Updated on: May 03, 2025 | 3:14 PM

Share

మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ అటవీ ప్రాంతంలోని కాటంగిలోని గోరేఘాట్ సర్కిల్‌లో ఒక రైతుపై పులి దాడి చేసి చంపింది. ఆ రైతు తన పొలంలో కట్టుకున్న గుడిసెలో కూర్చుని ఉన్నాడు. ఈ సమయంలో రైతుపై దాడి చేసిన పులి తన ఆహారంగా మార్చుకుంది. ఈ సంఘటన తర్వాత, గ్రామంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. అటవీ శాఖ బృందం రైతు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుంది. మృతదేహానికి పోలీసులు పోస్టుమార్టం నిర్వహించారు. మరణించిన రైతు కుటుంబానికి పరిహారం అందిస్తామని జిల్లా అధికారులు హామీ ఇచ్చారు.1

కుడ్వా గ్రామం అడవికి ఆనుకొని ఉంది. ఈ గ్రామంలో చాలా మంది రైతులు రబీ వరి పంట వేశారు. అడవి పందులు ప్రతిరోజూ పంటలను నాశనం చేయడానికి వస్తాయి. దీని కారణంగా రైతులు వాటిని తరిమికొట్టడానికి పటాకులు పేల్చుతారు. కుడ్వా గ్రామానికి చెందిన 58 ఏళ్ల రైతు ప్రకాష్, అడవి పందులను భయపెట్టడానికి తెల్లవారుజామున 4 – 5 గంటల మధ్య పటాకులు పేల్చేందుకు పొలానికి వెళ్లాడు. అతను పొలంలో ఏర్పాటు చేసుకున్న గుడిసెలో కూర్చున్నాడు.

రైతు ప్రకాష్ ఉదయం ఇంటికి చేరుకోకపోవడంతో, అతని కుమారుడు పొలంలోని గుడిసెకు వెళ్లి అతని కోసం వెతికాడు. కానీ అతను కనిపించలేదు. ఫోన్ చేశాడు. కానీ అతని ఆచూకీ లభించలేదు. గుడిసె ముందు తన తండ్రిని తినే పులిని చూశాడు. పులిని చూసిన తర్వాత, అతను గ్రామానికి తిరిగి పరిగెత్తి తన కుటుంబానికి, ఇరుగుపొరుగు వారికి సమాచారం ఇచ్చాడు. అందరూ అక్కడికి చేరుకుని శబ్దం చేస్తూ పులిని తరిమికొట్టారు. ఆ పులి రైతు కాలులో సగం తినేసింది. ఈ విషయం అటవీ శాఖకు సమాచారం అందించినప్పటికీ, అటవీ శాఖ 11 గంటల వరకు సంఘటనా స్థలానికి చేరుకోలేకపోయింది. చివరికి రైతు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు చేపట్టారు. అయితే గోరేఘాట్ దగ్గర ఉన్న అడవిలో నుంచి వచ్చిన పులి 15 రోజులుగా పొలాల్లో తిరుగుతోందని స్థానిక రైతులు చెబుతున్నారు.

దీనికి వారం రోజుల ముందు, పొలంలో విశ్రాంతి తీసుకుంటున్న ఒక రైతు ఈ పులిని దగ్గరగా చూశాడు. ఆ సమయంలో పులి నిద్రపోవడం అదృష్టం, లేకుంటే పెద్ద సంఘటన జరిగి ఉండేది. తాజాగా గోరేఘాట్ గ్రామంలో పులి ఐదు మేకలను వేటాడిందని అధికారులు తెలిపారు.

డిసెంబర్ 2024లో కటంగి రేంజ్‌లోని తిరోడి ప్రాంతంలోని ఖైర్లాంజి సిలారి గ్రామంలో ఇలాంటి సంఘటన జరిగింది. పశువులను మేపడానికి, పొలం దున్నడానికి వెళ్ళిన రైతుపై పులి దాడి చేసింది. 55 ఏళ్ల గిరిజన రైతు సుఖ్‌రామ్‌పై నరమాంస భక్షక పులి దాడి చేసి చంపేసింది. ఒకవైపు అటవీ శాఖ గ్రామస్తులను అటవీ ప్రాంతాలకు దూరంగా ఉండాలని నిరంతరం సలహా ఇస్తుండగా, మరోవైపు ఈ సంఘటన కారణంగా గ్రామస్తులలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అటవీ శాఖ పనితీరుపై గ్రామస్తులు ప్రశ్నలు లేవనెత్తారు. అటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి అటవీ శాఖ సిబ్బంది సిద్ధంగా లేరని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలావుంటే, తాజా ఘటనపై అటవీ శాఖ డిప్యూటీ రేంజర్ జ్ఞానిరామ్ ఘోట్ఫోడే స్పందించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిర్వహించామని చెప్పారు. మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించారు. వన్యప్రాణుల దాడుల్లో మరణించిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారాన్ని రూ.25 లక్షలకు పెంచింది. మృతుల కుటుంబాలకు పరిహారం అందజేస్తామని ఆయన అన్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..